ETV Bharat / offbeat

డీప్​ ఫ్రై లేకుండా "కాకరకాయ కొబ్బరి కారం" - వేడివేడి అన్నంలోకి ఎంతో కమ్మగా ఉంటుంది! - KAKARAKAYA KOBBARI KARAM

నోరూరించే కాకరకాయ కొబ్బరి కారం - ఇలా చేస్తే కాకరకాయ ఇష్టం లేని వాళ్లూ ఎంతో ఇష్టంగా తింటారు!

Kakarakaya Kobbari Karam in Telugu
Kakarakaya Kobbari Karam in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 9, 2025 at 5:03 PM IST

2 Min Read

Kakarakaya Kobbari Karam in Telugu : సాధారణంగా మనం కాకరకాయతో ఉల్లికారం, వెల్లుల్లి కారం చేస్తే ఎంత బాగుంటాయో తెలిసిందే. ఓసారి ఇలా కొబ్బరి కారం కూడా ప్రిపేర్​ చేయండి. టేస్ట్​ మాత్రం ఎంతో బాగుంటుంది. వేడివేడి అన్నంతో తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ కొబ్బరి కారం వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. అలాగే ఈ రెసిపీ కోసం కాకరకాయలను ఆయిల్లో డీప్​ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. మరి సింపుల్​గా కాకరకాయ కొబ్బరి కారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

హోటల్ దోసె పిండిలో వంట సోడా వేయరు - కానీ, కిటుకు అంతా అక్కడే!

Kakarakaya
Kakarakaya (ETV Bharat)

కాకరకాయ కొబ్బరి కారం తయారీకి కావాల్సిన పదార్థాలు

  • కాకరకాయలు - అరకేజీ
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఎండిన కొబ్బరి - 1
  • టేబుల్​స్పూన్ - ధనియాలు
  • టీస్పూన్ - జీలకర్ర
  • వెల్లుల్లి - 6
  • కరివేపాకు - 2
  • పసుపు - సరిపడా
  • తగినంత - కారం
Kakarakaya
Kakarakaya (ETV Bharat)

కాకరకాయ కొబ్బరి కారం తయారీ విధానం

  • ముందుగా కాకరకాయలు శుభ్రంగా కడిగి లైట్​గా పైన చెక్కు తీసుకోవాలి. ఆపై సన్నగా గుండ్రంగా ముక్కలుగా కట్​ చేసుకోండి.
  • ఈ కాకరకాయ ముక్కలను బౌల్లోకి తీసుకోండి. ఇందులో అర టీస్పూన్ పసుపు, టీస్పూన్ ఉప్పు వేసి కలిపి మూత పెట్టి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయల్లో నుంచి నీరు వస్తుంది. అలాగే ఎక్కువ చేదు కూడా ఉండవు.
  • ఈలోపు ఎండుకొబ్బరి గ్రేటర్​లో పెద్ద రంధ్రాలున్న వైపు తురుముకోవాలి. ఈ కొబ్బరి తురుము చిన్న బౌల్లోకి తీసుకోండి.
  • అనంతరం కాకరకాయ ముక్కలను గట్టిగా చేతితో పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
Kakarakaya Kobbari Karam
Kakarakaya Kobbari Karam (ETV Bharat)
  • కొబ్బరి కారం చేయడం కోసం ఒక మిక్సీ జార్లో టేబుల్​స్పూన్ ధనియాలు, టీస్పూన్ జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆపై ఇందులో ఎండుకొబ్బరి తురుము, తగినంత ఉప్పు, కారం, వెల్లుల్లి వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి కారం చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​ వెలిగించి పాన్​ పెట్టి 5 టేబుల్​స్పూన్లు ఆయిల్​ వేసి వేడి చేయండి.
  • ఆయిల్​ వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్​లో వేయించుకోవాలి. వీటిని మూత పెట్టకుండానే కలుపుతూ దోరగా వేయించుకోవాలి.
Kakarakaya Kobbari Karam
Kakarakaya Kobbari Karam (ETV Bharat)
  • కాకరకాయ ముక్కలు క్రిస్పీగా వేగిన తర్వాత కరివేపాకు వేసి నిమిషంపాటు వేయించండి.
  • ఆపై ముందుగా గ్రైండ్ చేసిన కొబ్బరి కారం వేసి బాగా కలపండి.
  • ఓ రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
  • అంతే ఇలా సింపుల్​గా ప్రిపేర్​ చేసుకుంటే కమ్మని కాకరకాయ కొబ్బరి కారం రెడీ!
  • వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కాకరకాయ కొబ్బరి కారంతో తింటుంటే టేస్ట్​ అద్దిరిపోతుంది.
  • ఈ కమ్మని కాకరకాయ కొబ్బరి కారం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.

ఈ ఆదివారం "మృగశిర కార్తె" - చేపల పులుసులో 'ఈ మసాలా' వేస్తే గిన్నెలు ఖాళీ చేస్తారు!

"రవ్వ దోసెలు" క్రిస్పీగా రావడం లేదా? - పిండిలో "ఇవి" కలిపి చూడండి - ఎంతో బాగా వస్తాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.