స్వీట్ షాప్ స్టైల్ "కాలా జామూన్" - ఈ టిప్స్ పాటిస్తూ చేశారంటే నోట్లో వెన్నలా కరిగిపోతుంది!
సింపుల్‌గా చేసుకునే కాలా జామూన్ రెసిపీ - ఇలా ఇంట్లో ఓసారి ట్రై చేసి చూడండి!

By ETV Bharat Andhra Pradesh Team
Published : October 12, 2025 at 4:09 PM IST
Kala Gulab Jamun Sweet : కాలా జామూన్లను చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ స్వీట్ పేరు చెప్పగానే నోట్లో నీళ్లూరుతాయి. ఎందుకంటే పైకి సాఫ్ట్‌గా లోపల జ్యూసీజ్యూసీగా ఉండే దీనిని చూస్తే చటుక్కున నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. అందుకే స్వీట్ షాపుల్లోనూ వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. అయితే దీనిని ఇంట్లోనే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇప్పుడు చెప్పబోయే టిప్స్ పాటిస్తూ కాలా జామూన్ చేశారంటే సేమ్ మిఠాయి దుకాణాల్లో చేసినట్లుగానే వస్తుంది. అంతేకాక పగుళ్లు ఏర్పడటం, పిండి ఉడకకపోవడం వంటి సమస్యలు ఉండవు. ఇలా ఇంట్లో చేసి పెడితే ఇంటిల్లిపాదీ ఇంకోకటి కావాలంటారు. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని ఎలా చేయాలో ఈ స్టోరీలో చూసేయండి.
కుక్కర్లో ఈజీగా చేసుకునే "తలకాయ పులుసు" - ఇలా చేస్తే నీచు వాసన లేకుండా కమ్మగా ఉంటుంది!

కావాల్సిన పదార్థాలు :
- పంచదార - అర కప్పు
- పచ్చి కోవా - పావు కిలో (250 గ్రాములు)
- మైదా - 50 గ్రాములు
- కార్న్‌ఫ్లోర్ - 1 టేబుల్ స్పూన్
- జాపత్రి పొడి - పావు టీ స్పూన్
- పాలపిండి - 1 టేబుల్ స్పూన్
- జాజికాయ పొడి - కొంచెం
- ఆరెంజ్ ఫుడ్ కలర్ - చిటికెడు
- నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

తయారీ విధానం :
- ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో అర కప్పు పంచదార, ఒకటిన్నర కప్పు నీళ్లు పోయాలి. పంచదారను 12 నిమిషాల పాటు కలుపుతూ పాకం వచ్చేవరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి.
- మరోవైపు ప్లేట్లో పావు కిలో పచ్చి కోవా, 50 గ్రాముల మైదా, ఒక టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలి. ఇందులోనే పావు టీ స్పూన్ జాపత్రి పొడి, ఒక టేబుల్ స్పూన్ పాలపిండి, కొంచెం జాజికాయ పొడి, పావు చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ నీళ్లలో వేసిన మిశ్రమం, ఒక టీ స్పూన్ నీరు పోసి బాగా కలపాలి.
- అనంతరం పిండిని పగుళ్లు లేకుండా చిన్నచిన్న బాల్స్ లాగా చేసుకోవాలి.

- ఇంకోవైపు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ పోయాలి. నూనె వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి రెడీ చేసి పెట్టుకున్న జామూన్లను వేయాలి.
- ఇప్పుడు గరిటె పెట్టకుండా జామూన్లను ఆరు నిమిషాల పాటు అలాగే ఉంచాలి. జామూన్లు పైకి తేలిత తర్వాత మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి నల్లగా మారేంత వరకు 15 నిమిషాల పాటు కలుపుతూ వేగనివ్వాలి. (ఇలా మంటను హై ఫ్లేమ్‌లో ఉంచడం వల్ల జామూన్లు లోపల, బయట బాగా ఉడుకుతాయి).
- జామూన్లు చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చాక రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేసి కలపాలి. ఆ తర్వాత మూతపెట్టి గంట సేపు పక్కనుంచాలి.
- గంట తర్వాత జామూన్లను ప్లేట్లోకి తీసుకొని పైన పిస్తా పప్పుతో గార్నిష్ చేసుకోవాలి.
- ఇకంతే టేస్టీటేస్టీ కాలా జామూన్లు సిద్ధంగా ఉంటాయి.
- ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే పిల్లలు, పెద్దలూ సూపర్ అనాల్సిందే!
- మీకు ఈ రెసిపి నచ్చితే ఓసారి ట్రై చేసి చూడండి.
ఊరబెట్టే పనిలేకుండా కమ్మని "నిమ్మకాయ పచ్చడి" - ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు!
రుచికరమైన "బియ్యప్పిండి పూరీలు" - ఇలా చేస్తే ఆయిల్ పీల్చకుండా, పొంగుతాయి!

