ETV Bharat / offbeat

ఊరబెట్టే పనిలేకుండా కమ్మని "నిమ్మకాయ పచ్చడి" - ఇన్​స్టంట్​గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు!

నిమ్మకాయలతో పచ్చడి ఇలా చేసి చూడండి - రెండు నెలలు నిల్వ ఉంటుంది!

Lemon Pickle
Lemon Pickle (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : October 12, 2025 at 2:59 PM IST

2 Min Read
Choose ETV Bharat

Lemon Pickle Recipe : నిమ్మకాయలు సీజన్​తో సంబంధం లేకుండా దొరుకుతాయి. వీటిని వివిధ రకాల వంటల్లో ఉపయోగిస్తారు. అంతే కాకుండా నిమ్మకాయలతో పచ్చడి చేస్తారు. అయితే కొన్ని సార్లు పచ్చడి కొద్ది రోజులకే బూజుపట్టడం, రంగు మారడం లాంటివి జరుగుతాయి! అందుకే ఓసారి ఇప్పుడు చెప్పబోయే పద్ధతిలో ఈ కొలతలు పాటించి పచ్చడి పెడితే పర్ఫెక్ట్​గా కుదరడమే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. పైగా దీని కోసం నిమ్మకాయ ముక్కలను ఊరబెట్టాల్సిన పనిలేదు. అప్పటికప్పుడు నిమిషాల్లోనే చేసుకోవచ్చు. మరి ఆలస్యం​ చేయకుండా ఇన్​స్టంట్​గా నిమ్మకాయ పచ్చడి ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు? తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.

క్రిస్పీ, టేస్టీ "సొరకాయ బజ్జీలు" - అప్పటికప్పుడు వేడి వేడిగా తయారు చేయొచ్చు!

Nimmakaya Pachadi
నిమ్మకాయలు (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • నిమ్మకాయలు - 20
  • ఆయిల్ - 2 కప్పులు
  • ఆవాలు - 4 టీ స్పూన్లు
  • ఎండుమిర్చి - 10
  • ఇంగువ - అర టీ స్పూన్​
  • కరివేపాకు - కొద్దిగా
  • పసుపు - 1 టీ స్పూన్​
  • మెంతి పొడి - 1 టీ స్పూన్​
  • రాళ్ల ఉప్పు - అర కప్పు
  • కారం - 1 కప్పు
  • వెల్లుల్లి - 4
Nimmakaya Pachadi
కరివేపాకు (Getty Images)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా 20 నిమ్మకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి అరగంట సేపు ఆరబెట్టుకోవాలి. అరగంట తర్వాత నిమ్మకాయలను ఆరు భాగాలుగా కట్ చేసి పక్కనుంచాలి.
  • మరోవైపు స్టవ్ ఆన్ చేసి కడాయిలో కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు, అర కప్పు ఉప్పు, ఒక టీ స్పూన్ పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. అనంతరం కడాయిపై మూతపెట్టి మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించాలి.
  • నిమ్మకాయ ముక్కలు ఉడికి కాస్త దగ్గర పడిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసుకోవాలి.
  • ఈ మిశ్రమం కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక కప్పు కారం, ఒక టీ స్పూన్ మెంతి పొడి, కచ్చాపచ్చాగా దంచుకున్న 20 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్స్ చేసుకోవాలి.
Nimmakaya Pachadi
ఎండుమిర్చి (Getty Images)
  • ఇంకోవైపు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయిలో రెండు కప్పుల నూనె పోయాలి. ఆయిల్ కాగిన తర్వాత నాలుగు టీ స్పూన్ల ఆవాలు వేసి వేగనివ్వాలి.
  • ఆవాలు వేగిన తర్వాత పది ఎండుమిర్చి, అర టీ స్పూన్ ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి వేయించి స్టవ్​ ఆఫ్​ చేసుకోవాలి.
Nimmakaya Pachadi
వెల్లుల్లి (Getty Images)
  • ఇప్పుడు తాలింపును రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసి కలుపుకుంటే నిమ్మకాయ పచ్చడి సిద్ధమైనట్లే!
  • పచ్చడి చల్లారిన తర్వాత జార్​లో వేసి పెట్టుకోవాలి.
Nimmakaya Pachadi
కారం (Getty Images)
  • పచ్చడి బయట ఉంటే 15 రోజులు, ఫ్రిజ్​లో ఉంచితే రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది.
  • వేడివేడి అన్నంలో నిమ్మకాయ పచ్చడి వేసుకొని తిన్నారంటే ఇంకో రెండు ముద్దలూ ఎక్కువగా లాగిస్తారు!
  • ఇలా ఇంట్లో చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీ ఎంతో ఇష్టంగా తింటారు!

రుచికరమైన "బియ్యప్పిండి పూరీలు" - ఇలా చేస్తే ఆయిల్ పీల్చకుండా, పొంగుతాయి!

కుక్కర్​లో ఈజీగా చేసుకునే "తలకాయ పులుసు" - ఇలా చేస్తే నీచు వాసన లేకుండా కమ్మగా ఉంటుంది!