ETV Bharat / offbeat

పండగలప్పుడే కాదు, సెలవుల్లోనూ సూపర్​గా - పిల్లలకు బలాన్నిచ్చే "జంతికలు" - ఇలా చేస్తే గుల్లగా, కమ్మగా! - CRISPY JANTHIKALU MAKING PROCESS

- మినపప్పుతో ఇలా జంతికలు చేసుకోండి - తక్కువ ఖర్చుతో ఎక్కువ రుచి!

Janthikalu Making
Crispy Janthikalu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 24, 2025 at 11:30 AM IST

4 Min Read

Simple Steps to Make Crispy Janthikalu : పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తినడానికి స్నాక్స్ అడుగుతుంటారు. అలాంటి టైమ్​లో చాలా మంది బయట నుంచి కొని తెచ్చిస్తుంటారు. మరికొందరేమో ఇంట్లోనే రకరకాల వెరైటీలు ట్రై చేస్తుంటారు. అందులో భాగంగానే ఎక్కువ మంది జంతికలు, చెక్కలు, కారపూస వంటి పిండి వంటకాలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు జంతికలు ఎంత బాగా చేసినా క్రిస్పీగా, గుల్లగా రావట్లేదని ఫీల్ అవుతుంటారు. అలాంటి వారు ఓసారి ఇలా పిండి కలిపి మినప జంతికలు చేసుకోండి. పర్ఫెక్ట్​గా కుదరడమే కాకుండా ఎంతో రుచికరంగా వస్తాయి. అంతేకాదు, మినపప్పులో ఉండే పోషకాలు పిల్లలకు మంచి బలాన్నిస్తాయి! పైగా ఈ టిప్స్ పాటిస్తూ చేశారంటే నూనె కూడా చాలా తక్కువ పీల్చుకుంటాయి! మరి, ఈ కరకరలాడే కమ్మని మురుకులు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Janthikalu
Pindi (ETV Bharat)

టిప్స్ :

  • ఇక్కడ కొలతల కోసం మినపప్పు తీసుకున్న కప్పునే వాటర్, బియ్యప్పిండిని తీసుకోవడానికి యూజ్ చేయాలి. అప్పుడే జంతికలు పర్ఫెక్ట్​గా వస్తాయి.
  • ఈ రెసిపీలో మీకు వాము వేసుకోవడం ఇష్టం లేకపోతే దాని ప్లేస్​లో జీలకర్రని అయినా తీసుకోవచ్చు.
  • పిండిలో 'బటర్'​ వేసి కలుపుకోవడం ద్వారా జంతికలు గుల్లగా, క్రిస్పీగా రావడానికి సహాయపడుతుంది.
  • పిండిని జారుడుగా, మరీ ఎక్కువ సాఫ్ట్​గా ఉండకుండా కలుపుకోవాలి. ఎందుకంటే అలా ఉంటే నూనె ఎక్కువ పీల్చే అవకాశం ఉంటుంది.
  • అలాగే, ఆయిల్ కాగిన తర్వాత మాత్రమే జంతికలను వేసి వేయించుకోవాలి. లేదంటే నూనెను ఎక్కువగా పీల్చేస్తాయని గుర్తుంచుకోవాలి.
How  to Make Crispy Janthikalu
Pindi (ETV Bharat)

తీసుకోవాల్సిన పదార్థాలు :

  • మినపప్పు - ఒక కప్పు(120 గ్రాములు)
  • బియ్యప్పిండి - నాలుగు కప్పులు(350 గ్రాములు)
  • వాము - 2 టేబుల్​స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • తెల్లని నువ్వులు - మూడు టేబుల్​స్పూన్లు
  • బటర్ - రెండు టేబుల్​స్పూన్లు
  • పచ్చిమిర్చి పేస్ట్ - ఒక టేబుల్​స్పూన్
  • నూనె - వేయించడానికి తగినంత

వేసవిలో ఒంటికి చలువ చేసే "టిఫెన్" - బరువు తగ్గాలనుకునేవారు, షుగర్ ఉన్నోళ్లు హాయిగా తినొచ్చు!

