ETV Bharat / offbeat

రాజస్థాన్​ కోటల రాజసం చూస్తారా? - తక్కువ ధరలోనే IRCTC అద్భుతమైన ప్యాకేజీ! - IRCTC Royal Rajasthan Package

IRCTC Tour Packages : రాజస్థాన్‌లోని ప్రసిద్ధ కట్టడాలను వీక్షించాలనుకుంటున్నారా? అయితే ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ అవకాశం ఇస్తోంది. రాజస్థాన్​లోని పలు ప్రాంతాలను చూసేందుకు ప్యాకేజీ ఆపరేట్​ చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 16, 2024, 11:49 AM IST

IRCTC Tour Packages
IRCTC Royal Rajasthan Package (ETV Bharat)

IRCTC Royal Rajasthan Package: రాజస్థాన్‌ అనగానే.. రాచరికానికి దర్పం పట్టే కోటలు, ప్యాలెస్‌లు, సరస్సులు.. ఇలా ఎన్నో మదిలోకి వస్తాయి. ఫేమస్​ సెలబ్రిటీల వివాహాలు కూడా ఎక్కువగా ఇక్కడే జరుగుతుంటాయి. అందుకే చాలా మంది వీటిని చూడాలని అనుకుంటుంటారు. అందుకే.. ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) అందుబాటు ధరలోనే ప్యాకేజీని ఆపరేట్​ చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

రాజస్థాన్​లోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు ఐఆర్​సీటీసీ టూరిజం "‘రాయల్‌ రాజస్థాన్‌ (ROYAL RAJASTHAN)" పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా ఈ టూర్​ను ఆపరేట్​ చేస్తున్నారు. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌తో పాటూ ఉదయ్‌పూర్‌, జోధ్‌పూర్‌ వంటి నగరాలను సందర్శించొచ్చు. 5 రాత్రులు, 6 పగళ్లతో ఈ టూర్‌ ఉంటుంది. ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటిరోజు:హైదరాబాద్‌ ఎయిర్​పోర్ట్​ నుంచి తెల్లవారుజామున 4:45 గంటలకు ఫ్లైట్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. రెండు గంటల్లో జైపూర్ విమానాశ్రయానికి రీచ్​ అవుతారు. ఫార్మాలిటీస్​ పూర్తయిన తర్వాత.. అక్కడి నుంచి హోటల్​కు తీసుకెళ్తారు. ఫ్రెషప్​ అనంతరం జైపూర్​ సిటీ ప్యాలెస్​ వీక్షిస్తారు. తిరిగి హోటల్​కు చేరుకుని లంచ్​ పూర్తి చేసి అమేర్‌ ఫోర్ట్‌ చూడటానికి వెళ్తారు. తిరిగి అదే హోటల్‌లో భోజనం,స్టే చేయాల్సి ఉంటుంది.
  • రెండో రోజు: ఉదయం బ్రేక్​ఫాస్ట్​ పూర్తి చేసుకున్నాక హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి పుష్కర్​కు బయలుదేరుతారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యి పుష్కర్​ ఆలయాన్ని సందర్శిస్తారు. ఒకవేళ సమయం ఉంటే షాపింగ్‌ చేసుకోవచ్చు. ఆ రాత్రికి భోజనం, బస ఆ హోటల్​లోనే ఉంటుంది.
  • మూడో రోజు: ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత జోధ్‌పూర్‌కు బయల్దేరుతారు. మెహ్రాన్‌ఘర్ కోటను సందర్శిస్తారు. ఆ తర్వాత హోటల్​లో చెకిన్​ అవుతారు. ఆ రాత్రికి భోజనం, స్టే జోధ్​పూర్​లో ఉంటుంది.
  • నాలుగో రోజు: ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హోటల్​ నుంచి చెక్​ అవుట్​ చేసి ఉమైద్ భవన్ ప్యాలెస్ అందాలు వీక్షిస్తారు. అక్కడి నుంచి రణక్​ పూర్​ బయలుదేరుతారు. అక్కడ జైన దేవాలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి ఉదయ్​పూర్​ స్టార్ట్​ అవుతారు. అక్కడికి చేరుకుని హోటల్​లో చెకిన్​ అయ్యి.. రాత్రికి భోజనం, స్టే అక్కడే చేస్తారు.
  • ఐదో రోజు: హోటల్​లో బ్రేక్​ఫాస్ట్​ తర్వాత సిటీ ప్యాలెస్​ అందాలు వీక్షిస్తారు. మధ్యాహ్నం నాథ్​ద్వారా వెళ్తారు. అక్కడ స్టాచ్యూ ఆఫ్​ బిలీఫ్ దర్శించుకుంటారు. తిరిగి ఉదయ్​పూర్​ చేరుకుంటారు. ఆ రోజు రాత్రి ఉదయపూర్‌ హోటల్‌లో డిన్నర్​ ఇంకా స్టే ఉంటుంది.
  • ఆరో రోజు: ఉదయం బ్రేక్​ఫాస్ట్​ అనంతరం హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి సహేలియోన్‌ కీ బరీ చూస్తారు. ఆ తర్వాత ఎయిర్​పోర్ట్​కు స్టార్ట్​ అవుతారు. సాయంత్రం 4:45 గంటలకు విమానం హైదరాబాద్​కు స్టార్ట్​ అవుతుంది. సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్​ చేరుకోవడంతో టూర్​ పూర్తవుతుంది.

కూర్గ్​ అందాలను చూసేందుకు - IRCTC సూపర్​ ప్యాకేజీ! ధర చాలా తక్కువ!

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ఫ్లైట్​ టికెట్లు(హైదరాబాద్‌- జైపూర్‌/ ఉదయ్​పూర్​- హైదరాబాద్‌)
  • జైపూర్‌, పుష్కర్​, జోధ్‌పుర్‌లో, ఉదయ్‌పుర్‌ హోటల్స్​లో బస.
  • 6 బ్రేక్​ఫాస్ట్​లు, 5 లంచ్​, 5 డిన్నర్​లు ఈ ప్యాకేజీలో ఉంటాయి.
  • పర్యాటక ప్రదేశాలు చూసేందుకు ఏసీ బస్సు అందుబాటులో ఉంటుంది.
  • ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ సదుపాయం ఉంటుంది.
  • ఐఆర్‌సీటీసీ టూర్‌ గైడ్​ అందుబాటులో ఉంటారు.

ప్యాకేజ్‌ ఛార్జీలు.. (ఒక్కొక్కరికీ)

  • సింగిల్‌ షేరింగ్​కు రూ.41,950, డబుల్​ షేరింగ్‌ అయితే రూ.32,900, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ అయితే రూ.31,650 చెల్లించాలి.
  • ఇక 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు ఒకరికి విత్‌ బెడ్‌ అయితే రూ.28,650, విత్‌ అవుట్‌ బెడ్‌ అయితే రూ.25,500 చెల్లించాలి.
  • 2-4 సంవత్సరాల మధ్య చిన్నారులకు రూ.19,400 చెల్లించాలి.
  • ప్రస్తుతానికి ఈ టూర్​ సెప్టెంబర్​ 23న మొదలవుతుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

హైదరాబాద్​ to కాశీ - కేవలం రూ.15 వేలకే ఆరు రోజుల టూర్!

IRCTC దివ్యమైన తిరుమల ప్యాకేజీ - శ్రీవారి స్పెషల్​ దర్శనంతోపాటు మరెన్నో! - IRCTC Tirupati Tour

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.