IRCTC Hyderabad to Tirupati Tour Package : తిరుమలలో కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తరలివెళ్తుంటారు. ఈ క్రమంలో సాధారణ సమయంలోనే తిరుమలలో రద్దీ అధికంగా ఉంటుంది. ఇక సమ్మర్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిల్లలకు సెలవులు ఉండడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ సంఖ్యలో క్యూ కడతారు. అలాంటి సమయంలో తిరుపతి వెళ్లాలంటే ప్రయాణ, దర్శన టికెట్లు దొరకడమూ కష్టమే. అందుకే, శ్రీవారి దర్శనం సులభతరం చేయడం కోసం IRCTC సమ్మర్ స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఇంతకీ, ఆ ప్యాకేజీ ఏంటి? ఎప్పుడెప్పుడు వెళ్లొచ్చు? టికెట్ ధర? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఐఆర్సీటీసీ "TIRUPATI BY VENKATADRI EXPRESS" పేరుతో ఈ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి సాగే ఈ పర్యటన మొత్తం 3 రాత్రులు, 4 పగళ్లుగా ఉంటుంది. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూరు అమ్మవారి ఆలయం, శ్రీ కాళహస్తి దేవాలయాలను కూడా దర్శించుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ గురువారం, శుక్రవారం తప్ప మిగతా అన్ని రోజుల్లో అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్ - ఇక చాటింగ్‌తోనే రైలు టికెట్

పర్యటన కొనసాగనుందిలా
ఫస్ట్ డే :
హైదరాబాద్ కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి టూర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ రాత్రి 8 గంటల 5 నిమిషాలకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్(ట్రైన్ నంబర్ 12797) బయలు దేరుతుంది. రాత్రంతా జర్నీ కొనసాగుతుంది.
సెకండ్ డే :
రెండో రోజు మార్నింగ్ 7 గంటల 5 నిమిషాలకు రైలు తిరుపతి రీచ్ అవుతుంది. అక్కడ IRCTC సిబ్బంది టూరిస్ట్‌లను పికప్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. తర్వాత ఫ్రెష్ అప్ అయి టిఫెన్ పూర్తి చేసుకున్నాక తిరుచానూరు పద్మావతి టెంపుల్, శ్రీ కాళహస్తి ఆలయాలను దర్శించుకుంటారు. అనంతరం తిరిగి హోటల్‌కు చేరుకొని ఆ రోజు నైట్ అక్కడే స్టే చేస్తారు.
థర్డ్ డే :

మూడో రోజు ఉదయం తెల్లవారు జామున 2.30 గంటలకు హోటల్ నుంచి బయల్దేరి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తారు. అక్కడ ఉచిత దర్శనం క్యూ లైన్లో దించుతారు. మధ్యాహ్నానికి దర్శనం కంప్లీట్ చేసుకుంటారు. అనంతరం తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత ఈవెనింగ్ రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్లో హైదరాబాద్‌కి రైలు బయలుదేరుతుంది. ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది.
ఫోర్త్ డే :
నాలుగో రోజు ఉదయం 6 గంటల 20 నిమిషాలకు కాచిగూడ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. దాంతో మీ టూర్ కంప్లీట్ అవుతుంది.

టికెట్ ధరల విషయానికొస్తే :
- హైదరాబాద్ నుంచి తిరుపతి టూర్ రైలులో 3ఏసీ, స్లీపర్ విభాగాల్లో సాగుతుంది.
- కంఫర్ట్(3AC) : సింగిల్ షేరింగ్‌కు రూ.13,810, డబుల్ షేరింగ్‌కు రూ.10,720, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.8,940 చెల్లించాలి.
- 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు విత్ బెడ్ అయితే రూ.6,480, విత్ అవుట్ బెడ్ అయితే రూ.5,420గా నిర్ణయించారు.
- స్టాండర్డ్(SL) : సింగిల్ షేరింగ్‌కు రూ.12,030, డబుల్ షేరింగ్‌కు రూ.8,940, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.7,170 చెల్లించాలి.
- 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.4,710, విత్ అవుట్ బెడ్ అయితే రూ.3,650 అవుతుంది.

ప్యాకేజీలో ఉండేవివే :
- ఐఆర్సీటీసీ తరపున ఒక బ్రేక్ ఫాస్ట్ మాత్రమే అందిస్తారు. ఆ తర్వాత ఏమైనా తినాలంటే ప్రయాణికులే ఖర్చు భరించాల్సి ఉంటుంది.
- ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
- దర్శన టికెట్లు, గైడ్ వంటివి ప్యాకేజీలో భాగంగా ఉండవని గుర్తుంచుకోవాలి.
- ఈ టూర్ గురువారం, శుక్రవారం తప్ప మిగతా అన్ని రోజులలో అందుబాటులో ఉంటుంది.
- ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ఇంకా టికెట్లు బుక్ చేసుకోవడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
IRCTC ధమాకా ఆఫర్ - 7 రోజుల పాటు నార్త్ ఇండియా టూర్ - శ్రీకృష్ణ జన్మభూమి సహా ఈ ప్రదేశాలన్నీ!
IRCTC బ్యాంకాక్ టూర్ - మండే ఎండల్లో ఫుల్ చిల్ అవ్వొచ్చు - పైగా సపారీ వరల్డ్ టూర్ కూడా!