ETV Bharat / offbeat

ఆ చీరలను ఎలా ఉతకాలో తెలుసా? - ఇలా చేస్తే మరకలు ఈజీగా పోతాయి! - How to Wash Velvet Saree at Home

How to Wash Velvet Saree at Home: వెల్వెట్ చీరలపై పడిన మరకలను పోగొట్టడానికి జనం నానా అవస్థలు పడుతుంటారు. అయితే.. కొన్ని టిప్స్ పాటిస్తే చీర శుభ్రంగా తయారవుతుందని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 1:50 PM IST

Velevet Saree Washing Tips in Telugu
Velevet Saree Washing Tips in Telugu (ETV Bharat)

How to Wash Velvet Saree at Home: వెల్వెట్ చీరలను కట్టుకోవడానికి చాలా మంది మహిళలు ఇష్టపడతారు. ఇది కట్టుకునేటప్పుడు ఆనందంగానే ఉన్నా.. ఉతికేటప్పుడు మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. ఇక దానిపై మరకలు పడితే అంతే. చాలాసార్లు డ్రై క్లీనింగ్​ కు ఇవ్వాల్సి వస్తుంది. అయితే.. ఈ చిట్కాలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందీ లేకుండా సులభంగా ఉతుక్కోవచ్చని ఫ్యాషన్ నిపుణులు సలహా ఇస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

చీర ఉతికేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

  • మొదటగా ఓ టబ్​ను తీసుకుని చల్లటి లేదా గోరువెచ్చటి నీటిని నింపాలి. (వేడి నీటిని అసలు వాడొద్దు)
  • 1-2 చెంచాల తేలికపాటి డిటర్జెంట్​ను నీటిలో కలపాలి.
  • ఈ సబ్బు నీటిలో వెల్వెట్ చీరను చేతితో మృదువుగా జాడించాలి. ఇలా 5-6 సార్లు చేయాలి.
  • ఆ తర్వాత శుభ్రమైన నీటిని తీసుకుని అందులో డిటర్జెంట్​ పోయేంతా వరకు ఉతకాలి.
  • అయితే, ఈ చీరలు ఉతికే సమయంలో మెలిపెట్టడం, బలవంతంగా పిండడం లాంటివి చేయకూడదు.

మరకలు పోగొట్టడం ఇలా..
ఒక చెంచా బేకింగ్ సోడా, ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా నీటిని కలిపాలి. ఈ మిశ్రమాన్ని మరకలు అంటిన చోట పోసి చేతి వేళ్లతో రుద్దాలి. ఆ తర్వాత మరక తొలిగిపోయే వరకు మైక్రోఫైబర్ క్లాత్‌తో మెల్లగా రుద్దాలని చెప్పారు. ఇలా మరకలు పోయేవరకు మృదువుగా చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా కాకపోతే మరకలు ఉన్న ప్రదేశంలో కొద్దిగా నీటిని పోసి.. దానిపై డిటర్జెంట్​ పౌడర్ లేదా లిక్విడ్ పోయాలి. ఆ తర్వాత చేతివేళ్లతోనే మృదువుగా రుద్దుతూ చల్లటి నీటిలో ముంచాలి. అయినా కూడా మరకలు పోకపోతే డ్రైక్లీనింగ్​కు ఇవ్వాలని సలహా ఇస్తున్నారు.

ముడతలు పొగొట్టడం అలా..
ఉతికిన తర్వాత వెల్వెట్ చీరలు పూర్తిగా ముడతలు పడతాయి. అయితే.. ఈ సమస్యను అధిగమించేందుకు రాత్రంతా వేలాడదీసి ఆరబెట్టాలని సూచిస్తున్నారు. ఇలా చేసినా ముడతలు పోకపోతే చీరపై వచ్చిన లేబుల్​ను పరిశీలించాలని.. ఈ క్లాత్ ఐరన్​ను తట్టుకుంటుందా లేదా అన్న విషయాన్ని చూసుకోవాలని చెబుతున్నారు. ఒకవేళ ఐరన్ చేయడం సురక్షితమేనని చెబితే.. తక్కువ వేడితో డ్రై ఐరన్​ చేయాలని సూచిస్తున్నారు. వస్త్రం నాణ్యత చెడిపోకుండా ఉండేందుకు చీర లోపలి నుంచి పక్కకు ఐరన్ చేయాలని సలహా ఇస్తున్నారు. ఐరన్ చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని.. లేకపోతే చీర దెబ్బతినే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

చీరను ఎలా కడుతున్నారు? - ఇలా కడితే "లుకింగ్​ వెరీ బ్యూటిఫుల్​"! - Saree Draping Tips

నార్మల్ చీరతో డిజైనర్ లుక్ - ఈ టిప్స్​ పాటిస్తే మెరిసిపోతారంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.