ETV Bharat / offbeat

మట్టి కుండలు, పాత్రలు కొన్న తర్వాత ఏం చేస్తున్నారు? - ఇలా చేస్తేనే పగిలిపోకుండా ఉంటాయి! - HOW TO SEASONING CLAY POTS

- మట్టి పాత్రల ఉపయోగంలో కీలక విషయం - నేరుగా వాడేస్తే త్వరగా దెబ్బతింటాయి

How to Seasoning Clay Pots
Clay Pots (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : April 24, 2025 at 5:27 PM IST

4 Min Read

How to Seasoning Clay Pots : ప్రస్తుతం పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అందరూ మట్టి పాత్రల వైపు మొగ్గు చూపుతున్నారు. నీళ్లు తాగడానికి మట్టితో చేసిన కుండలు, వంటల కోసం పాత్రలు, వెంట తీసుకెళ్లేందుకు బాటిల్స్​ అంటూ తమ అవసరాలకు తగ్గట్టు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మట్టి పాత్రలకు గిరాకీ పెరిగింది. ఇంట్లో వేలు పెట్టి కొన్న ఫ్రిడ్జ్​ ఉన్నా సరే, వందలు పెట్టి కొన్న కుండల్లోని వాటర్​ను తాగడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాకుండా స్టీల్​, అల్యూమినియం పాత్రలను పక్కకు పెట్టి మట్టి పాత్రల్లోనే వంటలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఇంతవరకు బానే ఉన్నా కొద్దిమంది పాత్రలు కొన్న వెంటనే కడిగేసి వంటకు ఉపయోగిస్తుంటారు. కానీ అలా చేయడం మంచి పద్ధతి కాదంటున్నారు నిపుణులు. కొత్త పాత్రలను వాడేముందు సీజనింగ్​ చేయాలని సూచిస్తున్నారు. అసలు సీజనింగ్​ అంటే ఏమిటి? ఎలా చేయాలి అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

How to Seasoning Clay Pots
Clay Pots (Getty Images)

సీజనింగ్​ అంటే ఏమిటి ?

సీజనింగ్ అంటే ఆహారానికి రుచిని పెంచడానికి ఉపయోగించే పద్ధతి. మట్టి పాత్రలను సీజనింగ్ చేయడం చాలా ముఖ్యం. ఇది ​చేయడం వల్ల పాత్రలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. అలాగే ఆహారం గిన్నెలకు అంటుకోకుండా, మట్టి వాసన ఆహారంలోకి చేరకుండా ఉంటుంది. కాగా, మట్టి పాత్రలను సీజనింగ్​ చేసేందుకు చాలా మంది రకరకాల పద్ధతులను పాటిస్తుంటారు. అందులో కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.

బియ్యప్పిండి :

  • మార్కెట్​ నుంచి తెచ్చిన వెంటనే వాడకుండా ముందుగా నీటిలో నానబెట్టాలి. అందుకోసం వెడల్పాటి టబ్​లో పాత్రలు ఉంచి, అవి నిండా మునిగేలా వాటర్​ పోసుకోవాలి. సుమారు వీటిని 10 గంటలు లేదా వీలైతే రాత్రంతా నీటిలో ఉంచాలి.
  • ఆ మరుసటి రోజు నీటిలో నుంచి తీసేసి కాటన్​ క్లాత్​తో శుభ్రంగా తుడవాలి. ఆ తర్వాత స్టవ్​ మీద పెట్టి బియ్యం కడిగిన నీళ్లు పోసుకుని బాగా మరిగించాలి.
  • నీళ్లు చిక్కగా మారిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత నీళ్లు పారబోసి బియ్యప్పిండి లేదా శనగపిండి వేసి పాత్ర లోపల భాగం మొత్తం రుద్దాలి.
  • ఆ తర్వాత మూమూలు నీటితో శుభ్రంగా కడిగేసి పూర్తిగా ఆరబెట్టాలి. ఎండిన అనంతరం పాత్ర లోపల, బయట లైట్​గా వంట నూనెను అప్లై చేసి పూర్తిగా ఎండబెట్టాలి.
  • పాత్ర పూర్తిగా ఎండిన తర్వాత తీసి వాడుకుంటే సరి.
How to Seasoning Clay Pots
Rice Flour (Getty Images)

నీళ్లు :