Simple Steps to Make Janthikalu
Crispy Janthikalu (ETV Bharat)

తయారీ విధానం :

  • ఈ క్రిస్పీ అండ్ టేస్టీ జంతికల కోసం ముందుగా కుక్కర్​లో నాణ్యమైన మినపప్పుని తీసుకొని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత అందులో మూడు కప్పుల నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి.
  • మినపప్పు చక్కగా నానిన తర్వాత కుక్కర్ మూతపెట్టి మీడియం ఫ్లేమ్​లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
  • పప్పుని మంచిగా ఉడికించుకున్నాక కుక్కర్​లోని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి పూర్తిగా చల్లారనివ్వాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో పూర్తిగా చల్లారిన మినపప్పుని కొద్దికొద్దిగా వేసుకుంటూ మెత్తని పేస్ట్​లా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి.
Crispy Janthikalu
Janthikalu (ETV Bharat)
  • తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ లేదా బేషన్​లో పొడి బియ్యప్పిండిని తీసుకొని అందులో రుచికి తగినంత ఉప్పు, వాముని చేతితో నలిపి వేసుకోవాలి.
  • అలాగే, తెల్ల నువ్వులు, బటర్ వేసుకొని అది పిండికి పట్టేలా మిశ్రమం మొత్తాన్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి.
  • తర్వాత జంతికలు కాస్త కారంగా ఉండడానికి కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ వేసి మరోసారి కలుపుకోవాలి.
  • అనంతరం ముందుగా మిక్సీ పట్టి పక్కనుంచిన మినపప్పు పేస్ట్​ని వేసుకొని మిశ్రమం మొత్తం కలిసేలా బాగా కలపాలి.
  • ఆపై కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మరీ మెత్తగా, గట్టిగా కాకుండా జంతికలకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పిండిని చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేయించడానికి తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి.
  • ఆయిల్ వేడయ్యే లోపు జంతికల గొట్టం తీసుకొని లోపల కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత మీకు నచ్చిన షేప్​లో ఉండే జంతికల అచ్చును గొట్టానికి అమర్చుకోవాలి.
Janthikalu
Murukulu (ETV Bharat)
  • అనంతరం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దలో నుంచి కొద్దిగా తీసుకొని జంతికల మౌల్డ్​లో పెట్టుకోవాలి.
  • తర్వాత నూనె రాసిన ప్లేట్ లేదా గరిటెపై జంతికలను గుండ్రంగా లేదా మీకు కావలసిన ఆకారంలో వత్తుకోవాలి.
  • ఆపై కడాయిలో కాగుతున్న నూనె వేడెక్కిందో లేదో చిన్న పిండి ముక్క వేసి చూసుకోవాలి. అది వెంటనే పైకి వస్తే ఆయిల్ సరిగ్గా వేడెక్కినట్లుగా తెలుసుకోవాలి.
  • అప్పుడు మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జంతికలను కాగుతున్న నూనెలో కడాయిలో సరిపడా ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి.
  • అనంతరం స్టవ్​ను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి జంతికలను రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత వాటిని టిష్యూ పేపర్ పరచిన ప్లేట్​లోకి తీసుకోవాలి. కాసేపు ఆగి సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీగా కరకరలాడే "మినప మురుకులు" మీ ముందు ఉంటాయి!
  • నార్మల్​గా బియ్యప్పిండి జంతికల మాదిరిగా ఇవి ఎర్రగా వేగవు. కాబట్టి, కొంచం క్రీమ్ కలర్​లోకి రాగానే తీసేసుకోవాలి.
  • ఆపై వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలు. కనీసం 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి!

పిల్లలు ఇష్టంగా తినే "పప్పు చెగోడీలు" - ఇంట్లోనే చేసుకోండిలా - నూనె పీల్చకుండా గుల్లగా, Extra క్రిస్పీగా!

కప్పు బియ్యంతో కమ్మని "కొబ్బరి గుల్లలు" - పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా! - పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.