IRCTC Ayodhya Kashi Punya Kshetra Yatra Tour : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ భారత్‌లో పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు సహా ఇతర దర్శనీయ స్థలాల్లో పర్యటించేందుకు ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీలను అందిస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకునే వారికోసం తక్కువ ధరలో అద్భుతమైన ప్యాకేజీని తీసుకొచ్చింది. మరి, ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు? ధర ఎంత? ప్రయాణం ఎప్పుడు అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
"అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర విత్ జ్యోతిర్లింగ (Ayodhya Kashi Punya Kshetra Yatra with Jyotirlinga)" పేరిట ఈ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది ఐఆర్సీటీసీ. సికింద్రాబాద్ నుంచి రైలు ప్రయాణం ద్వారా ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా గయ, కాశీ, అయోధ్య వంటి ప్రముఖ క్షేత్రాలను చూడొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ స్టేషన్ల గుండా ఈ రైలు ప్రయాణం సాగుతుంది. 8 రాత్రులు, 9 పగళ్లు కొనసాగే ఈ యాత్రా విశేషాలు ఇప్పుడు చూద్దాం.
పర్యటన కొనసాగనుందిలా
- మెదటి రోజున మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పుణ్యక్షేత్ర యాత్ర ప్రారంభమవుతుంది.
- కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయాడ, ఏలూరు గుండా రైలు ప్రయాణిస్తుంది. ఈ ప్రాంతాల్లో ఉండే వారు అక్కడే రైలు ఎక్కొచ్చు.
- రెండో రోజు రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం, పలాస మీదుగా ప్రయాణించి మూడో రోజు ఉదయం 9 గంటలకు గయా రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు.
- అక్కడి నుంచి ముందుగానే బుక్ చేసిన హోటల్‌లో బస ఏర్పాటు ఉంటుంది. లంచ్ తర్వాత విష్ణుపాద ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ రాత్రి అక్కడే డిన్నర్, బస ఉంటుంది.
- నాలుగో రోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అనంతరం హోటల్ నుంచి చెక్ అవుట్ అయి గయ రైల్వే స్టేషన్ వెళ్తారు. అనంతరం అక్కడి నుంచి బనారస్‌కి బయలుదేరుతారు. అక్కడికి చేరుకున్నాక సారనాథ్‌లో డిన్నర్, బస ఏర్పాటు ఉంటుంది.
- ఐదో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఆరోజంతా సైట్ సీయింగ్ ఉంటుంది. అందులో భాగంగా కాశీ విశ్వనాథ్ పుణ్యక్షేత్రం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవీ ఆలయాల దర్శనం ఉంటుంది. సాయంత్రం గంగా హారతిని ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఆ రోజు రాత్రి సారనాథ్‌లోనే డిన్నర్, బస ఉంటుంది.
- ఆరో రోజు మార్నింగ్ 7 గంటలకు హోటల్ చెక్ అవుట్ అయి శ్రీరాముని జన్మస్థానమైన అయోధ్యకు బయలుదేరుతారు. మధ్యాహ్నం శ్రీరాముడు, హనుమంతుని ఆలయాలు దర్శించుకుంటారు. అనంతరం సాయంత్రం ప్రయాగ్‌రాజ్‌కి పయనమవుతారు.
- ఏడో రోజు ఉదయం 5 ప్రయాగ్‌రాజ్ చేరుకుంటారు. అక్కడ త్రివేణి సంగమాన్ని సందర్శిస్తారు. అనంతరం సికింద్రాబాద్‌కు తిరుగు ప్రయాణం స్టార్ట్ అవుతుంది.
- ఎనిమిది రోజు సాయంత్రం, తొమ్మిదో రోజు పైన పేర్కొన్న స్టేషన్ల మీదుగా ప్రయాణించి సికింద్రాబాద్ చేరుకోవటంతో యాత్ర కంప్లీట్ అవుతుంది.
ప్యాకేజీ ఛార్జీలు :
- ఈ టూర్లో భాగంగా ఒకరు ప్రయాణించాలంటే కంఫర్ట్‌లో రూ.31,160; స్టాండర్డ్‌లో రూ.23,600; ఎకానమీ క్లాస్‌లో రూ.14,390 చెల్లించాలి.
- 5 నుంచి 11 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలకైతే కంఫర్ట్‌లో రూ.29,900; స్టాండర్డ్‌లో రూ.22,550; ఎకానమీ క్లాస్‌లో రూ.13,495 చెల్లించాలి. అయితే, ట్విన్ షేరింగ్, ట్రిపుల్ ఆక్యుపెన్సీ బట్టి ఛార్జీలు వేరువేరుగా ఉంటాయి.
ప్యాకేజీలో ఉండేవి ఇవే :
- సెలక్ట్ చేసుకున్న ప్యాకేజీని బట్టి ట్రైన్లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్ ప్రయాణం ఉంటుంది.
- ప్యాకేజీని బట్టి ప్రయాణానికి వాహనం సమకూరుస్తారు.
- ఉదయం కాఫీ, బ్రేక్‌ఫాస్ట్, భోజనం ప్యాకేజీలోనే అందిస్తారు.
- ప్రయాణికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ అందిస్తారు.
- ప్రస్తుతం ఈ టూర్ ఫిబ్రవరి 27వ తేదీన ప్రారంభమవుతుంది.
- ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీని బుక్ చేసుకునేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
ఇవీ చదవండి :
ఒక్కరోజులోనే 'అరకు' అందాలన్నీ చూసేయండి - రూ.2 వేలకే IRCTC సూపర్ ప్యాకేజీ!
సికింద్రాబాద్ నుంచి మహా కుంభమేళాకు డైరెక్ట్ ట్రైన్స్ - కాశీని సైతం చూసొచ్చేలా IRCTC ప్యాకేజీ