ETV Bharat / offbeat

జొన్న పిండితో కమ్మని "పాన్​ కేక్స్​" - పావుగంటలో రెడీ - సూపర్​ టేస్టీ!

- జొన్న పిండితో ఎప్పుడూ చేసే వంటలు కాకుండా, ఇలా పాన్​ కేక్స్​ చేసుకోండి!

Jowar Flour Pan Cakes
Jowar Flour Pan Cakes (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : August 9, 2025 at 1:48 PM IST

2 Min Read
Choose ETV Bharat

Jowar Flour Pan Cakes: పాన్​కేక్స్​ అంటే చాలా మందికి ఇష్టం. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అందుకే చాలా మంది వివిధ రకాలుగా వీటిని ట్రై చేస్తుంటారు. అయితే మీరు ఎప్పుడైనా జొన్న పిండితో చేసే పాన్​ కేక్స్​ తిన్నారా? లేదంటే మాత్రం ఓసారి ట్రై చేయండి. సూపర్​గా ఉంటాయి. చాలా సింపుల్​ అండ్​ టేస్టీగా ప్రిపేర్​ చేసుకోవచ్చు. ఎలాగూ జొన్న పిండి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులోని పోషకాలు బరువు తగ్గించడం నుంచి డయాబెటిస్​ కంట్రోల్​ వరకు హెల్ప్​ చేస్తాయి కాబట్టి హాయిగా తినొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం లేట్​ చేయకుండా సూపర్​ టేస్టీ అండ్​ హెల్దీ జొన్న పిండి పాన్​కేక్స్​ ఎలా చేసుకోవాలో చూసేయండి.

Jowar Flour
Jowar Flour (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • జొన్న పిండి - ఒకటిన్నర కప్పులు
  • రవ్వ - 1 కప్పు
  • పెరుగు - ఒకటిన్నర కప్పులు
  • ఉప్పు - సరిపడా
  • క్యారెట్​ - 1
  • ఉల్లిపాయ - 1
  • క్యాప్సికం - సగ భాగం
  • క్యాబేజీ- చిన్న ముక్క
  • పచ్చిమిర్చి - 4
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • జీలకర్ర - అర టీస్పూన్​
  • పసుపు - పావు టీస్పూన్​
  • ఇంగువ - చిటికెడు
  • బేకింగ్​ సోడా- అర టీస్పూన్​
Curd
Curd (Getty Images)

తయారీ విధానం:

  • పాన్​ కేక్స్​కు​ అవసరమయ్యే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యాప్సికం, కొత్తిమీరను వీలైనంత సన్నగా కట్​ చేసుకోవాలి. అలాగే క్యారెట్​పై పొట్టు తీసేసి సన్నగా తురుముకోవాలి.
  • మిక్సింగ్​ బౌల్​లోకి జొన్న పిండి, బొంబాయి రవ్వ, పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసిన తర్వాత ఓసారి కలపాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా వాటర్​ పోస్తూ పిండిని పాన్​ కేక్స్​ లేదా బన్​ దోశకు సరిపడేలా మిక్స్​ చేసుకోవాలి.
  • వాటర్​ సరిపోయాయి అనుకున్న తర్వాత పిండిని సుమారు 5 నిమిషాల పాటు ఆపకుండా బీట్​ చేసుకోవాలి.
Suji Rava
Suji Rava (Getty Images)
  • ఇలా బీట్​ చేసుకున్న పిండి గిన్నెపై మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టాలి.
  • 10 నిమిషాల తర్వాత జొన్న పిండిలోకి క్యారెట్​, క్యాప్సికం, క్యాబేజీ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి మరోసారి కలపాలి.
  • అనంతరం జీలకర్ర, పసుపు, ఇంగువ వేసి ఇంకోసారి మిక్స్​ చేసుకోవాలి. చివరగా బేకింగ్​ సోడా వేసి కలిపి పక్కన పెట్టాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి తాలింపు పెట్టడానికి ఉపయోగించే చిన్న పాన్​ పెట్టి లైట్​గా నూనె అప్లై చేసుకోవాలి.
Cabbage
Cabbage (Getty Images)
  • నూనె కాగిన తర్వాత పిండిని గరిటెతో పోసుకుని సమానంగా స్ప్రెడ్​​ చేయాలి.
  • మీడియం ఫ్లేమ్​లో ఓ వైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా, క్రిస్పీగా కాల్చుకున్న తర్వాత ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి.
  • ఇలా పిండి మొత్తాన్ని పాన్​కేక్స్​గా ప్రిపేర్​ చేసుకుని వేడివేడి సర్వ్​ చేసుకుని గ్రీన్​ చట్నీ లేదా టమాట సాస్​తో తింటే అద్దిరిపోయే జొన్న పిండితో పాన్​కేక్స్​ రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి.
Jonna Pan Cakes
Jonna Pan Cakes (ETV Bharat)

చిట్కాలు:

  • పిండిలో కప్పుకంటే నీళ్లు ఎక్కువ అవసరం పడవు. కాబట్టి ఆ నీటినే కొద్దికొద్దిగా పోస్తూ పిండిని కలుపుకోవాలి. ఎందుకంటే మిశ్రమం పల్చగా అయితే పాన్​ కేక్స్​ సరిగ్గా రావు.
  • ఈ పాన్​కేక్స్​ చేసుకోవడానికి తాలింపు పెట్టే పాన్​ లేకపోతే దోశ పెనం అయినా వాడుకోవచ్చు. అయితే దోశ పెనం వాడితో రెండు పాన్​కేక్స్​ ప్రిపేర్​ చేసుకోవచ్చు.

'రాఖీ' వేళ భయ్యా కోసం కమ్మని "బర్ఫీ" - బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు చేసుకోవచ్చు!

ఆమ్లెట్ వేస్తే ఇట్లా ఉండాలి! - ఫ్లఫీ ఫ్లఫీగా అద్దిరిపోద్ది!