ETV Bharat / offbeat

IRCTC ఉత్తర భారత పుణ్యక్షేత్ర టూర్ - సెలవులు ముగిసేలోగా వెళ్లి రండి! - IRCTC NORTH TOUR

- వైష్ణోదేవి ఆలయం నుంచి రుషికేష్ దాకా - 9 రాత్రులు, 10 పగళ్లు సాగనున్న యాత్ర

irctc north tour
irctc north tour (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : June 8, 2025 at 12:33 PM IST

2 Min Read

irctc mata vaishno devi temple yatra : ఇండియన్ రైల్వే ఓ వైపు ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరుస్తూనే, మరోవైపు విహార యాత్రలకూ, పుణ్యక్షేత్రాలకూ తిప్పుతోంది. తక్కువ ధరకే ఆయా ప్రాంతాలను చూపిస్తోంది. భారత గౌరవ టూరిస్ట్ ట్రైన్స్ ద్వారా పలు ప్యాకేజీలు ఆపరేట్ చేస్తోంది. అలాంటి వాటిల్లో "మాతా వైష్ణో దేవీ విత్​ హరిద్వార్​ రిషికేశ్​ టూర్" ఒకటి. నార్త్​ ఇండియాలోని ప్రముఖ దేవాలయాలను చూసి రావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్.

త్వరలోనే వేసవి సెలవులు కూడా ముగిసిపోనున్నాయి. మరి, ఉత్తర భారత యాత్రకు వెళ్లాలని మీరు అనుకుంటూ ఉంటే గనక సెలవుల్లోనే వెళ్లిరండి. మరి, ఈ టూర్​లో ఏ పుణ్య క్షేత్రాలను సందర్శించొచ్చు? టికెట్ ధర ఎంత? వంటి వివరాలను ఈ స్టోరీలో చూద్దాం.

సందర్శించే ప్రాంతాలు ఇవే :

  • ఈ టూర్ ప్యాకేజీలో యాత్రికులు వైష్ణోదేవి ఆలయం, రిషికేశ్‌, హరిద్వార్‌, ఆగ్రా, మధుర వంటి ప్రముఖ ఆలయాలను సందర్శిస్తారు. ఈ యాత్ర మొత్తం 9 రాత్రులు, 10 పగళ్లు ఉంటుంది.

టూర్ సాగుతుందిలా:

  • ఈ యాత్ర విజయవాడ నుంచి మొదలవుతుంది.
  • గుంటూరు, సికిందరాబాద్, కాజీపేట్, నాగ్‌పూర్, ఆగ్రా, మధుర, కట్రా, హరిద్వార్, రుషికేశ్ వరకు వెళ్తుంది.
  • యధావిధిగా తిరిగి విజయవాడ చేరుకోవడంతో టూర్ ముగిస్తుంది.

"మంచు కొండల్లో సూర్యోదయం" - IRCTC నేపాల్​ టూర్​ - 7 రోజులు ఫుల్​ ఎంజాయ్​!

  • టికెట్ ధరలు ఇలా ఉంటాయ్ :
  • స్లీపర్ : ఈ విభాగంలో పెద్దలకు రూ.17,940, 5 నుంచి 11 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు రూ.16,820గా ఉంది
  • 3AC : ఈ విభాగంలో పెద్దవాళ్లకు రూ.29,380, 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు రూ.28,070గా నిర్ణయించారు.
  • 2AC : ఈ విభాగంలో పెద్దలు రూ.38,770, 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.37,200 చెల్లించాల్సి ఉంటుంది.

టూర్​లోని సౌకర్యాలు ఇవే :

  • ఈ టూర్​లో ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అందిస్తారు. ఛాయ్ కూడా ప్యాకేజీలో భాగమే.
  • ట్రైన్ దిగిన తర్వాత ఆయా ప్రాంతాలను సందర్శించడానికి కల్పించే బస్సు సౌకర్యం, హోటల్‌లో ఖర్చులు, ఇంకా గైడ్ సేవలు కూడా ఇందులో భాగంగానే ఉంటాయి.
  • ప్రయాణికుల కోసం ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా అందుబాటులో ఉంటుంది.
  • ఇవి కాకుండా మిగిలిన ఖర్చులేమైనా ఉంటే వాటిని పర్యాటకులే భరించాలి.
  • మరిన్ని వివరాలకోసం https://www.irctctourism.com/ ను సందర్శించవచ్చు.

కేవలం రూ.400కే గోవా టూర్ - వేసవి సెలవులు అయిపోతున్నాయ్ - అతి తక్కువ ధరకే బీచ్​ సందడి!

IRCTC బంపరాఫర్​​​ - రూ.13 వేలకే అరుణాచలం, కాంచీపురం దర్శనం - 5 రోజులు ఎంజాయ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.