Vankaya Malai Korma : వంకాయ అంటే ఇష్టపడే వారు "వంకాయ మలాయ్ కుర్మా" తప్పక రుచి చూడాల్సిందే! వంకాయ కూరలు ప్రాంతానికి తగినట్లు దేశమంతా వివిధ రకాలుగా చేస్తారు. అందరూ ఇష్టంగా తినే వాటిలో ఇదీ ఒకటి. ఈ స్పెషల్ కుర్మా రెసిపీ కమ్మగా తిన్నకొద్దీ తినాలనిపిస్తుంది. రోటీ, చపాతీ, పూరీ, పుల్కాలతో పాటు బగారా రైస్ లోకి ఈ వంకాయ మలాయ్ కుర్మా చక్కని జోడీ.
చుక్క నూనె, సోడా లేకుండా "స్పాంజ్ దోసెలు" - ఈ సీక్రెట్ ఫాలో అయితే చాలు మృదువుగా వస్తాయి!

కర్రీ కోసం టిప్స్
- లేత వంకాయలు వాడడం వల్ల కుర్మా రుచిగా ఉంటుంది.
- చీరుకున్న వంకాయలు నూనెలో 60% వేగితే చాలు, మిగిలినది కుర్మాలో మగ్గిపోతుంది. అప్పుడే వంకాయకి ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి.
- కుర్మా కోసం ఎండు కారం కంటే పచ్చిమిర్చి కారం రుచిగా ఉంటుంది.
కావాల్సిన పదార్థాలు
- గుత్తి వంకాయలు - ఆరు
- నీళ్లు - అర లీటరు
- ఉప్పు - రుచికి సరిపడా
- కొద్దిగా - కొత్తిమీర
- నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
- నూనె - - 2 టేబుల్ స్పూన్లు
- బిర్యానీ ఆకు - 1
- యాలకులు - 3
- లవంగాలు - 4
- దాల్చిన చెక్క - 2 ఇంచులు
- జీలకర్ర - అర టీ స్పూన్
- కారం - - అర టీ స్పూన్
- వేయించిన జీలకర్ర పొడి - అర టీ స్పూన్
- అల్లం వెల్లులి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
- మిరియాల పొడి - అర టీ స్పూన్
- బటర్ - 1 టేబుల్ స్పూన్
- పాల మీగడ - 2 టేబుల్ స్పూన్లు
మసాలా పేస్ట్ కోసం
- వేయించిన ఉల్లిపాయలు - 1 కప్పు
- జీడిపప్పు- 15
- కర్బూజ గింజలు - 2 టీ స్పూన్లు
- పచ్చిమిర్చి - 5
తయారీ విధానం
- లేత గుత్తి వంకాయలను మధ్యలోకి చీరుకుని నూనెలో 60% వేయించాలి.
- మసాలా పేస్ట్ కోసం తీసుకున్న పదార్థాలను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
- పాన్లో నెయ్యి, నూనె వేడి చేసి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు, అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేయించాలి.
- ఆ తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర పొడి, అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోవాలి
- ఇపుడు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాక ఉడికించుకున్న తర్వాత వంకాయలు, వేడి నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాక మూతపెట్టి ఉడికించుకోవాలి.
- నూనె పైకి తేలిన తర్వాత మిరియాల పొడి, బటర్, క్రీమ్ వేసి బాగా కలిపి దింపుకోవడమే. ఈ కూర వేడివేడి అన్నంతో పాటు చపాతీ, పుల్కాల్లోకి చాలా రుచిగా ఉంటుంది.
మలయాళీల ఫేవరెట్ "ముట్టా కర్రీ!" - ఇలా చేస్తే రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!
సింపుల్ రెసిపీ "సేమియా కస్టర్డ్" - ఈ స్టెప్స్ ఫాలో అయితే పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు!