ETV Bharat / offbeat

అయోధ్య రామయ్యతో పాటు కాశీ విశ్వనాథుని దర్శనం - రూ.16వేలకే ఐఆర్​సీటీసీ అద్దిరిపోయే ప్యాకేజీ! - IRCTC Holy Uttar Pradesh Package

IRCTC Tour Packages : అయోధ్య రామయ్యను దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. ఐఆర్​సీటీసీ సూపర్​ ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్​కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2024, 4:26 PM IST

IRCTC Holy Uttar Pradesh Package
IRCTC Holy Uttar Pradesh Package (ETV Bharat)

IRCTC Holy Uttar Pradesh Package: ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలనుకునే భక్తులకు, ప్రకృతి అందాలు వీక్షించాలనుకునే టూరిస్టుల కోసం ఇండియన్‌ రైల్వే అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) అనేక టూరిజం ప్యాకేజీలను ఆపరేట్​ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అయోధ్య రామయ్యను, కాశీ విశ్వనాథుడిని దర్శించుకునేందుకు అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి ఈ టూర్​ ప్రయాణం ఎలా ఉంటుంది? ఎన్ని రోజులు? ధర ఎంత? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హోలీ ఉత్తర్​ప్రదేశ్​ యాత్ర(Holy Uttar Pradesh) పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది ఐఆర్​సీటీసీ. హైదరాబాద్ నుంచి ట్రైన్​లో వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలో వారణాసి, అయోధ్య, ప్రయాగరాజ్​ వంటి ప్రదేశాలను కవర్​ చేస్తారు. ఈ టూర్​ మొత్తంగా 5 రాత్రులు, 5 పగళ్లు ఉంటుంది. ఆదివారం రోజున ఈ టూర్​ ఆపరేట్​ చేస్తున్నారు.

ప్రయాణం ఇలా ఉంటుంది:

  • మెదటి రోజు ఉదయం 9:25 గంటలకు సికింద్రాబాద్‌ (దానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ నం: 12791) నుంచి ట్రైన్​ జర్నీ ​ ప్రారంభమవుతుంది. ఆ రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
  • రెండో రోజు మధ్యాహ్నానికి వారణాసి చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్​ చేసుకుని ముందుగా బుక్‌ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ చెకిన్​ అవ్వాలి. ఆ రోజు సాయంత్రం కాశీ విశ్వనాథుని పుణ్యక్షేత్రం, గంగ హారతి వీక్షిస్తారు. ఆ రాత్రి అక్కడే వారణాసిలోనే బస ఉంటుంది.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్ తర్వాత​ వారణాసిలో ప్రసిద్ధ ఆలయాలను (కాశీ విశ్వనాథ ఆలయం, కాలభైరవ్‌ మందిర్‌, బిర్లా మందిర్​ను) సందర్శిస్తారు. మధ్యాహ్నం అయోధ్యకు స్టార్ట్​ అవుతారు. అయోధ్య హోటల్​లో చెకిన్​ అయిన తర్వాత.. ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు.
  • నాలుగో రోజు టిఫెన్‌ తిన్న తర్వాత.. అయోధ్య ఆలయం, హనుమంతుని దర్శనం, దశరథ్‌ మహల్‌ను చూసి వస్తారు. మధ్యహ్నం ప్రయాగరాజ్​కు బయలుదేరి నైట్​కు అక్కడికి చేరుకుంటారు. హోటల్​లో చెకిన్​ అయిన తర్వాత ఆ రాత్రి అక్కడ బస చేస్తారు.
  • ఐదో రోజు తెల్లవారుజామున త్రివేణి సంగమాన్ని సందర్శించుకుంటారు. అక్కడి నుంచి హోటల్​కి వచ్చి బ్రేక్​ఫాస్ట్​ కంప్లీట్​ చేసుకుంటారు. మధ్యాహ్నం హోటల్​ నుంచి చెక్​ అవుట్​ తర్వాత ఆనంద్​ భవన్​, ఖుస్రో బాగ్ విజిట్​ చేస్తారు. సాయంత్రానికి ప్రయాగరాజ్​ రైల్వే స్టేషన్​ చేరుకుంటారు. రాత్రి 7:45నిమిషాలకు సికింద్రాబాద్‌ (ట్రైన్‌ నం: 12792)కు ట్రైన్​ బయలుదేరుతుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
  • ఆరో రోజు రాత్రి 9:30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో టూర్​ కంప్లీట్​ అవుతుంది.

హైదరాబాద్​ to కాశీ - కేవలం రూ.15 వేలకే ఆరు రోజుల టూర్!

ఈ టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే…

కంఫర్ట్ క్లాస్​లో ..

  • సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 41,460/-, ట్విన్​ షేరింగ్​కు రూ. 24,530, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 19,840గా ఉంది.
  • 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ. 14,780, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ. 13,540గా నిర్ణయించారు.

స్టాండర్డ్ క్లాస్​లో..

  • సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 21,990, ట్విన్​ షేరింగ్​కు రూ. 17,410, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.16,830గా నిర్ణయించారు.
  • 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ. 13వేలు, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ. 11,760గా ఉంది.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ఎంచుకున్న ప్యాకేజీని బట్టి రైల్లో (3 ఏసీ/ స్లీపర్‌ క్లాస్‌) ప్రయాణం ఉంటుంది.
  • ప్యాకేజీని బట్టి స్థానికంగా ప్రయాణానికి ఏసీ గదులు, వాహనం ఏర్పాటు చేస్తారు.
  • మూడు రోజులు బ్రేక్​ఫాస్ట్​, డిన్నర్​ ఉంటుంది.
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​ ఉంటుంది.
  • పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ఎంట్రీ ఫీజులు ఉంటే సందర్శకులే చెల్లించాలి.
  • ప్రస్తుతం ఈ టూర్​ ప్యాకేజీ సెప్టెంబర్​ 22, అక్టోబర్​ 6, 13, 20, 27వ తేదీలలో అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్‌ కోసం ఈ లింక్​పై క్లిక్‌ చేయండి..

హైదరాబాద్​ టూ అయోధ్య వయా వారణాసి - రూ.16వేలకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ!

రాజస్థాన్​ కోటల రాజసం చూసి తీరాల్సిందే - తక్కువ ధరకే IRCTC సూపర్​ ప్యాకేజీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.