ETV Bharat / offbeat

మైదా, వంటసోడా లేకుండా - అప్పటికప్పుడు చేసుకునే "చిట్టి పునుగులు" - చల్లని వేళ కమ్మగా కరకరలాడుతాయి! - NO MAIDA NO BAKING SODA PUNUGULU

- రెగ్యులర్​గా అటుకులతో పోహా రొటీన్​ - ఇలా కరకరలాడే కమ్మని "పునుగులు" చేసుకోండి!

Instant Punugulu Recipe
Punugulu Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 15, 2025 at 10:49 AM IST

3 Min Read

Instant Punugulu Recipe : అటుకులలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ క్రమంలో ఎక్కువ మంది వీటితో తరచుగా మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​లో పోహా చేసుకుంటుంటారు. అయితే, ఎప్పుడు అదే కాకుండా అటుకులతో క్విక్ అండ్ ఈజీగా కరకరలాడే "పునుగులను" ప్రిపేర్ చేసుకోవచ్చు. వాతావరణం చల్లగా ఉన్న టైమ్​లో వేడి వేడిగా అప్పటికప్పుడు ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేసుకొని తినాలనిపిస్తే వీటిని ట్రై చేయండి. ఎలాంటి పప్పులు నానబెట్టి, రుబ్బే పనిలేకుండా ఇన్​స్టంట్​గా ఇవి రెడీ అయిపోతాయి. వంటసోడా కూడా వేయకుండానే ఇవి చక్కగా పొంగి మంచి టేస్టీగా, క్రిస్పీగా వస్తాయి. పైగా, నూనె కూడా తక్కువే పీల్చుకుంటాయి! మరి, ఇంకెందుకు ఆలస్యం చల్లని వేళ సింపుల్​గా ఇలా అటుకులతో పునుగులను చేసుకొని ఇంటిల్లిపాదీ ఎంజాయ్ చేయండి.

Punugulu Recipe
Atukulu (ETV Bharat)

కావాల్సిన పదార్థాలు :

  • అటుకులు - ఒక కప్పు
  • పెరుగు - అర కప్పు
  • ఉప్పు - రుచికి తగినంత
  • పొడి బియ్యప్పిండి - ఒక కప్పు
  • మీడియం సైజ్ ఉల్లిపాయ - ఒకటి
  • పచ్చిమిర్చి - మూడు
  • కరివేపాకు - కొద్దిగా
  • జీలకర్ర - అరటీస్పూన్
  • నూనె - వేయించడానికి సరిపడా

కరకరలాడే "మూంగ్ దాల్" బయట కొనాల్సిన పనిలేదు - ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి!

Punugulu Recipe
Pindi (ETV Bharat)

తయారీ విధానం :

  • ఈ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్​లో మందపాటి అటుకులను ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగాలి.
  • తర్వాత అందులో కాస్త పులిసిన పెరుగు, ఒక కప్పు వాటర్ వేసుకొని కలిపి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
  • అటుకులు నానేలోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చిలను వీలైనంత సన్నగా తరుక్కొని రెడీగా ఉంచుకోవాలి.
  • పది నిమిషాల అనంతరం మూత తీసి చూస్తే అటుకులు పెరుగులో బాగా నాని ఉంటాయి. అప్పుడు ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్​లోకి తీసుకొని ఆపై అందులో రుచికి తగినంత ఉప్పు, పొడి బియ్యప్పిండి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి.
Punugulu Recipe
Punugulu Making Process (ETV Bharat)
  • తర్వాత అందులో అవసరం మేరకు కొద్దిగా నీటిని వేసుకొని బోండాలకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పిండిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇక్కడ పిండి కన్సిస్టెన్సీ అనేది కాస్త గట్టిగానే ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే జారుడుగా ఉంటే పునుగులు నూనెను ఎక్కువగా పీల్చేస్తాయని గుర్తుంచుకోవాలి.
  • ఆవిధంగా పిండిని సిద్ధం చేసుకున్నాక దాన్ని ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి. తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న సన్నని ఉల్లిపాయ తరుగు, కరివేపాకు తరుగు, పచ్చిమిర్చి తరుగు, జీలకర్ర వేసుకొని అవన్నీ పిండిలో చక్కగా కలిసేలా బాగా కలుపుకొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు పునుగులు వేసుకోవడానికి స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రైకి తగినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి.
Punugulu Recipe
Punugulu Making (ETV Bharat)
  • ఆయిల్ వేడయ్యాక స్టవ్​ను మీడియం ఫ్లేమ్​లో ఉంచి కలిపి పెట్టుకున్న పిండిని చేతిలోకి కొద్దికొద్దిగా తీసుకుంటూ పునుగుల మాదిరిగా వేసుకోవాలి.
  • పాన్​లో సరిపడా వేసుకున్నాక వెంటనే కదపకుండా కాసేపు వేగిన తర్వాత జాలి గరిటెతో రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక వాటిని టిష్యూ పేపర్ పరచిన ప్లేట్​లోకి తీసుకొని కాసేపు ఉంచి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, అటుకులతో అప్పటికప్పుడు సూపర్ టేస్టీగా కరకరలాడే "పునుగులు" రెడీ అయిపోతాయి!
  • ఆపై ఈ పునుగులను వేడి వేడిగా టమాటా చట్నీ లేదా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తింటుంటే ఆ ఫీలింగ్ సూపర్​గా ఉంటుంది.
Instant Punugulu Recipe
Punugulu Recipe (ETV Bharat)

టిప్స్ :

  • ఈ పునుగుల తయారీ కోసం కాస్త మందపాటి అటుకులను తీసుకోవాలి. ఇక్కడ అటుకులు తీసుకున్న కప్పునే మిగతా ఇంగ్రీడియంట్స్ తీసుకోవడానికి వాడుకోవాలి.
  • కాస్త పులిసిన పెరుగు వేసుకోవడం ద్వారా పునుగులు చాలా రుచికరంగా ఉంటాయి.
  • నూనె కాగిన తర్వాత మాత్రమే పునుగులు వేసుకొని వేయించుకోవాలి. లేదంటే ఎక్కువ ఆయిల్ పీల్చేస్తాయని గుర్తుంచుకోవాలి.

స్వీట్​ షాప్​ స్టైల్​ "గట్టి పకోడీ" - ఈ టిప్స్​, కొలతలు పాటిస్తే కరకరలాడుతుంది! - వారం పైనే నిల్వ!

నూనె పీల్చకుండా మినపప్పుతో "మైసూర్ బోండాలు" - పిండిని ఇలా కలిపితే పొంగుతూ, కరకరలాడుతూ వస్తాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.