ETV Bharat / offbeat

IRCTC బ్యాంకాక్​ టూర్​ - మండే ఎండల్లో ఫుల్​ చిల్​ అవ్వొచ్చు - పైగా సపారీ వరల్డ్​ టూర్​ కూడా! - IRCTC THAILAND TOUR DETAILS

-సమ్మర్​ థాయ్​లాండ్​కు వెళ్లి ఫుల్​ చిల్​ అవ్వొచ్చు! -తక్కువ ధరకే ఐఆర్​సీటీసీ టూర్​

IRCTC Thailand Tour
IRCTC Thailand Tour (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : March 27, 2025 at 10:13 AM IST

Updated : March 27, 2025 at 11:09 AM IST

3 Min Read

IRCTC Treasures of Thailand Ex Hyderabad: బెస్ట్​ ఇంటర్నేషనల్​ టూరిస్ట్​ స్పాట్స్​లో థాయ్‌లాండ్‌ ఒకటి. బ్యాంకాక్‌ బీచ్‌లో ఎంజాయ్‌ చేయాలని చాలా మంది అనుకుంటుంటారు. ముఖ్యంగా యూత్​కైతే ఇది ఫెవరేట్‌ డెస్టినేషన్‌. అయితే ఫారిన్​ ట్రిప్​ అనగానే కాస్ట్​ ఎక్కువనే అనుమానం సహజం. కానీ, ఐఆర్‌సీటీసీ (IRCTC) అందుబాటు ధరలోనే వీటిని ఆఫర్‌ చేస్తోంది. మరి థాయ్‌లాండ్‌ అందాల్ని ఆస్వాదించేందుకు ఐఆర్‌సీటీసీ అందిస్తున్న టూర్‌ ప్యాకేజ్ ఏంటి? ఎన్ని రోజులు? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​ "ట్రెజర్స్​ ఆఫ్​ థాయ్‌లాండ్‌ ఎక్స్​ హైదరాబాద్"​ (Treasures of Thailand Ex Hyderabad) పేరిట టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. ఇది మొత్తం మూడు రాత్రులు, 4 పగళ్లు కొనసాగుతుంది. హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా ఈ టూర్​ ప్రారంభమవుతుంది. థాయ్‌లాండ్‌లో ప్రముఖ టూరిస్ట్‌ కేంద్రాలైన కోరల్‌ ద్వీపం, పట్టయ, బ్యాంకాక్‌లో పలు సందర్శనీయ స్థలాలను వీక్షించొచ్చు.

Pattaya
Pattaya (Getty Images)

ప్రయాణం:

  1. మొదటి రోజు అర్ధరాత్రి 1 గంటకు హైదరాబాద్​లోని రాజీవ్​గాంధీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​ నుంచి రాత్రి బ్యాంకాక్​కు ఫ్లైట్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. ఉదయం 6 గంటలకు బ్యాంకాక్​ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ ఫార్మాలిటీస్‌ పూర్తి చేస్తారు. అక్కడి నుంచి పట్టయకు వెళ్లి హోటల్​లో చెకిన్​ అవుతారు. ఫ్రెషప్​ అనంతరం బ్రేక్​ఫాస్ట్​ ఉంటుంది. ఆ తర్వాత హోటల్​లోనే మధ్యాహ్నం వరకు రెస్ట్​ తీసుకుంటారు. లంచ్​ తర్వాత పట్టయలో జెమ్స్​ గ్యాలరీ విజిట్​ చేస్తారు. సాయంత్రం అల్కజార్‌ షోను వీక్షించి, రాత్రి ఇండియన్​ రెస్టరెంట్​లో డిన్నర్​ ఉంటుంది. ఆ రాత్రి పట్టయలో బస ఉంటుంది.
  2. రెండో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత కోరల్​ ద్వీపంలో స్పీడ్‌ బోటింగ్‌ ఉంటుంది. అక్కడే బీచ్‌లో కాసేపు సేదదీరొచ్చు. ఇండియన్​ రెస్టారెంట్​లో లంచ్​ ఉంటుంది. ఆ తర్వాత నూంగ్​ నుచ్​ ట్రోపికల్​ గార్డెన్​ చూడొచ్చు. పట్టయకు తిరిగి రావడంతో ఆరోజు పూర్తవుతుంది. రాత్రి స్టే అక్కడే ఉంటుంది.
  3. మూడో రోజు బ్రేక్​ఫాస్ట్ హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయిన తర్వాత ​ సఫారీ వరల్డ్ టూర్‌ అండ్​ మెరైన్​ పార్క్​ విజిట్​ ఉంటుంది. సాయంత్రానికి బ్యాంకాక్​కు చేరుకుంటారు. స్థానికంగా ఉన్న పలు ప్రాంతాలను చూస్తారు. ఆ రాత్రి బ్యాంకాక్​లోనే స్టే ఉంటుంది.
  4. నాలుగో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత బ్యాంకాక్ సిటీలోని పలు ప్రాంతాలను చూస్తారు. తర్వాత బ్యాంకాక్‌లోని గోల్డెన్‌ బుద్ధ, మార్బుల్ బుద్ధ సందర్శిస్తారు. తర్వాత షాపింగ్‌ ఉంటుంది. సాయంత్రం ఆరు గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకోని అక్కడి నుంచి హైదరాబాద్​కు రిటర్న్​ అవుతారు. భాగ్యనగరం చేరుకోవడంతో ఈ టూర్​ ముగుస్తుంది.
Wat Trimit
Wat Trimit (Getty Images)

ప్యాకేజీ ధరలు చూస్తే:

  • హైదరాబాద్ - థాయ్ లాండ్ టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ.54,600గా ఉంది. డబుల్ షేరింగ్​కు రూ.47,580గా నిర్ణయించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ.47,580గా ప్రకటించారు.
  • పిల్లలకు చైల్డ్​ విత్​ బెడ్​ అయితే రూ.45,390గా, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.40,100గా ధరలు ఉన్నాయి.
Alcazar Show
Alcazar Show (Getty Images)

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ఫ్లైట్​ టికెట్లు (హైదరాబాద్​ - బ్యాంకాక్​ - హైదరాబాద్​)
  • హోటల్​ అకామిడేషన్​
  • 4 బ్రేక్​ఫాస్ట్​, 4 లంచ్​, 4 డిన్నర్​
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • సందర్శించే ప్రదేశాల ఎంట్రీ టికెట్లు
  • ప్రస్తుతం ఈ టూర్​ ఏప్రిల్​ 24వ తేదీన అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీ సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​ పై క్లిక్​ చేయండి.
Nong Nooch Tropical Garden
Nong Nooch Tropical Garden (Getty Images)

IRCTC బంపర్​ ఆఫర్​ - ఒకే ట్రిప్​లో కృష్ణుడు ఏలిన ద్వారక, సోమనాథ్​ జ్యోతిర్లింగం - ధర తక్కువే!

సెలవులకు ముందే తిరుమల వెళ్లేవారికి - IRCTC సూపర్ ప్యాకేజీ - శ్రీకాళహస్తి కూడా!

Last Updated : March 27, 2025 at 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.