ETV Bharat / offbeat

చల్ల చల్లని "ఠండాయి" - ఇదొక్కసారి తాగితే ఇంకో డ్రింక్ గుర్తుకు రాదు! అంత బాగుంటుంది! - THANDAI RECIPE

సమ్మర్​ స్పెషల్​ జ్యూస్​ ఠండాయి - ఇలా చేయండి రుచి అస్సలు మర్చిపోలేరు!

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 15, 2025 at 4:58 PM IST

2 Min Read

Thandai Recipe in Telugu : ఈ సమ్మర్లో ఎండవేడి, ఉక్కపోత కారణంగా దాహం ఎక్కువగా వేస్తుంది. అలా అని తరచూ చల్లటి నీళ్లు తాగాలని కూడా అనిపించదు. ఈ క్రమంలోనే ఎక్కువ మంది స్పెషల్​ డ్రింక్స్ప్రిపేర్​ చేసుకుంటారు. అలాంటి వారు ఒక్కసారి ఇక్కడ చెప్పిన విధంగా ఠండాయి డ్రింక్​ ట్రై చేయండి. ఈ ఠండాయి మంచి మసాలా ఫ్లేవర్స్​తో చిక్కగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ ఠండాయి డ్రింక్​ హోలీ రోజు తప్పని సరిగా ఉత్తర భారతం వారు తీసుకుంటారు. మరి సింపుల్​గా ఈ ఠండాయి డ్రింక్​ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

నోరూరించే "మీల్​ మేకర్​ మంచూరియా" - ఇది స్పైసీ, జ్యూసీగా చికెన్ కంటే బాగుంటుంది!

Milk
Milk (Getty Images)

​ తయారీకి కావాల్సిన పదార్థాలు

  • బాదం - పావు కప్పు
  • గసగసాలు - 2 టేబుల్​స్పూన్లు
  • జీడిపప్పులు - పావు కప్పు
  • సోంపు - 2 టేబుల్​స్పూన్లు
  • గుమ్మడి గింజలు - 2 టేబుల్​స్పూన్లు
  • మిరియాలు - అర టేబుల్​స్పూన్
  • యాలకులు - 10
  • ఎండిన గులాబీ రేకులు - 3 టేబుల్​స్పూన్లు
  • కుంకుమ పువ్వు - చిటికెడు
  • కండ చక్కెర - రుచికి సరిపడా
  • పాలు - లీటర్
  • కొద్దిగా జాజికాయ పొడి
Dry Fruits
Dry Fruits (Getty Images)

ఠండాయి తయారీ విధానం

  • ముందుగా నట్స్​ని నానబెట్టుకోవాలి. ఇందుకోసం ఒక మిక్సింగ్​ బౌల్లో పావు కప్పు జీడిపప్పులు, 2 టేబుల్​స్పూన్ల చొప్పున పిస్తా, గసగసాలు, సోంపు, గుమ్మడి గింజలు తీసుకోండి. అలాగే అర టేబుల్​స్పూన్ మిరియాలు, యాలకులు, 3 టేబుల్​స్పూన్లు ఎండిన గులాబీ రేకులు, చిటికెడు కుంకుమ పువ్వు వేసి సరిపడా నీళ్లు పోసి 3 గంటలు నానబెట్టుకోండి.
  • అలాగే మరొక చిన్న గిన్నెలో వేడి నీళ్లు పోసి బాదం వేయండి. వీటిని కూడా 3 గంటలు నానబెట్టుకోండి.
  • ఇప్పుడు స్టవ్​పై కడాయి పెట్టి లీటర్​ పాలు పోసి మీడియం ఫ్లేమ్​లో 5 నిమిషాల పాటు మరిగించాలి.
  • అనంతరం పాలను ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వండి. ఆపై పాలను ఒక అరగంటపాటు ఫ్రిడ్జ్​లో పెట్టుకోండి.
  • అనంతరం నానబెట్టుకున్న బాదం పొట్టు తీసుకోండి.
  • ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో నానబెట్టుకున్న నట్స్ నీళ్లతో సహా తీసుకోండి. ఇందులో బాదం, రుచికి సరిపడా కండ చక్కెర, కొద్దిగా జాజికాయ పొడి​ వేసి వీలైనంత మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
Thandai Paste
Thandai Paste (ETV Bharat)
  • ఈ పేస్ట్​ని ఫ్రిడ్జ్​లో పెట్టుకున్న పాలలో వేసి బాగా కలుపుకోండి.
  • అంతే ఇలా సింపుల్​గా ప్రిపేర్​ చేసుకుంటే టేస్టీ అండ్​ హెల్దీ ఠండాయి డ్రింక్​ రెడీ!

మహారాజులు ధరించిన వజ్రం - వచ్చే నెలలోనే "గోల్కొండ బ్లూ" డైమండ్ వేలం - కళ్లు చెదిరే ధర!

బాలికలకు బలాన్నిచ్చే "బియ్యం పిండి పిట్టు"- ఆడపిల్లలు, మహిళలు తప్పక తినాల్సిన స్వీట్​ ఇది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.