ETV Bharat / offbeat

సరికొత్త రుచిలో "కొత్తిమీర ఉల్లిపాయ చట్నీ" - అన్నం, టిఫెన్స్​లోకి సూపర్ కాంబో!

- రుచితో పాటు ఆరోగ్యం బోనస్! - చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు

Kothimeera Ullipaya Chutney Recipe
Kothimeera Ullipaya Chutney (ETV Abhiruchi)
author img

By ETV Bharat Telangana Team

Published : October 6, 2025 at 5:21 PM IST

2 Min Read
Choose ETV Bharat

Kothimeera Ullipaya Chutney Recipe : వేడి వేడి అన్నంలోకి ఏదైనా పచ్చడి వేసుకుని తింటుంటే ఆ టేస్ట్ సూపర్​గా ఉంటుంది. ఈ క్రమంలోనే మెజార్టీ జనాలు టమాటా చట్నీ, దోసకాయ పచ్చడి, కొబ్బరి పచ్చడి వంటివి ఎక్కువగా చేసుకుంటుంటారు. అయితే, ఎప్పుడూ రెగ్యులర్ చట్నీలు కాకుండా ఈసారి డిఫరెంట్​గా ట్రై చేయాలనుకుంటున్నారా? మీకోసమే ఈ సూపర్ రెసిపీ. అదే, నోరూరించే "కొత్తిమీర ఉల్లిపాయ చట్నీ".

తక్కువ పదార్థాలతో ఈజీగా చేసుకునే ఈ చట్నీ చాలా రుచికరంగా ఉంటుంది. తాలింపు లేకుండానే వేడి వేడి అన్నంలోకి కమ్మగా తినేయొచ్చు. ఈ చట్నీ అన్నంలోకి మాత్రమే కాకుండా టిఫెన్స్​లోకి కూడా చాలా బాగుంటుంది. ఇది సూపర్ టేస్టీగా ఉండడమే కాకుండా ఆరోగ్యానికీ మేలు చేస్తుంది! కొత్తిమీర అంటే నచ్చని వాళ్లు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మరి, ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ చట్నీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

Kothimeera Ullipaya Chutney Recipe
కొత్తిమీర (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు
  • నూనె - మూడ్నాలుగు చెంచాలు
  • సన్నని అల్లం ముక్కలు - ఒక చెంచా
  • మినప్పప్పు - రెండు టేబుల్​స్పూన్లు
  • ఎండుమిర్చి - మూడు
  • పచ్చిమిర్చి - ఐదారు
  • ఇంగువ - కొద్దిగా
  • కొత్తిమీర - పిడికెడు
  • ఉప్పు - రుచికి తగినంత
  • చింతపండు గుజ్జు - కొద్దిగా

చుక్క నూనె లేకుండానే - క్రిస్పీ అండ్ టేస్టీ "దోశలు"! - ప్రిపరేషన్ ఈజీ!

Kothimeera Ullipaya Chutney Recipe
ఉల్లిపాయ తరుగు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా ఒక కప్పు పరిమాణంలో ఉల్లిపాయ ముక్కలను కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం తరుగుని సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి.
  • అలాగే, ఒక చిన్న గిన్నెలో చింతపండుని తీసుకుని శుభ్రంగా కడిగి ఆపై తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి.
Kothimeera Ullipaya Chutney Recipe
మినప్పప్పు (Getty Images)
  • ఇప్పుడు స్టవ్ మీద పాన్​ పెట్టి మూడు చెంచాల నూనె వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడయ్యాక సన్నని అల్లం ముక్కలు వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి.
  • అవి వేగాక మినపప్పు, ఎండుమిర్చి తుంపలు, ఇంగువ వేసి వేయించుకోవాలి. అవన్నీ కొద్ది​గా వేగిన తర్వాత పచ్చిమిర్చి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి అవి కాస్త రంగు మారేంత వరకు వేయించాలి.

అరటిపండుతో టేస్టీ "పొంగనాలు" - నిమిషాల్లోనే రెడీ! - చట్నీ లేకుండానే తినేయొచ్చు!

Kothimeera Ullipaya Chutney Recipe
చింతపండు (ETV Abhiruchi)
  • ఆనియన్స్ లైట్​గా వేగాక కొత్తిమీర వేసుకుని కాస్త పచ్చివాసన పోయేలా ఒక నిమిషం పాటు అలా కలుపుతూ వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకుని అందులో చల్లారిన ఉల్లిపాయ మిశ్రమం, రుచికి తగినంత ఉప్పు, అర కప్పు నుంచి కప్పు పరిమాణంలో పల్చని చింతపండు గుజ్జు వేసుకుని మరీ మెత్తగా కాకుండా రోట్లో రుబ్బుకున్నట్లు కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి.
  • తర్వాత దాన్ని ఒక బౌల్​లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే కమ్మని "కొత్తిమీర ఉల్లిపాయ చట్నీ" రెడీ అవుతుంది!
Kothimeera Ullipaya Chutney Recipe
పచ్చిమిర్చి (Getty Images)
  • ఒకవేళ మీరు కావాలనుకుంటే ఈ చట్నీని తాలింపు పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు. అలాకాకుండా పోపు లేకుండానూ వేడి వేడి అన్నంలోకి అద్దిరిపోయే రుచినిస్తుంది!
  • ఈ చట్నీలోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చిని మీరు తినే కారాన్ని బట్టి అందుకు తగినవిధంగా వేసుకోవాలి. అప్పుడే చట్నీకి అసలైన టేస్ట్ వస్తుందని గుర్తుంచుకోవాలి.
  • మరి, నచ్చితే మీరూ ఓసారి ఈ చట్నీని ట్రై చేసి చూడండి. పిల్లలతో పాటు పెద్దలూ ఎంతో ఇష్టంగా తింటారు.

కీరదోసతో కరకరలాడే హెల్దీ "చిప్స్" - నూనె తక్కువ, రుచి ఎక్కువ!