ETV Bharat / offbeat

చూడగానే తినాలనిపించే "సూర్యకళ స్వీట్" - ఇంట్లోనే స్వీట్​ షాప్ స్టైల్​లో సింపుల్​గా చేసుకోండిలా! - SURYAKALA SWEET RECIPE AT HOME

సరికొత్త రుచితో అద్దిరిపోయే స్వీట్ రెసిపీ - పైన క్రిస్పీగా, లోపల జ్యూసీ జ్యూసీగా నోరూరిస్తుంది!

Suryakala Sweet Recipe
Suryakala Sweet Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 10, 2025 at 11:10 AM IST

5 Min Read

Suryakala Sweet Recipe in Telugu : ఇంట్లోనే సింపుల్​గా ఏదైనా స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా? అది కూడా రొటీన్ తీపి వంటకం కాకుండా డిఫరెంట్​గా ఉండాలని కోరుకుంటున్నారా? అయితే, మీకోసమే ఈ సూపర్ రెసిపీ. అదే, నోరూరించే "సూర్యకళ స్వీట్". ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసుకున్నారంటే అచ్చం స్వీట్ షాప్ స్టైల్​లో తియ్యగా, జ్యూసీ జ్యూసీగా ఎంతో రుచికరంగా వస్తాయి. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండే వీటిని ఇంటిల్లిపాదీ చాలా ఇష్టంగా తింటారు! మరి, ఈ సూపర్ స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

స్టఫింగ్ కోసం :

  1. పాలు - ఒక లీటర్​న్నర
  2. పంచదార - రెండు టేబుల్​స్పూన్లు
  3. నెయ్యి - ఒక టీస్పూన్
  4. జీడిపప్పు పలుకులు - కొద్దిగా
  5. బాదం పలుకులు - కొన్ని

పిండి కోసం :

  • మైదా - రెండు కప్పులు
  • ఉప్పు - చిటికెడు
  • వంటసోడా - రెండు చిటికెళ్లు
  • నెయ్యి - పావు కప్పు

ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ "బూందీ లడ్డూలు" - ఈ టిప్స్​తో మొదటిసారి చేసినా పర్ఫెక్ట్​గా వస్తాయి!

Suryakala Sweet Recipe
Kova (ETV Bharat)

తయారీ విధానం :

  • ఈ స్వీట్ తయారీ కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కొన్ని నీళ్లను పోసి బాగా మరిగించి పారబోసుకోవాలి.
  • ఇలా చేయడం ద్వారా ఇంతకుమునుపు కడాయిలో వండిన ఫ్లేవర్ ఏమి పాలలోకి రాకుండా ఉంటుంది. అలాగే, పాలు విరిగిపోకుండా ఉంటాయి.
  • తర్వాత కడాయిలో చిక్కని పాలను పోసుకొని హై ఫ్లేమ్​లో కలుపుతూ 30 నుంచి 45 నిమిషాల పాటు మరిగించుకోవాలి.
  • పాలు బాగా మరిగి చిక్కని మిశ్రమంలా(ఫొటోలో చూపిస్తున్న విధంగా) మారిన తర్వాత అందులో కోవాకు తీపి కోసం పంచదార వేసుకొని మరికొద్దిసేపు కలుపుతూ ఉడికించుకోవాలి.
  • ఇది చల్లారిన తర్వాత మరికాస్త చిక్కబడుతుంది కాబట్టి కాస్త లూజుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని పాన్​ని దింపి చల్లార్చుకోవాలి.
Suryakala Sweet Recipe
Kova Balls (ETV Bharat)
  • ఇప్పుడు ప్లేట్​లో మైదా పిండి, ఉప్పు, వంటసోడా తీసుకొని ఒకసారి బాగా కలిపి నెయ్యి వేసుకొని అది పిండికి పట్టేలా చేతితో రబ్ చేస్తూ కలుపుకోవాలి.
  • అలా కలిపాక పిండి చక్కగా బైండ్ అవుతున్నట్లయితే నెయ్యి సరిపోయిందని గుర్తుంచుకోవాలి. అలాకాకపోతే మరికొద్దిగా నెయ్యి వేసి కలుపుకోవచ్చు.
  • ఆ తర్వాత అందులో తగినన్ని నీటిని కొద్దికొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా, లూజుగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో మెత్తని ముద్దలా కలుపుకొని మూతపెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
  • ఆలోపు రెసిపీలోకి కావాల్సిన పంచదార సిరప్​ని ప్రిపేర్ చేసుకోవాలి.
Suryakala Sweet Recipe
Suryakala Sweet Making (ETV Bharat)

పాకం కోసం :

