ETV Bharat / offbeat

హైదరాబాద్​ టూ వయనాడ్​ - అతి తక్కువ ధరకే ఐఆర్​సీటీసీ స్పెషల్​ ప్యాకేజీ! - IRCTC Wonders of Wayanad Package

IRCTC Wayanad Tour: కేరళలోని ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు ఐఆర్​సీటీసీ ప్రత్యేక టూర్​ ప్యాకేజీని ప్రకటించింది. అందుబాటు ధరలోనే ఈ ప్యాకేజీని నిర్వహిస్తోంది. మరి ఈ టూర్​కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

author img

By ETV Bharat Features Team

Published : Sep 19, 2024, 7:11 PM IST

IRCTC Wayanad Tour
IRCTC Wonders of Wayanad Package (ETV Bharat)

IRCTC Wonders of Wayanad Package: పచ్చని కొండలు, ప్రకృతి అందాలకు కేరాఫ్​ అడ్రెస్​ కేరళ. అందుకే చాలా మంది కేరళ విజిట్​ చేసేందుకు ఇష్టపడుతుంటారు. మరి మీరు కూడా కేరళలోని పర్యాటక ప్రదేశాలను వీక్షించాలనుకుంటున్నారా? అయితే మీకో సూపర్​ ఛాన్స్​ ఇస్తోంది.. ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​. కేరళ వయనాడ్​లోని పలు ప్రదేశాలను విజిట్​ చేసేందుకు ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు సాగుతుంది? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు కవర్​ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం..

వండర్స్​ ఆఫ్​ వయనాడ్(​Wonders Of Wayanad) పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది ఐఆర్​సీటీసీ. హైదరాబాద్​ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా ఈ టూర్​ సాగుతుంది. వయనాడ్​లోని పలు ప్రదేశాలను విజిట్​ చేయవచ్చు. ఈ ప్యాకేజీ మొత్తంగా 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ప్రతి మంగళవారం రోజుల్లో ఈ ప్రయాణం ఉంటుంది. జర్నీ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు ఉదయం 6 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ Mangalore Central Express బయలుదేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం 06.17 నిమిషాలకు కన్నూర్​కు చేరుకుంటారు. అక్కడ ముందుగానే బుక్​ చేసిన హోటల్​ చెకిన్​ అయ్యి ఫ్రెష్ అప్​ అవ్వాలి. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. అనంతరం సెయింట్ ఏంజెలో ఫోర్ట్​, అరక్కల్ మ్యూజియంను సందర్శిస్తారు. అక్కడి నుంచి వయనాడ్​కు జర్నీ స్టార్ట్​ అవుతుంది. మధ్యలో కొన్ని పర్యాటక ప్రాంతాలను విజట్​ చేయవచ్చు. ఆ రాత్రి కాల్పెట్టలో బస చేస్తారు.
  • మూడో రోజు ఉదయం హోటల్ బ్రేక్​ఫాస్ట్ తర్వాత కుర్వాదీప్​లోని పలు ప్రాంతాలను సందర్శిస్తారు. తిరునెల్లి ఆలయం, బాణాసూర సాగర్ డామ్​ను విజిట్​ చేస్తారు. ఆ రాత్రికి కూడా కాల్పెట్టలోనే బస చేస్తారు.
  • నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్ తర్వాత అంబల్వాయల్ హెరిటేజ్ మ్యూజియం, స్కూయిపారా ఫాల్స్, ఎడక్కల్ గుహాలు, పొక్కొడే సరస్సును సందర్శిస్తారు. రాత్రి కాల్పెట్టలోనే స్టే చేయాలి.
  • ఐదో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. అక్కడినుంచి కొజికోడ్​కు చేరుకుంటారు. కప్పడ్ బీచ్ తర్వాత సాయంత్రం ఎస్ఎం స్ట్రీట్​లో షాపింగ్ చేయవచ్చు. అనంతరం రాత్రికి కాలికట్ రైల్వ్​స్టేషన్​కు వెళ్తారు. ఆ రాత్రి 11.35కి హైదరాబాద్​కు రిటర్న్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది.
  • ఆరో రోజు రాత్రి 11. 40 గంటలకు కాచిగూడకు చేరుకోవటం టూర్ పూర్తవుతుంది.

అయోధ్య రామయ్యతో పాటు కాశీ విశ్వనాథుని దర్శనం - రూ.16వేలకే ఐఆర్​సీటీసీ అద్దిరిపోయే ప్యాకేజీ!

ధర వివరాలు చూస్తే:

కంఫర్ట్​(3AC): సింగిల్​ షేరింగ్​ రూ.36,590, డబుల్​ షేరింగ్​ రూ.20,700, ట్రిపుల్​ షేరింగ్​ రూ.16,280గా ఉన్నాయి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.10,510, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.9,060గా నిర్ణయించారు.

స్టాండర్డ్(Non AC SL)​: సింగిల్​ షేరింగ్​ రూ.33,790, ట్విన్​ షేరింగ్​ రూ.17,900, ట్రిపుల్​ షేరింగ్​ రూ.13,490గా నిర్ణయంచారు. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.7,720, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.6,260గా నిర్ణయించారు.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ట్రైన్​ టికెట్లు
  • లోకల్​ ప్లేస్​లు చూడటానికి ప్యాకేజీని బట్టి ఏసీ వాహనం
  • హోటల్​లో స్టేతో పాటు 3 బ్రేక్​ఫాస్ట్​లు
  • ప్రస్తుతం ఈ టూర్​ అక్టోబర్​ 1 నుంచి డిసెంబర్​ 17వరకు అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, టూర్​ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

హైదరాబాద్​ to కాశీ - కేవలం రూ.15 వేలకే ఆరు రోజుల టూర్!

"గాడ్స్ ఓన్ కంట్రీ"కి IRCTC సూపర్ ట్రిప్ - ప్రకృతి సోయగాల్లో తడిసి ముద్దైపోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.