ETV Bharat / offbeat

స్టవ్​ వెలిగించే పనిలేకుండా "మ్యాంగో రసమలై" - ఇలా చేస్తే పావుగంటలో సిద్ధం - నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది! - INSTANT MANGO RASMALAI

-మామిడిపండ్లతో ఎప్పుడూ చేసే స్వీట్లు కాకుండా ఇలా ట్రై చేయండి! -ఇంటిల్లిపాదీ ఈ రెసిపీకి ఫ్యాన్​ అయిపోతారు!

Mango Rasmalai
Mango Rasmalai (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 11, 2025 at 1:29 PM IST

2 Min Read

Instant Mango Rasmalai: నోట్లో వేసుకోగానే కరిగిపోయే రసమలై అంటే అందరికీ ఇష్టమే. లంచ్​, డిన్నర్​ తర్వాత చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. తినడం వరకు బానే ఉన్నా దీనిని ఇంట్లో చేయాలంటేనే కష్టంగా భావిస్తుంటారు. ఈ క్రమంలోనే కావాల్సినప్పుడు షాప్స్​ నుంచి కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఆ అవసరం లేకుండా చాలా సింపుల్​గా రసమలై ప్రిపేర్​ చేసుకోవచ్చు. అది కూడా పొయ్యితో పనిలేదు. టేస్ట్​ గురించి చెప్పక్కర్లేదు. మరి లేట్​ చేయకుండా ఇన్​స్టంట్​ మ్యాంగో రసమలై ఎలా చేసుకోవాలో చూసేయండి.

Mango
Mango (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • బ్రెడ్​ స్లైస్​లు - 12
  • మామిడి పండు గుజ్జు - 1 కప్పు
  • కాచి చల్లార్చిన చల్లటి పాలు - 1 కప్పు
  • పంచదార పొడి - 5 టీస్పూన్లు
  • పాల పొడి - 4 టీస్పూన్లు
  • యాలకుల పొడి - అర టీస్పూన్​
  • పిస్తా, బాదం పలుకులు - కొద్దిగా
Bread
Bread (Getty Images)

తయారీ విధానం:

  • ముందుగా బాగా పండిన మామిడిపండును తీసుకుని శుభ్రంగా కడిగి పొట్టు తీసేసి ముక్కలుగా కట్​ చేసుకోవాలి.
  • ఇలా కట్​ చేసుకున్న ముక్కలను మిక్సీజార్​లోకి వేసి మెత్తని గుజ్జులా చేసి ఒక కప్పు కొలతగా తీసుకోవాలి.
  • ఓ బౌల్​లోకి అర కప్పు మామిడి గుజ్జు, కాచి చల్లార్చి ఫ్రిజ్​లో పెట్టిన చిక్కటి పాలు, 3 టీస్పూన్ల పంచదార పొడి, 2 టీస్పూన్ల పాల పొడి, యాలకుల పొడి, కొన్ని పిస్తా, బాదం పలుకులు బాగా కలిపి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టాలి. అవసరమైతే ఫ్రిజ్​లో పెట్టొచ్చు.
Mango Rasmalai
Mango Rasmalai (ETV Bharat)
  • మరో గిన్నెలోకి మిగిలిన మామిడి గుజ్జు, 2 టీస్పూన్ల పంచదార పొడి, 2 టీస్పూన్ల పాల పొడి, మరికొన్ని పిస్తా, బాదం పలుకులు వేసి బాగా మిక్స్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు మీడియం సైజ్​లో రౌండ్​గా, షార్ప్​గా ఉన్న గిన్నె లేదా మూతను తీసుకుని బ్రెడ్​ స్లైస్​ మధ్యలో పెట్టి రౌండ్​గా కట్​ చేసుకోవాలి. ఇలా మిగిలిన బ్రెడ్​ స్లైస్​లను కట్​ చేసుకుని పక్కన ఉంచాలి.
Mango Rasmalai
Mango Rasmalai (ETV Bharat)
  • రౌండ్​గా కట్​ చేసిన ఓ బ్రెడ్​ స్లైస్​ తీసుకుని దాని మీద ముందుగా ప్రిపేర్​ చేసుకున్న మామిడి గుజ్జు మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఆపైన మరో బ్రెడ్​ స్లైస్​ పెట్టి క్లోజ్​ చేయాలి.
  • ఇలా చేసుకున్న బ్రెడ్​ను ఓ ప్లేట్​లోకి తీసుకోవాలి. మిగిలిన బ్రెడ్​ స్లైస్​లలో కూడా స్టఫ్పింగ్​ పెట్టుకుని ప్లేట్​లోకి తీసుకోవాలి.
Mango Rasmalai
Mango Rasmalai (ETV Bharat)
  • ముందే ప్రిపేర్​ చేసుకున్న మ్యాంగో పాల మిశ్రమాన్ని బ్రెడ్​ స్లైస్​లు మునిగేలా మొత్తం పోసుకోవాలి. ఆ తర్వాత ఆ బ్రెడ్​ పైన కొన్ని మామిడి ముక్కలు, పిస్తా పలుకులు వేసి గార్నిష్​ చేయాలి.
  • అనంతరం ఈ డెజర్ట్​ను సర్వ్​ చేసుకుంటే సూపర్​ టేస్టీగా ఉండే ఇన్​స్టంట్​ మ్యాంగో రసమలై రెడీ. నచ్చితే మీరూ ట్రై చేయండి. కావాలంటే దీనిని ఫ్రిజ్​లో పెట్టి కూడా తినొచ్చు.
Mango Rasmalai
Mango Rasmalai (ETV Bharat)

చిట్కాలు:

  • ఈ స్వీట్​ కోసం మిల్క్​ బ్రెడ్​ అయితే బాగుంటుంది. అలాగే బ్రెడ్​ను రౌండ్​ షేప్​లోనే కాకుండా మీకు నచ్చిన షేప్​లో కూడా కట్​ చేసుకోవచ్చు.
  • ఒకవేళ మీ దగ్గర కాచి చల్లార్చిన పాలు లేకపోతే పచ్చి పాలను బాగా మరిగించి చల్లారిన తర్వాత ఫ్రిజ్​లో కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత ఉపయోగిస్తే సరి.
  • పంచదార పొడి మామిడి స్వీట్​నెస్​, అలాగే మీరు తినే తీపికి అనుగుణంగా కలుపుకుంటే సరిపోతుంది.

పచ్చికారంతో ఘుమఘుమలాడే "ఎగ్​ ఫ్రైడ్ రైస్" - పిల్లల లంచ్​ బాక్స్​లకు పర్ఫెక్ట్​!

శనగపిండి లేకుండానే కమ్మని "పూర్ణం బూరెలు" - పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్​గా ఉండి అద్దిరిపోతాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.