Hyderabad to Tirumala : స్కూళ్లకు సెలవులు వస్తే తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఏ స్థాయిలో పోటెత్తుతారో అందరికీ తెలిసిందే. అందుకే, ఈ లోగానే తిరుపతి వెళ్లి వచ్చేందుకు కొందరు భక్తులు ప్రణాళిక వేస్తుంటారు. అలాంటి వారికోసం IRCTC సూపర్ ప్యాకేజీ ఆఫర్ చేస్తోంది.
ఈ టూర్ మొత్తం 3 రాత్రులు, 4 పగళ్లుగా సాగుతుంది. ఈ టూర్లో భాగంగా తిరుమల శ్రీవారి దర్శనం, తిరుచానూరు అమ్మవారి దర్శనం, ఇంకా శ్రీకాళహస్తి దర్శనం కూడా ఉంటుంది. టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
మొదటి రోజు :
హైదరాబాద్ లింగంపల్లి రైల్వేస్టేషన్ నుంచి నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ బయలు దేరుతుంది. సాయంత్రం 5.30 గంటలకు ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 6.10 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ చేరుతుంది. అక్కడ ప్రయాణికులను ఎక్కించుకొని రాత్రి 7.38 గంటలకు నల్గొండకు చేరుకుంటుంది. రాత్రి మొత్తం ప్రయాణం కొనసాగుతుంది.
రెండవ రోజు :
ఉదయం 5.55 గంటలకు రైలు తిరుపతి చేరుకుంటుంది. అక్కడ IRCTC సిబ్బంది ప్రయాణికులను పికప్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. ఫ్రెష్ అప్ తర్వాత టిఫెన్ పూర్తి చేసుకున్న తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ దర్శనానికి తీసుకెళ్తారు. దర్శనం పూర్తయిన తర్వాత అక్కడ్నుంచి శ్రీకాళహస్తి ఆలయానికి బయల్దేరుతారు. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి హోటల్‌కు బయల్దేరుతారు. ఆ రాత్రి అక్కడే బస చేస్తారు.
మూడవ రోజు :
తెల్లవారు జామున 2.30 గంటలకు తిరుమల శ్రీవారి దర్శనానికి హోటల్ నుండి బయల్దేరుతారు. ఉచిత దర్శనం క్యూ వద్ద దించుతారు. దర్శనం పూర్తయ్యే వరకు సుమారు మధ్యాహ్నం అవుతుంది. ఆ తర్వాత తిరిగి హోటల్‌కు తీసుకెళ్తారు. ఆ తర్వాత సాయంత్రం తిరుగు ప్రయాణం మొదలవుతుంది. భక్తులను తిరుపతి రైల్వే స్టేషన్లో దించుతారు. సాయంత్రం 6.20 గంటలకు రైలు బయల్దేరుతుంది. రాత్రంతా ప్రయాణం సాగుతుంది.
నాలుగవ రోజు :
తెల్లవారు జామున 3.04 గంటలకు రైలు నల్గొండకు చేరుకుంటుంది. ఉదయం 5.35 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. 6.45 గంటలకు లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. అంతటితో మీ టూర్ ముగుస్తుంది.
టికెట్ ధరల వివరాలు ఇవీ :
- ఈ ప్రయాణం 3ఏసీ, స్లీపర్ విభాగాల్లో సాగుతుంది.
- 3ఏసీ విభాగంలో ప్రయాణించాలంటే సింగిల్ షేరింగ్ టికెట్ ధర రూ.13,950.
- డబుల్ షేరింగ్‌కు రూ.10,860. ట్రిపుల్ షేరింగ్‌కు రూ.9,080గా నిర్ణయించారు.
- పిల్లలకు విత్ బెడ్ రూ.6,620. బెడ్ లేకుండా రూ.5,560 అవుతుంది.
- స్లీపర్‌లో ప్రయాణించాలంటే సింగిల్ షేరింగ్ టికెట్ ధర రూ.12,080.
- డబుల్ షేరింగ్‌కు రూ.8,990. ట్రిపుల్ షేరింగ్‌కు రూ.7,210గా నిర్ణయించారు.
- పిల్లలకు విత్ బెడ్ రూ.4,750. బెడ్ లేకుండా రూ.3,690 అవుతుంది.
ప్యాకేజీలో కవరయ్యేవి ఇవీ :
- IRCTC తరపున ఒక బ్రేక్ ఫాస్ట్ మాత్రమే అందిస్తారు. ఆ తర్వాత ఏమైనా తినాలంటే ప్రయాణికులే ఖర్చు చేసుకోవాలి.
- రైలు దిగిన దగ్గర్నుంచి, మళ్లీ రెలు ఎక్కించే వరకు ప్రయాణం ఐఆర్సీటీసీ చూసుకుంటుంది.
- దర్శన టికెట్లు, గైడ్ వంటివి భక్తులే చూసుకోవాల్సి ఉంటుంది.
- ట్రావెల్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటుంది.
- ఈ టూర్ ప్రస్తుతానికి ప్రతిరోజూ అందుబాటులో ఉంది.
- మరిన్ని వివరాల కోసం, ఇంకా టికెట్లు బుక్ చేసుకోవడానికి ఈ లింక్‌పై క్లిక్ చేయండి