Karapusa Recipe : కారప్పూస క్రిస్పీగా, లోపల గుల్ల గుల్లగా రావాలంటే పిండిని కొలతల ప్రకారం కలుపుకోవాలి. మొత్తం శనగ పిండితో చేస్తే మెత్తగా ఉంటాయి. అలాగని బియ్యం పిండి మాత్రమే వాడితే గట్టి పడిపోతాయి. అందుకే క్రిస్పీగా, గుల్లగా రావాలంటే పిండిని సమాన కొలతల్లో తీసుకోవాలి. ఇవి టేస్టీగా ఉండాలంటే కాస్త వాము, జీలకర్ర, పచ్చిమిర్చి కారంతో ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో బాగుంటాయి.
పిల్లలు ఎంతో ఇష్టపడే "పప్పు చెక్కలు" - అప్పటికప్పుడు సింపుల్గా ఇలా చేసి పెట్టండి!

కావాల్సిన పదార్థాలు :
- బియ్యం పిండి - 1 కప్పు
- శనగ పిండి - 1 కప్పు
- వాము - 2 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
- అల్లం ముక్క - 1 ఇంచు
- పచ్చి మిర్చి - 10
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - పావు టీ స్పూన్
- బటర్ - పావు కప్పు

తయారీ విధానం :
- పిండి కలుపుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వాము వేసుకోవాలి. మొత్తం వాము వద్దనుకుంటే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము వేసుకోవచ్చు. అందులో చెక్కు తీసుకున్న అల్లం ముక్క, పది పచ్చి మిర్చి ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి.

- ఆ తర్వాత కావల్సినన్ని నీళ్లు కలుపుకొని ఫిల్టర్ చేసుకోవాలి.
- పిండిలో కలుపుకోవడానికి వీలుగా టీ జల్లెడ లేదా ఒక క్లాత్ లోకి తీసుకుని నీళ్లు వడగట్టుకోవాలి. ఇలా తీసుకున్న నీళ్లు ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకోవాలి.
- ఇపుడు కారప్పూస కోసం 1 గ్లాసు బియ్యం పిండిలోకి 1 గ్లాసు శనగపిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలపడం వల్ల మరీ గట్టిగా, మెత్తగా కాకుండా క్రిస్పీగా, గుల్ల గుల్లగా వస్తాయి.

- రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపుతో పాటు పావు కప్పు వెన్న (బటర్) వేసుకుని బాగా కలుపుకోవాలి. వెన్న బదులు వేడి వేడి నూనె కూడా వేసుకోవచ్చు
- ముందుగా పిండిని బాగా మర్దనా చేయాలి. ఒకసారి బాగా కలుకుకున్న తర్వాత ఫిల్టర్ చేసిన వాము, పచ్చి మిర్చి రసం పోసుకుని కలుపుకోవాలి.

- పిండి మరీ మెత్తగా, అలాగని గట్టిగా కాకుండా సాఫ్ట్ గా కలుపుకోవాలి. ఈ పిండితో లావు కారప్పూస, సన్న కారప్పూస చేసుకోవచ్చు.
- మురుకుల గొట్టంలోకి పిండిని తీసుకుని డీప్ ప్రైకి సరిపడా నూనె కడాయిలో పోసుకుని బాగా మరిగిన తర్వాత మంట తగ్గించుకుని కారప్పూస వత్తుకోవాలి.
- ఒక వైపు, కాలిన తర్వాత రెండో వైపు వత్తుకుని కాల్చుకుంటే సరిపోతాయి.

"ఆంజనేయ వడలు" - రేపు హనుమాన్ జయంతి - స్వామి వారికి వడలు ఇలా చేసి మాల వేయండి!