  • పంచదార - 2 కప్పులు(400 గ్రాములు)
  • యాలకుల పొడి - పావుటీస్పూన్
  • నేచురల్ ఫుడ్ కలర్ - కొద్దిగా
  • నిమ్మరసం - కొద్దిగా
Suryakala Sweet Recipe
Suryakala Sweet Recipe (ETV Bharat)
  • ఇందుకోసం స్టవ్ మీద లోతుగా ఉండే గిన్నె​లో పంచదార, ఒక కప్పు నీళ్లను తీసుకొని మరిగించుకోవాలి.
  • పంచదార పూర్తిగా కరిగి జిడ్డుగా, నూనెలా మారినప్పుడు(అంటే తీగ పాకం రాక ముందే) మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, కలర్ కోసం కొద్దిగా నేచురల్ ఫుడ్ కలర్ వేసుకొని కలపాలి.
  • ఆపై పాకం చల్లారిన కూడా గట్టిపడకుండా ఉండడానికి పావు చెక్క నిమ్మరసం పిండుకొని మరోసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని పాన్​ని దింపి మూతపెట్టి పక్కనుంచాలి.
  • అనంతరం స్టఫింగ్ కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి లైట్​గా వేడయ్యాక పలుకులుగా ఉండేలా దంచుకున్న జీడిపప్పు, బాదంపప్పు తరుగు వేసుకొని లో ఫ్లేమ్​లో దోరగా వేయించుకోవాలి.
  • అవి చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్తిగా చల్లారి గట్టి పడిన కోవాలో వేసి అంతా బాగా కలుపుకోవాలి.
  • ఆపై కావాల్సిన పరిమాణంలో కోవా స్టఫింగ్ తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
Suryakala Sweet Recipe
Suryakala Sweet Making (ETV Bharat)
  • ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. తర్వాత దాన్ని రెండు ఉండలుగా చేసుకొని ఒకదాన్ని తీసుకొని చపాతీ పీటపై ఉంచి మరీ పల్చగా, మందంగా కాకుండా మీడియం థిక్​నెస్​తో వీలైనంత వరకు పెద్ద చపాతీలా వత్తుకోవాలి.
  • అనంతరం ఆ పెద్ద రోటీని మీక కావాల్సిన సైజ్​లో అంచులు షార్ప్​గా ఉండే చిన్న గిన్నె లేదా గ్లాసుతో చిన్న చిన్న అప్పాల్లా కట్ చేసుకొని మిగతా పిండిని తీసేసుకోవాలి.
  • ఆవిధంగా చేసుకున్నాక ఒక చిన్న అప్పం తీసుకొని దానిపై ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక కోవా ఉండను ఉంచి ఆపై అది చక్కగా క్లోజ్ అవ్వడం కోసం చుట్టూ కొద్దిగా వాటర్ అప్లై చేసుకోవాలి.
  • ఆపై దాని మీద మరో చిన్న అప్పాన్ని ఉంచి లోపల గాలి ఏమి ఉండకుండా చుట్టూ వేలితో వత్తి క్లోజ్ చేయాలి.
Suryakala Sweet Recipe
Suryakala Sweet (ETV Bharat)
  • అనంతరం దాన్ని చేతిలోకి తీసుకొని వేళ్లతో అంచుల వెంట నిలువుగా కొద్దిగా కట్ చేసి మళ్లీ సైడ్​కి​ మడుస్తూ అంటే సూర్యకిరణాల లాంటి డిజైన్ వచ్చేలా పైన ఫొటోలో చూపిస్తున్నట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆవిధంగా డిజైన్ చేసుకున్నాక చుట్టూ మరోసారి చేతితో చక్కగా సర్దుకోవాలి.
  • ఇలా చేసేటప్పుడు స్టఫింగ్ కనిపించే లోపల ఎలాంటి హోల్ పడకుండా చూసుకోవాలి. ఈవిధంగా డిజైన్ చేసుకోవడం ఇబ్బంది అనుకునేవారు క్లోజ్ చేసుకున్నాక ఫోర్క్ చెంచాతో సింపుల్​గా డిజైన్ పెట్టుకుంటే సరిపోతుంది.
  • ఈవిధంగా పిండి మొత్తాన్ని ఒక్కొక్కటిగా చేసుకొని ఒక వెడల్పాటి ప్లేట్​లో ఉంచి డ్రై అయిపోకుండా తడిబట్ట వేసి పక్కనుంచాలి.
Suryakala Sweet Recipe
Suryakala Sweet (ETV Bharat)
  • అనంతరం స్టవ్ మీద కడాయిలో వేయించడానికి సరిపడా ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ముందుగా సూర్యకళ షేప్​లో రెడీ చేసుకున్న వాటిని నెమ్మదిగా పాన్​లో సరిపడా వేసుకొని స్టవ్​ను లో టూ మీడియం ఫ్లేమ్​కి టర్న్ చేసుకుంటూ వేయించాలి.
  • అవి నూనెలో కాస్త బిగుసుకున్న తర్వాత గరిటెతో తిప్పుతూ రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇవి సరిగ్గా వేగడానికి పావు గంట వరకు టైమ్ పట్టొచ్చు.
  • అలా వేయించుకున్నాక వాటిని తీసి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోరువెచ్చని చక్కెర సిరప్​లో వేసి ఒక నిమిషం పాటు ఉంచి బయటకు తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
  • అంతే, స్వీట్ షాప్ స్టైల్​లో ఎంతో రుచికరంగా జ్యూసీగా ఉండే "సూర్యకళ స్వీట్" ఇంట్లోనే రెడీ అయిపోతుంది!

టిప్స్ :

  • ఇక్కడ నెయ్యి ఇష్టంలేని వాళ్లు దాని ప్లేస్​లో నూనెను అయినా వేసుకోవచ్చు.
  • అప్పంలో స్టఫింగ్ వేసుకున్నాక చక్కగా సీల్ చేయకపోతే నూనెలో వేసినప్పుడు అది ఆయిల్​లో పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చక్కగా క్లోజ్ చేసుకోవాలి.
  • రెసిపీలోకి కావాల్సిన పంచదార సిరప్ సరిగా ఉడకకపోతే స్వీట్స్ అందులో వేసినప్పుడు మెత్తబడిపోతాయని గుర్తుంచుకోవాలి.

మినప్పప్పుతో "జాంగ్రీలు" చేసుకోండి - జ్యూసీ జ్యూసీగా, చాలా కమ్మగా వస్తాయి! - ఖర్చు కూడా తక్కువే!

తియ్యతియ్యగా నోరూరించే "జర్దా పులావ్" - అన్నం వండుకునేంత ఈజీగా చేసుకోవచ్చు! - రుచి అమోఘం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.