ETV Bharat / offbeat

పొడవు వంకాయలతో "నోరూరించే ఉల్లికారం" - అన్నం తింటుంటే మైమరచిపోతారంతే! - VANKAYA ULLI KARAM

సింపుల్​ రెసిపీ వంకాయ ఉల్లికారం - ఈ పద్ధతిలో చేస్తే సూపర్​ టేస్ట్​!

Vankaya Ulli Karam Recipe in Telugu
Vankaya Ulli Karam Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 7, 2025 at 5:04 PM IST

2 Min Read

Vankaya Ulli Karam Recipe in Telugu : కొంత మంది పొడవుగా ఉండే వంకాయలు తినడానికి ఆసక్తి చూపించరు. ఈ కర్రీ కాస్త చప్పగా ఉంటుందని భావిస్తుంటారు. అలాంటివారు ఇక్కడ చెప్పిన విధంగా వంకాయ ఉల్లికారం ట్రై చేయండి టేస్ట్​ అద్దిరిపోతుంది. ఈ వంకాయ ఉల్లికారం వేడివేడి అన్నంతో చాలా బాగుంటుంది. మరి ఈజీగా వంకాయ ఉల్లికారం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Vankaya
Vankaya (Getty Images)

వంకాయ ఉల్లికారం తయారీకి కావాల్సిన పదార్థాలు :

  • వంకాయలు - అరకేజీ
  • ధనియాలు - 2 టేబుల్​స్పూన్లు
  • జీలకర్ర - 2 టీస్పూన్లు
  • కరివేపాకు - 2
  • వెల్లుల్లి - 10
Onions
Onions (Getty Images)
  • ఉల్లిపాయలు - 2
  • నిమ్మకాయ - 1
  • పసుపు - పావు టీస్పూన్
  • ఉప్పు, కారం - రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • నూనె - 3 టేబుల్​స్పూన్లు

"ఇన్​స్టెంట్ వెజ్ పొంగనాలు" - పిండి నానబెట్టే పనిలేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు!

Vankaya Ulli Karam Process
Vankaya Ulli Karam Process (ETV Bharat)

వంకాయ ఉల్లికారం తయారీ విధానం:

  • ముందుగా లేత వంకాయలను శుభ్రంగా కడిగి మీడియం సైజ్​ ముక్కలుగా కట్ ​చేసుకోండి.
  • ఇలా కట్​ చేసుకున్న వంకాయ ముక్కలను ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి. వంకాయ ముక్కలను ఉప్పు నీటిలో నానబెట్టడం వల్ల అవి రంగు మారకుండా తాజాగా ఉంటాయి.
  • తర్వాత ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్​ చేసుకోండి.
  • ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టండి. ఇందులో 2 టేబుల్​స్పూన్లు ధనియాలు, టీస్పూన్ జీలకర్ర వేసి ఫ్రై దోరగా చేయండి. తర్వాత వీటిని చిన్న గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి.
  • తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి వేయించిన ధనియాలు, జీలకర్ర వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆపై ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, రుచికి సరిపడా కారం, ఉప్పు, నిమ్మరసం పిండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
  • ఇలా గ్రైండ్​ చేసుకున్న ఉల్లికారం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్ ఆన్​ చేసి కడాయి పెట్టి 3 టేబుల్​స్పూన్లు నూనె వేసి వేడి చేయండి. ఆయిల్​ వేడయ్యాక టీస్పూన్ జీలకర్ర వేసి వేయించండి. ఆపై కట్​ చేసిన వంకాయ ముక్కలు వేసి కలుపుతూ 5 నిమిషాలు మగ్గించుకోండి.
  • తర్వాత పావు టీస్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలపండి. ​
  • ఇప్పుడు ముందుగా గ్రైండ్​ చేసుకున్న వంకాయ ఉల్లికారం వేసి బాగా కలపండి. తర్వాత ఇందులో కొన్ని నీళ్లు, కరివేపాకు వేసి కలిపి వంకాయలు మెత్తగా ఉడికించుకోండి.
  • చివరిగా వంకాయ ఉల్లికారంలో కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి స్టవ్​ ఆఫ్ చేయండి.

అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ ఉల్లికారం మీ ముందుంటుంది. వేడివేడి అన్నం, చపాతీలతో వంకాయ ఉల్లికారం రుచి అద్భుతంగా ఉంటుంది. వంకాయ ఉల్లికారం తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.

పెసరపప్పుతో "పాలక్ పనీర్ ఊతప్పం" - ఇది ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్​!

కమ్మటి "పచ్చిమిర్చి కరివేపాకు తొక్కు" - వేడివేడి అన్నంలో తింటుంటే ఆ మజానే వేరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.