ETV Bharat / offbeat

మార్కెట్లో కొనే పనిలేకుండా - ఇంట్లోనే "ఇడ్లీ రవ్వ" - రేషన్​ బియ్యం ఉంటే చాలు!

-రేషన్​ బియ్యంతో ఇడ్లీ రవ్వ - ఈ టిప్స్​ పాటించి ప్రిపేర్​ చేసుకుంటే నెలల పాటు నిల్వ!

Ration Rice Idli Rava
Ration Rice Idli Rava (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 21, 2025 at 12:34 PM IST

3 Min Read
Choose ETV Bharat

Ration Rice Idli Rava: "ఇడ్లీలు" ఆరోగ్యానికి మంచి చేసే బ్రేక్​ఫాస్ట్​లలో ముందు వరసలో ఉంటాయి. అందుకే చాలా మంది రెగ్యులర్​గా వీటిని చేసుకుని తింటుంటారు. అయితే నార్మల్​గా ఇడ్లీలు తయారు చేయాలంటే మినపప్పు, ఇడ్లీ రవ్వ చాలా అవసరం. ఈ క్రమంలోనే మార్కెట్​కు వెళ్లినప్పుడు చాలా మంది ఇడ్లీ రవ్వ ఎక్కువ మొత్తంలో కొని తీసుకొస్తుంటారు. అయితే మీకు తెలుసా? రవ్వను బయట కొనే పనిలేకుండా ఇంట్లోనే ప్రిపేర్​ చేసుకోవచ్చు. అది కూడా రేషన్​ బియ్యంతో. మీరు విన్నది నిజమే. చాలా ఈజీగా ఇంట్లోనే రవ్వను ప్రిపేర్​ చేసుకోవచ్చు. పైగా ఈ రవ్వ చేసిన ఇడ్లీలు చాలా సాఫ్ట్​గా ఉంటాయి. మరి, ఇడ్లీ రవ్వ చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం.

Rice
Rice (Getty Images)

కావాల్సిన పదార్థాలు:

  • రేషన్​ బియ్యం - 4 కప్పులు
  • నీళ్లు - 16 కప్పులు
  • ఉప్పు - 2 టీస్పూన్లు​
Salt
Salt (Getty Images)

తయారీ విధానం:

  • కంట్రోల్​​ బియ్యాన్ని ముందుగా క్లీన్​ చేసుకోవాలి. అంటే అందులో ఉండే రాళ్లు, గడ్డి పోచలు, మట్టి పెళ్లలు లేకుండా జల్లించాలి.
  • ఇప్పుడు గిన్నెలోకి రేషన్​ బియ్యం తీసుకుని వాటర్​తో శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి.
  • స్టవ్​ ఆన్​ చేసి పెద్దది, అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టి అందులో నీరు పోసి హై ఫ్లేమ్​లో మరిగించాలి.
  • నీరు బాగా మరుగుతున్నప్పుడు ఉప్పు వేసుకుని కలిపి, కడిగి పెట్టుకున్న బియ్యాన్ని నీళ్లు లేకుండా వేసి కలిపి ఓ రెండు నిమిషాల పాటు ఉంచి స్టవ్​ ఆఫ్ చేసి దింపి పక్కన పెట్టాలి.​ ఇప్పుడు ఈ గిన్నెపై మూత పెట్టి కొద్దిసేపు వదిలేయాలి.
  • 10 నిమిషాల తర్వాత నీటిని వంపేసుకోవాలి. అందుకోసం ఓ గిన్నెలో జల్లెడ పెట్టి ఓ కాటన్​ క్లాత్​ వేయాలి. అందులోకి బియ్యాన్ని ఒంపుకోవాలి. ఆపై చల్లని నీళ్లు పోసి గట్టిగా పిండుకోవాలి.
Rice Cooking
Rice Cooking (Getty Images)
  • ఇలా నీళ్లు లేకుండా వడకట్టిన బియ్యాన్ని ఎండబెట్టాలి. అందుకోసం కాటన్​ క్లాత్​ మీద ఆ బియ్యాన్ని పరిచి ఎండలో ఆరబెట్టుకోవాలి.
  • బాగా ఎండిన బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీజార్​లోకి కొన్ని కొన్ని బియ్యం వేసుకుంటూ మధ్యమధ్యలో ఆపుతూ రవ్వ మాదిరి గ్రైండ్​ చేసుకోవాలి.
  • అలా గ్రైండ్​ చేసుకున్న రవ్వను జల్లించుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. మిగిలిన బియ్యాన్ని కూడా రవ్వలాగా గ్రైండ్​ చేసి జల్లించి తీసుకోవాలి.
  • ఈ రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్​టైట్​ కంటైనర్లో పెట్టి స్టోర్​ చేసుకుంటే ఇడ్లీ రవ్వ రెడీ. దీనిని ఫ్రిజ్​లో పెట్టుకుంటే సుమారు 4 నెలల పాటు తాజాగా ఉంటుంది.​
  • ఇలా తయారు చేసుకున్న రవ్వను కొలత ప్రకారం తీసుకుని మినపప్పుతో కలిపి ఇడ్లీలు చేసుకుంటే సరి. సూపర్​ టేస్ట్​తో పాటు సాఫ్ట్​గా వస్తాయి.
Idli Rava
Idli Rava (ETV Bharat)

చిట్కాలు:

  • బియ్యం ఏ కప్పుతో తీసుకుంటే, అదే కప్పుతో నీళ్లు తీసుకోవాలి. అంటే 1 కప్పు బియ్యానికి 4 కప్పుల నీళ్లు. ఇక్కడ నాలుగు కప్పుల బియ్యం కాబట్టి, 16 కప్పుల నీళ్లు ఉపయోగపడతాయి.
  • మరిగే నీటిలో బియ్యం వేసి ఓ రెండు నిమిషాలు ఉంచి వెంటనే స్టవ్​ ఆఫ్​ చేసి పక్కన పెట్టాలి. ఎక్కువసేపు నీటిలో ఉంచితే బియ్యం మెత్తగా ఉడుకుతుంది.
  • బియ్యం బాగా ఎండాలి. నోట్లో వేసుకుని నమిలితే కరకరలాడాలి. ఎందుకంటే రైస్​ సరిగా ఆరక తడిగా ఉంటే ఇడ్లీ రవ్వ ముక్కవాసన వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు బాగా ఎండబెట్టుకోవాలి.
  • బియ్యాన్ని గ్రైండ్​ చేసేటప్పుడు కొద్దిమొత్తంలో తీసుకుంటూ రవ్వ వచ్చేలాగా గ్రైండ్​ చేసుకోవాలి. లేదంటే ముద్దలాగా వచ్చే అవకాశం ఉంటుంది.
  • ఇక్కడ కేజీ బియ్యం మాత్రమే కాబట్టి మిక్సీ పట్టుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్కువ మొత్తం తయారు చేసుకోవాలనుకుంటే మిల్లు దగ్గర రవ్వ లాగా పట్టించుకోవడం మంచిది.
Idli
Idli (Getty Images)

నోరూరించే "కందిపప్పు హల్వా" - ఇన్​ స్టంట్​గా చేసుకోవచ్చు! - టేస్ట్​ వేరే లెవల్​!

స్కూల్ నుంచి వచ్చే పిల్లలకు - నిమిషాల్లో చేసి ఇచ్చే సూపర్ "స్నాక్"! - ఇలా చేస్తే బేకరీ స్టైల్ పక్కా!