Telangana Panchayat Elections Results2025

ETV Bharat / offbeat

కమ్మని "కాకరకాయ కొబ్బరి కారం" - ఇలా చేస్తే అస్సలు చేదు ఉండదు - రుచి అమోఘం!

-వద్దన్నోళ్లే లొట్టలేసుకుంటూ మరీ తింటారు! -ఫ్రిజ్​లో పెట్టకపోయినా వారం రోజులు నిల్వ!

Kakarakaya Kobbari Karam
Kakarakaya Kobbari Karam (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 3, 2025 at 10:08 AM IST

2 Min Read
Choose ETV Bharat

Kakarakaya Kobbari Karam: ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయలలో కాకరకాయ ఒకటి. ఎందుకంటే దీనిలో శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ, చాలా మంది కాకరకాయతో చేసిన ఏ వంటకం అయినా సరే చేదు అనే కారణంతో పక్కన పెట్టేస్తుంటారు. మరీ, ముఖ్యంగా పిల్లలైతే తినను గాక తినరు. మరి మీ ఇంట్లోనూ కాకరకాయ తినడానికి "నో" చెబుతున్నారా? అయితే, ఓసారి కమ్మగా ఉండే కాకరకాయ కొబ్బరి కారం చేయండి. చేదు లేకుండా టేస్ట్​ సూపర్​గా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ కూర వేసుకుని తింటే మజా వస్తుంది. పైగా వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. మరి లేట్​ చేయకుండా ఈ కాకరకాయ కొబ్బరి కారం ఎలా చేసుకోవాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

  • కాకరకాయలు - అర కేజీ
  • పసుపు - అర టీస్పూన్​
  • ఉప్పు - అర టీస్పూన్​
  • నూనె - పావు కప్పు
  • కరివేపాకు - గుప్పెడు

కొబ్బరి కారం కోసం:

  • ధనియాలు - అర టీస్పూన్​
  • జీలకర్ర - అర టీస్పూన్​
  • ఎండు కొబ్బరి చిప్ప - 1
  • ఉప్పు - సరిపడా
  • కారం- సరిపడా
  • వెల్లుల్లి రెబ్బలు - 7
Kakarakaya Kobbari Karam
Kakarakaya Kobbari Karam (ETV Bharat)

తయారీ విధానం:

  • లేత కాకరకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి పై పొట్టును లైట్​గా తీసేసి రౌండ్​ ముక్కలుగా కట్​ చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు అందులోకి పసుపు, అర టీస్పూన్​ ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి అర గంట పక్కన ఉంచాలి.
  • అర గంట తర్వాత మూత తీసి కాకరకాయ ముక్కలను మరోసారి కలిపి కొన్ని తీసుకుని గట్టిగా పిండి ముక్కలను ఓ గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన కాకరకాయలన్నింటిని ఇలానే పిండి తీసుకోవాలి.
Kakarakaya Kobbari Karam
Kakarakaya Kobbari Karam (ETV Bharat)
  • మిక్సీజార్​లోకి ధనియాలు, జీలకర్ర వేసి ఓసారి గ్రైండ్​ చేయాలి. ఆ తర్వాత ఎండుకొబ్బరి ముక్కలు, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త బరకగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. ఆయిల్​ బాగా కాగిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్​లో మధ్యమధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి.
Kakarakaya Kobbari Karam
Kakarakaya Kobbari Karam (ETV Bharat)
  • ముక్కలు కాస్త మగ్గిన తర్వాత కరివేపాకు వేసి వాటిని క్రిస్పీగా వేయించుకోవాలి.
  • కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్​ చేసిన కొబ్బరి కారం వేసి బాగా కలిపి ఓ 3 నిమిషాలు లో ఫ్లేమ్​లో మగ్గించుకోవాలి.
  • కారం కాస్త మగ్గిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి ఓ గిన్నెలోకి తీసుకుంటే కాకరకాయ కొబ్బరి కారం రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Kakarakaya Kobbari Karam
Kakarakaya Kobbari Karam (ETV Bharat)

చిట్కాలు:

  • కాకరకాయ ముక్కలకు ఉప్పు, పసుపు కలిపి ఊరనిచ్చి గట్టిగా పిండి తీసుకోవడం వల్ల చేదు తగ్గడంతో పాటు ముక్కలు కూడా తొందరగా ఫ్రై అవుతాయి.
  • ఈ కూరకు కాస్త నూనె ఎక్కువే పడుతుంది. కాబట్టి చూసి పోసుకోవాలి. అలాగే కొబ్బరికారం వేసిన తర్వాత ఎక్కువ సేపు మగ్గిస్తే కారం మాడిపోయే అవకాశంతో పాటు కూర రుచి కూడా పాడవుతుంది.
  • ఈ కారాన్ని ఫ్రిజ్​లో పెట్టాల్సిన పనిలేదు. బయట ఉంచినా వారం రోజులు నిల్వ ఉంటుంది. కానీ ముక్కలను సరిగ్గా వేపాలి.
Kakarakaya Kobbari Karam
Kakarakaya Kobbari Karam (ETV Bharat)

హెల్దీ "సొరకాయ జొన్న రొట్టెలు" - ఇలా చేస్తే రుచికరంగా ఉంటాయి!- వెయిట్​లాస్​కు బెస్ట్​ ఆప్షన్​!

ఇన్​స్టంట్​ 'మసాలా టీ' - ఈ పొడి ఉంటే అర నిమిషంలో రెడీ - ఘుమఘుమలాడే స్మెల్​తో సూపర్​ టేస్ట్​​!