ETV Bharat / offbeat

కమ్మని, రుచికరమైన "జొన్న లడ్డూలు" - పాకం పట్టాల్సిన అవసరం లేదు - రోజూ ఒక్కటి తింటే ఆరోగ్యంగా!

-నోట్లో వేసుకోగానే కరిగిపోయే లడ్డూలు! -ఈ పద్ధతిలో చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు!

Tasty and Healthy Jowar Laddu
Tasty and Healthy Jowar Laddu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 13, 2025 at 1:54 PM IST

2 Min Read
Choose ETV Bharat

Tasty and Healthy Jowar Laddu at Home: ఆరోగ్యానికి జొన్నలు చేసే మేలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇందులోని పోషకాలు షుగర్​, బరువును తగ్గించడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, మలబద్ధకాన్ని తగ్గించడం సహా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అందుకే ఈ మధ్య కాలంలో వీటి వాడకం పెరిగింది. మరీ ముఖ్యంగా జొన్నలతో ఇడ్లీ, దోశ, రొట్టెలు, పొంగలి చేసుకునే వారి సంఖ్య అధికమైంది. అయితే జొన్నలతో ఇవి మాత్రమే కాకుండా కమ్మని లడ్డూలు కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే వీటిని అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతాయి. పాకం అవసరం లేకుండా చాలా సింపుల్​గా ప్రిపేర్​ చేసుకోవచ్చు. పిల్లలకు రోజుకొకటి ఇచ్చారంటే చాలా హెల్దీగా తయారవుతారు. మరి లేట్​ చేయకుండా ఈ జొన్న లడ్డూలు ఎలా చేయాలో చూసేయండి.

కావాల్సిన పదార్థాలు:

  • పల్లీలు - 1 కప్పు
  • జొన్న పిండి - 1 కప్పు
  • నెయ్యి - తగినంత
  • జొన్న పిండి - 1 కప్పు
  • బెల్లం తురుము - 1 కప్పు
  • ఎండు కొబ్బరి తురుము - 3 టీస్పూన్లు
  • యాలకులు - 4
Healthy Jowar Laddu
Healthy Jowar Laddu (ETV Bharat)

తయారీ విధానం:

  • ముందుగా జొన్న పిండిని జల్లించి తీసుకోవాలి. అలాగే కావాల్సిన బెల్లాన్ని సన్నగా తురిమి పక్కన ఉంచాలి.
  • స్టవ్ ఆన్​ చేసి కడాయి పెట్టి పల్లీలు వేసి లో ఫ్లేమ్​లో కలుపుతూ మంచి రంగు వచ్చే వరకు వేయించాలి.
  • పల్లీలు బాగా వేగిన తర్వాత ఓ ప్లేట్​లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
Healthy Jowar Laddu
Healthy Jowar Laddu (ETV Bharat)
  • ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి కరిగించాలి. కరిగిన నెయ్యిలో జల్లించిన జొన్న పిండి వేసి లో ఫ్లేమ్​లో వేయించాలి.
  • జొన్న పిండి పచ్చి వాసన పోయి లైట్​గా కలర్​ మారిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి ఓ ప్లేట్​లోకి తీసుకుని పూర్తిగా చల్లార్చుకోవాలి.
  • చల్లారిన జొన్న పిండిలోకి బెల్లం తురుము వేసి మిక్స్​ చేసుకోవాలి.
Healthy Jowar Laddu
Healthy Jowar Laddu (ETV Bharat)
  • మిక్సీజార్​లోకి జొన్న, బెల్లం మిశ్రమం వేసుకోవాలి. ఆపై అందులోకి వేయించిన పల్లీలు, ఎండు కొబ్బరి పొడి, యాలకులు వేసి గ్రైండ్​ చేసుకోవాలి.
  • మెత్తగా గ్రైండ్​ చేసుకున్న తర్వాత కొంచెం పిండి తీసుకుని ముద్దలాగా చేయాలి. పర్ఫెక్ట్​గా వస్తే పిండి రెడీ అయినట్లే. లేదంటే మరో రెండు నిమిషాలు గ్రైండ్​ చేసుకోవాలి.
Healthy Jowar Laddu
Healthy Jowar Laddu (ETV Bharat)
  • ఇలా గ్రైండ్​ చేసిన పిండిని ఓ ప్లేట్​లోకి తీసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలో కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ పిండిని కొంచెం తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి.
  • ఇలా పిండి మొత్తాన్ని లడ్డూలుగా చుట్టుకుని గాలి చొరబడని డబ్బాలో స్టోర్​ చేసుకుంటే జొన్న లడ్డూలు రెడీ. హ్యాపీగా తినొచ్చు. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Healthy Jowar Laddu
Healthy Jowar Laddu (ETV Bharat)

చిట్కాలు:

  • జొన్న పిండిని లైట్​గా కలర్​ మారి, మంచి వాసన వచ్చేవరకు లో ఫ్లేమ్​లో మాత్రమే వేయించుకోవాలి. పిండి మాడిందంటే లడ్డూల రుచీ మారుతుంది.
  • పల్లీలను పొట్టుతో ఉంచే గ్రైండ్​ చేసుకోవాలి. అప్పుడు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం లభిస్తుంది. ఒకవేళ పొట్టు వద్దనుకుంటే తీసేసి వాడుకోవచ్చు.
  • నెయ్యి లేకుండా కూడా లడ్డూలు చుట్టుకోవచ్చు. కానీ నెయ్యి వాడి చేసుకుంటే రుచి మరింత బాగుంటుంది.
  • మీరు ఎంత పరిమాణంలో చేసుకున్న జొన్న పిండి, బెల్లం, పల్లీలు ఒకే కొలతగా తీసుకోవాలి. అప్పుడే వాటి రుచి బాగుంటాయి.

ఎప్పుడూ రొటీన్​ లస్సీ ఏం బాగుంటుంది! - ఓసారి "చాక్లెట్​, డ్రైఫ్రూట్స్​" ఫ్లేవర్లు ట్రై చేయండి! - అద్దిరిపోతాయి!

మండు వేసవిలో మజానిచ్చే "తాటి ముంజల షర్బత్​" - రెండే నిమిషాల్లో రెడీ - ఒక్క గ్లాస్​ తాగితే ఫుల్​ రిఫ్రెష్​!