ETV Bharat / offbeat

పల్లీలు, టమాటాలు లేకుండా కమ్మని "కొత్తిమీర పచ్చడి" - అన్నం, టిఫెన్స్​లోకి అదుర్స్​ - రెండు నెలలపైనే నిల్వ!

-కొత్తిమీరతో ఈ తీరులో ఓసారి పచ్చడి ప్రిపేర్ చేసుకోండి -నచ్చనివారు కూడా ఫ్యాన్​ అయిపోతారు!

Kothimeera Pachadi at Home
Kothimeera Pachadi at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 8, 2025 at 9:55 AM IST

3 Min Read
Choose ETV Bharat

Kothimeera Pachadi at Home: కొత్తిమీర ఒక మంచి పోషకాహారం. అయితే సాధారణంగా దీనిని రుచికోసమో, సువాసన కోసమో కూరలు, సాంబారు, రసాలు వంటి వాటిలో వేస్తుంటాం. ఇక నాన్​వెజ్ రెసిపీలు, బిర్యానీ వంటివి చేసుకున్నప్పుడు మాత్రం ఇది తప్పనిసరి. అంతే కాకుండా చాలా మంది కొత్తిమీరతో పచ్చడి కూడా చేస్తుంటారు. కానీ ఈ పచ్చడిలో టమాటాలు వేస్తుంటారు. కానీ ఇవి లేకుండానూ పచ్చడిని ప్రిపేర్​ చేసుకోవచ్చు. దీని టేస్ట్​ చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కొద్దిగా పచ్చడి, నెయ్యి వేసుకుని తింటే అమృతమే. కేవలం అన్నంలోకి మాత్రమే కాకుండా టిఫెన్స్​లోకి పర్ఫెక్ట్​. పైగా రెండు నెలల పైనే నిల్వ ఉంటుంది. మరి లేట్​ చేయకుండా ఈ సూపర్ టేస్టీ అండ్ హెల్దీ కొత్తిమీర పచ్చడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • కొత్తిమీర కట్ట - 1 పెద్దది
  • నూనె - సరిపడా
  • ధనియాలు - 2 టీస్పూన్లు
  • ఎండుమిర్చి - 25
  • ఉప్పు - రుచికి సరిపడా
  • చింతపండు - ఉసిరికాయంత
  • జీలకర్ర - 1 టీస్పూన్​
  • వెల్లుల్లి రెబ్బలు - 4
  • బెల్లం - 1టీస్పూన్​
Kothimeera
Kothimeera (Getty Images)

తాలింపు కోసం:

  • నూనె - 3 టేబుల్​స్పూన్లు
  • పచ్చి శనగపప్పు - 1 టీస్పూన్​
  • మినప్పప్పు - 1 టీస్పూన్​
  • జీలకర్ర - అర టీస్పూన్​
  • ఆవాలు - అర టీస్పూన్​
  • దంచిన వెల్లుల్లి రెబ్బలు - 8
  • ఎండుమిర్చి - 2
  • కరివేపాకు - 2 రెమ్మలు

తయారీ విధానం:

  • ముందుగా కొత్తిమీరను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి 2టీస్పూన్ల నూనె వేసి ధనియాలు, ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్​లో మంచి వాసన వచ్చేవరకు వేయించాలి.
Kothimeera Pachadi
Kothimeera Pachadi (ETV Bharat)
  • ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఓ ప్లేట్​లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు అదే పాన్​లోకి మరికొంచెం నూనె వేసి కట్​ చేసిన కొత్తిమీర వేసి మీడియం ఫ్లేమ్​లో ఫ్రై చేసుకోవాలి.
  • కొత్తిమీర పచ్చివాసన పోయిన మంచిగా వేగిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలి.
Kothimeera Pachadi
Kothimeera Pachadi (ETV Bharat)
  • మిక్సీజార్​లోకి వేయించిన ధనియాలు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి చింతపండు, జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఇందులోకి ఉడికించిన కొత్తిమీర మిశ్రమం, బెల్లం వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్​ చేసుకుని పక్కన ఉంచాలి. అవసరమైతే లైట్​గా నీళ్లు కలుపుకోవచ్చు.
Kothimeera Pachadi
Kothimeera Pachadi (ETV Bharat)
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్​ కాగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి.
  • తాలింపు గింజలు మగ్గిన తర్వాత ఎండుమిర్చి తుంపలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి మరికొద్దిసేపు వేయించాలి.
Kothimeera Pachadi
Kothimeera Pachadi (ETV Bharat)
  • చివరగా కరివేపాకు వేసి చిటపటలాడించిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేయాలి. ఈ తాలింపులోకి గ్రైండ్​ చేసిన కొత్తిమీర మిశ్రమం వేసి బాగా కలుపుకుంటే ఎంతో రుచికరంగా ఉండే కొత్తిమీర పచ్చడి రెడీ.
  • ఈ పచ్చడి గాజు జాడీలో స్టోర్​ చేసుకుంటే దాదాపు రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది. అన్నం, టిఫెన్స్​ ఇలా ఎందులోకైనా అద్దిరిపోతుంది. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Kothimeera Pachadi
Kothimeera Pachadi (ETV Bharat)

చిట్కాలు:

  • ఈ పచ్చడి కోసం లేత కాడలు కలిగిన కొత్తిమీరను ఉపయోగించాలి. ముదిరింది వాడితే తొందరగా ఉడకదు. పైగా రుచి కూడా అంత బాగుండదు.
  • ఇక్కడ ఎండుమిర్చిని మీరు తినే కారానికి అనుగుణంగా వేసుకోవాలి. అలాగే వీటిని కేవలం లో ఫ్లేమ్​లో మాత్రమే వేయించాలి. మిర్చి సరిగ్గా వేగకపోతే పచ్చడి తొందరగా పాడవుతుంది.
  • కొత్తిమీరను వేయించుకునేటప్పుడు మరీ నీరు లేకుండా డ్రైగా మగ్గించుకోవద్దు. ఎందుకంటే పచ్చడి గుజ్జు గుజ్జుగా రావాలంటే కాస్త మగ్గితే సరిపోతుంది.
  • కావాలనుకుంటే పసుపు, ఇంగువను తాలింపు టైమ్​లో వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు.

క్యాటరింగ్​ స్టైల్​ "మునక్కాడ జీడిపప్పు మసాలా కర్రీ" - ఇలా చేశారంటే చక్కటి గ్రేవీ రెడీ - అన్నం, చపాతీల్లోకి అదుర్స్​!

రాగి పిండితో అద్భుతమైన "కిచిడీ" - అమోఘమైన రుచి - ఎముకలకు ఫుల్లు బలం!