Korrala Pongali recipe in Telugu : ప్రసాదంలోకి మాత్రమే కాదు! లంచ్‌లోకి కూడా పొంగలి ఎంతో బాగుంటుంది. ఇలాంటి పొంగలిని ఎంతో ఆరోగ్యదాయకమైన మిల్లెట్స్‌తో కలిపి చేసుకుంటే పొట్ట హాయిగా ఉండడంతో పాటు మధ్యాహ్నం తిన్న వెంటనే నిద్ర కూడా రాదు. వాస్తవానికి పొంగలి వండడం చాలా సింపుల్. ఇలాంటి పొంగలి తక్కువ తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. శరీరాన్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. అంతేకాదు! ఉదయాన్నే బద్ధకాన్ని పోగొడుతుంది.
"బలమైన పోషకాహారం" - మీ పిల్లలకు వారంలో ఒకసారైనా ఇలా పెట్టండి బలంగా ఉంటారు!

కావాల్సిన పదార్థాలు :
- కొర్రలు - 1 కప్పు
- పెసరపప్పు - 1 కప్పు
- మిరియాలు - 1 టీ స్పూన్
- కరివేపాకు - 2 రెమ్మలు
- ఇంగువ - పావు స్పూన్
- జీలకర్ర - 1 టీ స్పూన్
- జీడిపప్పు - 15
- పచ్చిమిర్చి - 2
- నెయ్యి - పావు కప్పు
- ఉప్పు - రుచికి సరిపడా

- తయారీ విధానం :
- కడాయిలో పెసరపప్పు వేయించుకోవాలి. పొంగలి అంటేనే పెసరపప్పు. ఇది చక్కగా వేగితేనే పొంగలికి సరైన రుచి వస్తుంది. దీనిని వేయించడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సన్నటి మంటపై 15 నిమిషాల పాటు వేయిస్తూ ఎర్రగా వేగాక కడిగి పక్కన పెట్టుకోవాలి.

- ఇపుడు ప్రెజర్ కుక్కర్లోకి రాత్రంతా నానబెట్టిన కొర్రలు, వేయించి శుభ్రం చేసుకున్న పెసరపప్పుతో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కావాల్సినట్టుగా ఉడికించుకోవడానికి నాలుగు కప్పుల నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 4 విజిల్స్ ఇవ్వాలి. తొందరగా ఉడకాలని హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మాడిపోయి పొంగలి రుచి మారుతుంది.

- విజిల్స్ పూర్తయ్యాక ప్రెజర్ పోయాక కుక్కర్ మూత తీసి చూస్తే పొంగలి జారుడుగా కనిపిస్తుంది. ఇపుడు జారుగా కనిపించినా తరువాత గట్టిపడుతుంది

- ఇపుడు మరో కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల వేసుకుని జీలకర్ర, మిరియాలు, జీడిపప్పు వేసి ఎర్రగా వేయించాలి. ఇవి 60శాతం వేగాక పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు, ఇంగువ వేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న పెసరపప్పు, కొర్రల్లో వేసుకుని కలుపుకుంటే వేడి వేడి పొంగలి రెడీ.
"ఇడ్లీలు" గట్టిగా వస్తున్నాయా? - ఈ ట్రిక్ ఫాలో అయితే చాలు - దూదిలాంటి మెత్తటి ఇడ్లీలు వస్తాయి!
ఇలా చేస్తే జొన్న రొట్టె కూడా ఉ"ప్పొంగుతుంది" - రొట్టె చేయడం రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు!