ETV Bharat / offbeat

బోనాల వేళ కొబ్బరి చిప్పలు మిగిలాయా? - ఇలా "కొబ్బరి లడ్డూలు" చేసుకోండి! - పాకంతో పని లేదు!

నెయ్యి లేకుండానే స్వీట్ షాప్ స్టైల్ "కొబ్బరి లడ్డూలు" - అప్పటికప్పుడు నిమిషాల్లో రెడీ!

Kobbari Laddu Making Process
Kobbari Laddu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : July 24, 2025 at 11:28 AM IST

3 Min Read
Choose ETV Bharat

Kobbari Laddu Making Process : ఆషాడ మాసంలో భాగ్యనగరంలో నిన్న మొన్నటి వరకు బోనాల వేడుకలను జోరుగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఇళ్లలో అమ్మవారికి బోనం సమర్పించాక, ఇంట్లో దేవుడికి కొట్టిన తర్వాత కొబ్బరి చిప్పలు మిగిలిపోయి ఉంటాయి. అయితే, గత ఐదారు రోజులుగా చిరు జల్లులు కురుస్తున్న వేళ వాటిని ఎండకు ఆరబెట్టే పరిస్థితి ఉండకపోవచ్చు. అలాంటి టైమ్​లో చాలా మంది అవి పాడవ్వకుండా ఏదైనా రెసిపీని ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తుంటారు. మీరూ ఆ జాబితాలో ఉన్నారా? అయితే, మీకోసమే ఈ సూపర్ రెసిపీ. అదే, నోరూరించే కమ్మని "కొబ్బరి లడ్డూలు". పచ్చికొబ్బరితో అప్పటికప్పుడు చాలా ఈజీగా వీటిని రెడీ చేసుకోవచ్చు. నెయ్యి, నూనె వంటివి లేకుండానే చాలా రుచికరంగా ఉంటాయి. పిల్లలైతే ఒకటికి రెండు ఎంతో ఇష్టంగా తింటారు. మరి, ఈ సింపుల్ స్వీట్ రెసిపీకి అవసరమైన పదార్థాలేంటి? ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Kobbari Laddu Making Process
Kobbari (Getty Images)

అవసరమైన పదార్థాలు :

  1. పచ్చికొబ్బరి ముక్కలు - మూడు కప్పులు
  2. పంచదార - ఒకటిన్నర కప్పులు
  3. పాలు - ఒకటిన్నర కప్పులు
  4. యాలకుల పొడి - ఒక టీస్పూన్
  5. కొబ్బరి పొడి - కొద్దిగా(లడ్డూలు కోట్ చేసుకోవడానికి)

బ్యాచిలర్స్ స్పెషల్ కమ్మని "టమాటా కర్రీ" - అల్లంవెల్లుల్లి పేస్ట్, మసాలాలు వేయకుండానే అద్భుతమైన రుచి!'

Kobbari Laddu Making Process
Milk (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా నాలుగు పచ్చికొబ్బరి చిప్పలను(రెండు టెంకాయలన్నమాట) తీసుకొని వాటి నుంచి కొబ్బరిని వేరు చేసుకోవాలి.
  • అన్ని కొబ్బరిచిప్పల నుంచి కొబ్బరిని సెపరేట్ చేసుకున్నాక వాటి వెనుక భాగంలో ఉండే బ్రౌన్ పార్ట్​ని చాకు లేదా పీలర్​తో నెమ్మదిగా తొలగించుకోవాలి. ఇలా కొబ్బరి బ్రౌన్ పార్ట్ తీసేసి లడ్డూలు చేసుకోవడం ద్వారా మంచి రుచికరంగా వస్తాయి.
  • తర్వాత బ్రౌన్ పార్ట్ తొలగించుకున్న కొబ్బరిని మూడు కప్పుల పరిమాణంలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
  • ఆపై మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుములో చక్కెర, పచ్చి పాలను యాడ్ చేసుకొని మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
Kobbari Laddu Making Process
Sugar (Getty Images)
  • ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని ఒక పాన్​లోకి తీసుకొని స్టవ్​పై ఉంచి మీడియం టూ హై ఫ్లేమ్​లో మాడిపోకుండా కలుపుతూ నాలుగైదు నిమిషాల పాటు ఆ మిశ్రమం కాస్త దగ్గరపడేంత వరకు కుక్ చేసుకోవాలి.
  • ఆ మిశ్రమం కొద్దిగా దగ్గరపడి పాన్​ అంచుల నుంచి కాస్త సెపరేట్ అవుతున్నప్పుడు ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోవాలి. అందుకోసం కొద్దిగా కొబ్బరి మిశ్రమాన్ని తీసుకొని చేతితో చిన్న ఉండలా చేస్తే సరైన షేప్​లో వచ్చిందంటే అప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందని తెలుసుకోవాలి.
  • అలాకాకుండా ఉండ అనేది సరిగా చుట్టడం రాకున్నా లేదంటే ఉండలా చేస్తుంటే విడిపోతున్నట్లు అనిపించినా, పల్చగా అనిపించినా మరో ఒకట్రెండు నిమిషాలు కలుపుతూ ఉడికించుకోవాలి.
Kobbari Laddu Making Process
Elachi (Getty Images)
  • కొబ్బరి మిశ్రమం చక్కగా ఉడికి సరైన కన్సిస్టెన్సీ వచ్చిందనుకున్నాక అందులో యాలకుల పొడి వేసుకొని అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • అనంతరం ఆ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి ప్లేట్​లోకి తీసుకొని కాస్త చల్లారాక మీకు కావాల్సిన పరిమాణంలో కొద్దికొద్దిగా తీసుకుంటూ లడ్డూల్లా చుట్టుకోవాలి. అలా మిశ్రమం మొత్తాన్ని లడ్డూల్లా చేసుకోవాలి.
  • తర్వాత చివరగా ఒక గిన్నెలో కొద్దిగా కొబ్బరి పొడిని తీసుకొని అందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న లడ్డూలను ఒక్కొక్కటిగా తీసుకుంటూ కొబ్బరి పొడితో అన్ని వైపులా చక్కగా కోట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, నిమిషాల్లో స్వీట్ షాప్ స్టైల్​లో నోరూరించే "కొబ్బరి లడ్డూలు" మీ ముందు ఉంటాయి!

చిట్కాలు :

  • ఈ రెసిపీ కోసం మీరు కొబ్బరి ముక్కలు తీసుకున్న కప్పునే పంచదార, ఇతర ఇంగ్రీడియంట్స్ కొలిచి తీసుకోవడానికి వాడుకోవాలి.
  • అలాగే, ఇక్కడ మీరు కావాలనుకుంటే కొద్దిగా డ్రైఫ్రూట్స్​ని నేతిలో వేయించి తీసుకొని కొబ్బరి మిశ్రమంలో వేసుకొని కలిపి లడ్డూలను ప్రిపేర్ చేసుకోవచ్చు.
  • ఇక్కడ లడ్డూలను కొబ్బరి పొడిలో కోట్ చేసుకోవడం అనేది ఆప్షనల్ మాత్రమే. కాకపోతే లడ్డూలకు స్వీట్ షాప్ స్టైల్​లో మంచి లుక్​తో పాటు టేస్ట్​ని అందిస్తుంది.

ఉల్లిపాయలతో పకోడీ రొటీన్ - ఇలా కరకరలాడే "బోండాలు" చేసుకోండి! - కమ్మగా ఉంటాయి!

ఎన్నడూ చేయని నయా స్టైల్ "ఎగ్ బుర్జీ" - వేడివేడి అన్నంలో అద్భుతమే!