  • వెడల్పాటి టబ్​లో పాత్రలు ఉంచి, అవి నిండా మునిగేలా వాటర్​ పోసుకోవాలి. సుమారు వీటిని 10 గంటలు లేదా వీలైతే రాత్రంతా నీటిలో ఉంచాలి.
  • నానిన మట్టి పాత్రలను నీటి నుంచి తీసేసి స్టవ్​ మీద పెట్టి నీళ్లు పోసి మరిగించాలి.
  • నీళ్లు మరిగి సగానికి అయిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి.
  • మరిగిన నీటిని పారబోసి స్మూత్​ స్క్రబ్బర్​ సాయంతో క్లీన్​ చేసి వాటర్​ తడి లేకుండా తుడుచుకోవాలి.
  • ఆ తర్వాత లైట్​గా ఆయిల్​ అప్లై చేసి ఓ రెండు మూడు గంటలు ఆరబెడితే సరి.

బియ్యం నీళ్లు :

  • వెడల్పాటి టబ్​లో పాత్రలు ఉంచి, అవి నిండా మునిగేలా వాటర్​ పోసుకోవాలి. సుమారు వీటిని 8 గంటల పాటు నీటిలో ఉంచాలి.
  • నానిన మట్టి పాత్రలను నీటి నుంచి తీసేసి స్టవ్​ మీద పెట్టి బియ్యం కడిగిన నీళ్లు పోసి మరిగించాలి.

  • మరిగిన నీటిని పారబోసి మంచి నీటితో కడిగి తడి లేకుండా తుడవాలి.

హాట్​ సమ్మర్​లో కూల్​కూల్​ "సగ్గుబియ్యం షర్బత్​" - ఒక్క గ్లాస్​ తాగారంటే ఒంట్లో వేడి దెబ్బకి పరార్​!

Clay Pots
Nimma (Getty Images)

నిమ్మకాయ:

  • బకెట్​లో నీళ్లు పోసి అందులో మట్టి పాత్రలు ఉంచాలి.
  • 10 గంటల తర్వాత తీసేసి మెత్తటి క్లాత్​ కవర్స్​తో క్లీన్​ చేయాలి.
  • ఆపై అర చెక్క నిమ్మకాయతో మట్టి పాత్రను రుద్ది వాటర్​తో కడగాలి.
  • ఆ తర్వాత నిండా నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి మరిగించాలి.
  • పాత్రలోని నీరు చల్లారిన తర్వాత పారబోసి తడి లేకుండా తుడవాలి.
  • ఆ తర్వాత నూనెను అప్లై చేసి రాత్రంతా అలానే వదిలేసి మరుసటి రోజు వాడుకుంటే సరి.
How to Seasoning Clay Pots
Clay Pots (Getty Images)

నీళ్ల కుండ :

  • మంచి నీటి కోసం కుండ లేదా బాటిల్​ తీసుకొచ్చుకుంటే దానిని సెపరేట్​గా క్లీన్​ చేయాలి.
  • అందుకోసం ముందుగా కుండను ఓ సారి శుభ్రంగా కడగాలి.
  • ఆ తర్వాత దాని నిండా నీళ్లు నింపి పావు కప్పు ఉప్పు వేసి అలా వదిలేయాలి.
  • 24 గంటల తర్వాత ఆ నీటిని పారబోసి మరోసారి శుభ్రంగా కడిగి ఉపయోగిస్తే సరి.
How to Seasoning Clay Pots
Clay Pots (Getty Images)

సీజనింగ్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

  • మొదటి కొద్ది రోజులు తక్కువ మంట మీదే వంటలు చేసుకోవాలి.
  • పాత్ర వేడిగా ఉన్నప్పుడు వెంటనే చల్లని నీటిలో పెట్టకండి. ఎందుకంటే పగిలిపోయే అవకాశం ఉంటుంది.
  • పాత్రను శుభ్రం చేయడానికి మృదువైన స్పాంజ్​ను మాత్రమే ఉపయోగించాలి. గట్టి బ్రష్‌లు లేదా రాపిడి కలిగిన పదార్థాలు వాడొద్దు.
  • పాత్రను ఎల్లప్పుడూ పూర్తిగా ఆరబెట్టాకే నిల్వ చేయాలి. లేకపోతే బూజు పట్టే అవకాశం ఉంటుంది.

ఘుమఘుమలాడే "చికెన్​ మజ్జిగ పులుసు" - ఈ పద్ధతిలో చేస్తే మెతుకు కూడా మిగల్చరు!

ఎండలకు కళ్లు మండుతున్నాయా? - ఈ టిప్స్​ పాటించి జాగ్రత్తగా కాపాడుకోండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.