ETV Bharat / offbeat

ఇన్​స్టంట్​ "మైసూర్​ బోండాలు" - గంటలపాటు పిండిని పులియబెట్టాల్సిన పనిలేదు - పైన క్రిస్పీగా, లోపల గుల్లగా! - INSTANT MYSORE BONDA AT HOME

-సూపర్​ టేస్టీ హోటల్​ స్టైల్​ మైసూర్​ బోండా - కేవలం 10 నిమిషాల్లో సింపుల్​గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండిలా!

Instant Mysore Bonda at Home
Instant Mysore Bonda at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 21, 2025 at 3:32 PM IST

3 Min Read

Instant Mysore Bonda at Home : మెజార్టీ పీపుల్​ ఇష్టపడే టిఫెన్స్​లో మైసూర్​ బోండా ఒకటి. టిఫెన్ సెంటర్స్, హోటల్స్​కి వెళ్లినప్పుడు వీటిని చాలా ఎంజాయ్​ చేస్తూ తింటుంటారు. అయితే సాధారణంగా బోండాలు చేయాలంటే పిండిని కలిపి సుమారు కొన్ని గంటల పాటు పులియబెట్టాలి. అప్పుడు పిండి బాగా నాని బోండాలు సాఫ్ట్​గా, గుల్లగా వస్తాయి. కానీ ఇలా గంటలపాటు వెయిట్​ చేయాల్సిన పనిలేకుండా కేవలం 10 నిమిషాల పాటు పిండిని నానబెట్టి బోండాలు వేసుకోవచ్చు. పైగా ఇవి పైన క్రిస్పీగా ఉండి లోపల గుల్లగా వస్తాయి. పిండి కూడా కరెక్ట్​గా ఉడుకుతుంది. అయితే ఇలా రావాలంటే మాత్రం కరెక్ట్​ కొలతలు, టిప్స్​ పాటించాలి. . మరి లేట్​ చేయకుండా ఈ రెసిపీ కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • పెరుగు - 1 కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పంచదార - 1 టీస్పూన్​
  • నూనె - 2 టేబుల్​స్పూన్లు
  • బేకింగ్​ సోడా - పావు టీస్పూన్​
  • జీలకర్ర - 1 టీస్పూన్​
  • మైదా పిండి - 1 కప్పు
  • గోధుమపిండి - 1 కప్పు
  • బియ్యప్పిండి - 2 టేబుల్​స్పూన్లు
Instant Mysore Bonda at Home
Instant Mysore Bonda at Home (ETV Bharat)

తయారీ విధానం:

  • ఓ బౌల్​లోకి పెరుగు, ఉప్పు, పంచదార, నూనె వేసి విస్కర్​ సాయంతో ఉండలు లేకుండా పెరుగు క్రిమీగా మారే వరకు బీట్​ చేసుకోవాలి.
  • పెరుగు స్మూత్​గా అయిన తర్వాత బేకింగ్​ సోడా, జీలకర్ర వేసి మరోసారి బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల బోండాలు గుల్లగా వస్తాయి.
  • పెరుగుపై బబుల్స్​ వచ్చినప్పుడు మైదా పిండి, గోధుమపిండి, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి.

  • పిండిలన్నీ పెరుగులోకి కలిసిన తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. పిండి లూజ్​గా మారితే సరైన షేప్​లో బోండాలు రావు. అదే గట్టిగా అయితే లోపల పిండి ఉడకదు. కాబట్టి నీటిని కొద్దికొద్దిగా పోస్తూ పిండిని సరైన విధంగా కలుపుకోవాలి.
  • నీళ్లు సరిపడా పోసుకున్న తర్వాత ఆపకుండా సుమారు 10 నిమిషాల పాటు పిండిని చేతితో పై నుంచి కిందకు అనుకుంటూ బీట్​ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బోండా లోపల పిండి పర్ఫెక్ట్​గా ఉడుకుతుంది.

  • ఇలా కలుపుకున్న పిండిపై మూత పెట్టి సుమారు 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఈ పిండిని గంటలపాటు పులియబెట్టాల్సిన పనిలేదు.
  • 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరో 5 నిమిషాల పాటు బీట్​ చేసుకోవాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి కడాయి పెట్టి డీప్​ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. నూనె బాగా కాగిన తర్వాత మంటను సిమ్​లో పెట్టి పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ బోండాలుగా వేయాలి.

  • కడాయికి సరిపడా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్​లో పెట్టి జల్లి గరిటెతో రౌండ్​గా తిప్పుతూ రెండు వైపులా గోల్డెన్​ కలర్​ వచ్చేవరకు కాల్చుకోవాలి.
  • ఇలా కాల్చుకున్న వాటిని టిష్యూ పేపర్​ ఉన్న ప్లేట్​లోకి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఎక్ట్స్రా ఉన్న నూనెను పేపర్​ పీల్చుకుంటుంది. ఇలా పిండి మొత్తాన్ని బోండాలుగా వేసుకుని కాల్చుకోవాలి.
  • ఇలా చేసుకున్న వాటిని పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీతో సర్వ్​ చేసుకుంటే పైన క్రిస్పీగా, లోపల గుల్లగా ఇన్​స్టంట్​ మైసూర్​ బోండా రెడీ. నచ్చితే ఈసారి ఈ పద్ధతిలో చేయండి, పిల్లలు మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారు.

టిప్స్​:

  • మైసూర్​ బోండాలు పర్ఫెక్ట్​గా రావాలంటే అన్నింటిని సరైన కొలతల ప్రకారం తీసుకోవాలి. అంటే 1 కప్పు పెరుగుకు, రెండు కప్పుల పిండి. అలాగే రెండు కప్పుల పిండికి, 2 టేబుల్​స్పూన్ల బియ్యప్పిండి. అంటే ఒక కప్పు పిండికి 1 టేబుల్​స్పూన్​ బియ్యప్పిండి.
  • మైదా, గోధుమ పిండి ఇలా రెండూ కాకుండా మొత్తంగా మైదా లేదా గోధుమపిండితో కూడా బోండాలు వేసుకోవచ్చు.
  • బోండాలు గుండ్రంగా రావాలంటే పిండిని తీసుకుని చేతిని రివర్స్​ తిప్పి బొటనవేలు, చూపుడు వేలు మధ్యలో నుంచి పిండి నూనెలో జారేలా వేసుకోవాలి.
  • పిండిని కలపడానికి చాలా మంది చల్లటి నీళ్లు పోస్తుంటారు. కానీ బోండాల పిండిని కలపడానికి వేడినీళ్లు యూజ్​ చేయడం వల్ల పిండి త్వరగా పులిసి రౌండ్​ షేప్​లో వస్తాయి.
  • బోండాలు పర్ఫెక్ట్​గా కాలాలంటే నూనె బాగా వేడిగా ఉండాలి. అప్పుడే పిండిని వేయగానే వెంటనే పైకి తేలి లోపల మంచిగా ఉడకటంతో పాటు రౌండ్​గా వస్తాయి. లేదంటే పిండి అడుగున చేరి నూనెను ఎక్కువగా పీల్చుకుంటుంది.

నీచు వాసన లేకుండా "చికెన్​ ఫ్రై" - ప్రెషర్​ కుక్కర్​లో ఈజీగా చేసుకోవచ్చు! - అన్నింటిలోకి అదుర్స్​!

కమ్మని "ఆవకాయ పెరుగన్నం తాలింపు" - 5 నిమిషాల్లో రెడీ - టేస్ట్​ వేరే లెవల్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.