Jonna Idli Making Process : నేటిరోజుల్లో చాలా మంది ఆరోగ్యం దృష్ట్యా జొన్నలను డైలీ డైట్లో భాగం చేసుకుంటున్నారు. మొన్నటి వరకు మెజార్టీ పీపుల్ ఎక్కువగా జొన్న రొట్టెలను మాత్రమే చేసుకునేవారు. కానీ, ఈ మధ్యకాలంలో జొన్నలతో దోశలు, ఉప్మా ఇలా రకరకాలైన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు. అయితే, అవి మాత్రమే కాదు జొన్నరవ్వతో సూపర్ సాఫ్ట్‌గా "ఇడ్లీలు" కూడా తయారు చేసుకోవచ్చు. మూడే మూడు పదార్థాలతో వీటిని ఎవరైనా చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునేవారికి, షుగర్ పేషెంట్లకు ఈ ఇడ్లీలు సూపర్ ఛాయిస్. మరి, అందుకు కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- జొన్న రవ్వ - 2 గ్లాసులు
- మినపప్పు - 1 గ్లాసు
- ఉప్పు - రుచికి సరిపడా
బరువు, షుగర్‌ను కొట్టే ఫుడ్ ఇదే - "జొన్న దోశలు" ఇలా తయారు చేసుకోండి - టేస్ట్ వేరే లెవల్!
తయారీ విధానం :
- నార్మల్‌గా ఇడ్లీలు చేయాలంటే ముందు రోజు రాత్రే పిండిని సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే పిండి పులిస్తేనే ఇడ్లీలు చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటాయి. కాబట్టి, ఇక్కడ కూడా పిండిని ముందే ప్రిపేర్ చేసుకోవాలి.
- అందుకోసం ముందుగా ఒక బౌల్లో మినపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి, తగినన్ని వాటర్ పోసుకొని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి.
- అలాగే, మరో గిన్నెలో జొన్నరవ్వను తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి.
- మినపప్పు నానిన తర్వాత వాటర్ వడకట్టుకొని మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై అందులో నానబెట్టుకున్న జొన్నరవ్వను శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా వడకట్టుకొని వేసుకొని మొత్తం మిశ్రమం పూర్తిగా కలిసేలా బాగా కలుపుకోవాలి.
- ఆ తర్వాత గిన్నెపై మూతపెట్టి రాత్రంతా పిండిని పులియబెట్టుకోవాలి.
- నెక్ట్స్ డే మార్నింగ్ పిండి పులిసి చక్కగా పొంగుతుంది. అప్పుడు పిండిని ఓసారి కలిపి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి.
- అనంతరం స్టౌ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టి తగినన్ని నీళ్లు పోసి మరిగించుకోవాలి.
- ఆలోపు ఇడ్లీ ప్లేట్స్‌కు నూనె లేదా నెయ్యి అప్లై చేసి జొన్నరవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్స్‌లోకి ఇడ్లీ పిండిని నింపుకోవాలి.
- ఇడ్లీ పాత్రలోని వాటర్ మరుగుతున్నప్పుడు ప్లేట్స్ పెట్టి మూత పెట్టి 10 నుంచి 12 నిమిషాల పాటు హై-ఫ్లేమ్‌లో ఉడికించాలి.
- ఇడ్లీలు ఉడికిన 5 నిమిషాల తర్వాత తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీ అండ్ హెల్దీ "జొన్న ఇడ్లీలు" రెడీ!
- ఆపై వీటిని పల్లీ చట్నీతో తిన్నారంటే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మరి, నచ్చితే మీరూ ఓసారి ఇలా జొన్న ఇడ్లీలను ట్రై చేయండి.
షుగర్ పేషెంట్స్‌కు మేలు చేసే "జొన్న ఉప్మా" - ఈ పద్ధతిలో చేస్తే రుచి అదుర్స్!