ETV Bharat / offbeat

కూల్​ వెదర్​లో ఘుమఘుమలాడే "టమాటా రసం" - ప్రెషర్​ కుక్కర్​లో ఇన్​స్టంట్​గా చేసుకోవచ్చు! - టేస్ట్​ అదుర్స్​! - TOMATO RASAM IN PRESSURE COOKER

-ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా ఇలా రసం చేసుకోండి! -అన్నంలోకి తినడమే కాదు నేరుగా తాగేస్తారు కూడా!

Tomato Rasam in Pressure Cooker
Tomato Rasam in Pressure Cooker (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 22, 2025 at 11:05 AM IST

2 Min Read

Instant Tomato Rasam in Pressure Cooker: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాల కారణంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో కూల్​ వెదర్​లో చాలా మంది వేడి వేడి అన్నంలో చారు, రసం పోసుకుని తినడానికి ఆసక్తి చూపిస్తారు. ఇక చారు అంటే అందరికీ టమాటాలతో చేసినది మాత్రమే గుర్తుకువస్తాయి. అయితే టమాటాలతో ఎప్పుడూ చేసే పద్ధతిలో కాకుండా ఓసారి కుక్కర్​లో ఇన్​స్టంట్​గా చేసుకోండి. టేస్ట్​ చాలా బాగుంటుంది. ఈ కూల్​ వెదర్​లో అన్నంలోకి పోసుకుని తింటుంటే గొంతులోకి జప్పున జారుతుంది. మరి దీనిని ఎలా ప్రిపేర్​ చేయాలో ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • కందిపప్పు - పావు కప్పు
  • టమాటాలు - 4
  • పసుపు - పావు టీస్పూన్​
  • నూనె - 1 టీస్పూన్​
  • నీరు - సరిపడా
  • కరివేపాకు - కొద్దిగా
  • ఉప్పు - సరిపడా
  • రసం పొడి - 2 టేబుల్​స్పూన్లు

తాలింపు కోసం:

  • నెయ్యి - 1 టేబుల్​స్పూన్​
  • ఆవాలు - 1 టీస్పూన్​
  • జీలకర్ర - 1 టీస్పూన్​
  • ఇంగువ - చిటికెడు
  • ఎండు మిర్చి - 2
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
Tomato Rasam in Pressure Cooker
Tomato Rasam in Pressure Cooker (ETV Bharat)

తయారీ విధానం:

  • ఓ గిన్నెలోకి కందిపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి సరిపడా నీళ్లు పోసి సుమారు అర గంట సేపు నానబెట్టుకోవాలి.
  • పప్పు నానిన తర్వాత నీళ్లు వంపేసి ప్రెషర్​ కుక్కర్​లో వేసుకోవాలి. ఆపై అందులోకి శుభ్రంగా కడిగిన టమాటాలు, పసుపు, నూనె వేయాలి.
  • చివరగా కప్పున్నర నీళ్లు పోసి మూత పెట్టి స్టవ్​ ఆన్​ చేసి మీడియం ఫ్లేమ్​లో 5 విజిల్స్​ వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్ బంద్​ చేయాలి.
  • కుక్కర్​ ఆవిరి పోయిన తర్వాత మూత తీసి టమాటాల తొక్కు తీసేయాలి. ఆ తర్వాత పప్పుగుత్తి లేదా స్మాషర్​ సాయంతో మెత్తగా మెదుపుకోవాలి.

  • ఇలా మెదుపుకున్న టమాటా మిశ్రమంలోకి మరో నాలుగు కప్పుల నీరు పోసి స్టవ్​ ఆన్​ చేయాలి. మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి రుచికి సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన కరివేపాకు, రసం పొడి వేసి కలిపి మరిగించుకోవాలి.
  • రసం మరిగేలోపు మరో స్టవ్​ మీద పాన్​ పెట్టి నెయ్యి వేసుకోవాలి. కాగిన నెయ్యిలో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి.

  • ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి క్రిస్పీగా వేయించాలి. చివరగా ఇంగువ వేసి ఓ నిమిషం వేయించి స్టవ్​ ఆఫ్​ చేయాలి.
  • ఈ తాలింపు మిశ్రమాన్ని మరుగుతున్న రసంలో పోసుకుని కలిపి మరి కొద్దిసేపు మరిగించాలి.
  • 5 నిమిషాల తర్వాత కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్​ ఆఫ్​ చేస్తే ఘుమఘుమలాడే టమాటా రసం రెడీ. దీన్ని వేడివేడిగా సర్వ్​ చేసుకుంటే కమ్మగా ఉంటుంది.
Instant Tomato Rasam
Instant Tomato Rasam (ETV Bharat)

చిట్కాలు:

  • బాగా పండిన టమాటాలు తీసుకుంటే రసం రుచి బాగుంటుంది.
  • ఇందులో ఉల్లిపాయలు వేయలేదు. అయితే మీకు కావాలనుకుంటే కాస్త పొడుగ్గా, మీడియం సైజ్​లో ముక్కలుగా కట్​ చేసి టమాటాలతో పాటు ఉడికించుకుంటే సరిపోతుంది.

ఇన్​స్టంట్​ "మైసూర్​ బోండాలు" - గంటలపాటు పిండిని పులియబెట్టాల్సిన పనిలేదు - పైన క్రిస్పీగా, లోపల గుల్లగా!

పెరుగులో నానబెట్టి "వంకాయ మసాలా కర్రీ" చేసుకోండి - ఎన్నడూ తినని రుచితో భలే కమ్మగా ఉంటుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.