ETV Bharat / offbeat

"తెలంగాణ దావత్ స్టైల్​ మటన్ కర్రీ" - ఓసారి ఇలా ఇంట్లో చేయండి! అందరూ "సూపర్"​ అంటారు! - MUTTON CURRY

ఫంక్షన్​ స్టైల్​ సూపర్​ మటన్​ కర్రీ - చిక్కని గ్రేవీ ఎంతో బాగుంటుంది!

telangana_style_mutton_curry
telangana_style_mutton_curry (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 13, 2025 at 7:18 PM IST

2 Min Read

Telangana Dawat Style Mutton Curry in Telugu : తెలంగాణలో ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్​ జరిగినా నాన్​వెజ్​ తప్పకుండా చేస్తారు. తెలంగాణ వంటకాల అనగానే అందరికీ ఘుమఘుమలాడే మటన్ బొక్కల​ కర్రీ గుర్తుకొస్తుంటుంది. అయితే, మీరు ఎప్పుడైనా ఈ దావత్​ స్పెషల్​ మటన్ కర్రీ ట్రై చేశారా? ఇక్కడ చెప్పిన విధంగా మటన్​ కర్రీ చేస్తే స్పైసీగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ చపాతీ, పులావ్​, బగారా రైస్​లోకి అద్దిరిపోతుంది. మరి సింపుల్​గా ఈ మటన్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • మటన్​ - అర కేజీ
  • ఉప్పు, కారం - రుచికి సరిపడా
  • పసుపు - అరటీస్పూన్
  • 3 టేబుల్​స్పూన్లు నూనె
  • ఉల్లిపాయలు - 2
  • పచ్చిమిర్చి -4
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • పుదీనా తరుగు - కొద్దిగా
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్​స్పూన్​
  • కసూరీ మేథి - కొద్దిగా
  • టమోటా - 2
Masala ingredients
Masala ingredients (ETV Bharat)

మసాలా పొడి కోసం కావాల్సిన పదార్థాలు

  • ధనియాలు - 2 టీ స్పూన్లు
  • జీలకర్ర - అర టీ స్పూన్
  • ఎండు కొబ్బరి ముక్కలు - టేబుల్​స్పూన్
  • యాలకులు - 4
  • లవంగాలు - 4
  • దాల్చిన చెక్క - చిన్నది
  • షాజీరా - టీస్పూన్
  • జీడిపప్పులు - 6
  • గసగసాలు - టీస్పూన్

అటుకులతో పోహా తినాలనిపించడం లేదా? -ఓసారి ఇలా "క్రిస్పీ కట్​లెట్స్"​ ట్రై చేయండి! భలే రుచిగా ఉంటాయి!

తయారీ విధానం

  • ముందుగా శుభ్రంగా కడిగిన మటన్ ముక్కలు ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. (తెలంగాణ ధావత్​ స్టైల్లో చేసే ఈ మటన్​ కర్రీ చేయడం కోసం కారం, మసాలాలతో మటన్​ మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు.)
  • స్టవ్​పై కడాయి పెట్టి మసాలా పొడి కోసం కావాల్సిన పదార్థాలన్నీ ఒక్కోటిగా వేసి లో ఫ్లేమ్​లో వేయించుకోవాలి. చివరిగా టీస్పూన్​ గసగసాలు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  • ఈ మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సీ జార్​లో వేసుకుని మెత్తగా పొడి చేసుకోండి. ఆపై ఇందులో కొన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్​లా మిక్సీ పట్టుకోండి. ఈ మసాలా పేస్ట్​ని గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు మటన్​ కర్రీ కోసం స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్​ నూనె వేసి వేడి చేయండి. ఇందులో కొద్దిగా జాపత్రి, చిన్న అనాసపువ్వు, నల్ల యాలక్కాయ, బిర్యానీ ఆకు, కొద్దిగా బిర్యానీ పువ్వు వేసి వేయించండి. ఆపై పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి.
  • ఆనియన్స్​ కాస్త రంగు మారిన తర్వాత పుదీనా, కొత్తిమీర తరుగు, కసూరీ మేథి కొద్దిగా వేసి ఫ్రై చేయండి.
  • అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించండి. ఇప్పుడు శుభ్రంగా కడిగిన మటన్​, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి 10 నిమిషాలు ఉడికించుకోండి.
  • తర్వాత రుచికి సరిపడా కారం, గ్రైండ్​ చేసుకున్న మసాలా పేస్ట్​ వేసి బాగా కలపండి.
  • తర్వాత టమోటా ముక్కలు వేసి కలిపి 5 నిమిషాలు ఉడికించుకోండి.
  • అనంతరం కర్రీలో గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి 5 విజిల్స్​ వచ్చే వరకు ఉడికించి స్టవ్​ ఆఫ్ చేయండి.
  • కుక్కర్లో ఆవిరి మొత్తం పోయిన తర్వాత వేడివేడి మటన్​ కర్రీ సర్వ్​ చేసుకుంటే సరి!
  • తెలంగాణ ధావత్​ స్టైల్లో ఉండే ఈ మటన్​ కర్రీ ఘాటుగా ఎంతో టేస్టీగా ఉంటుంది.

రాగి పిండితో "కమ్మని సెట్ దోశలు" -అప్పటికప్పుడు ఇలా సింపుల్​గా ప్రిపేర్​ చేయండి! ఎంతో టేస్టీగా ఉంటాయి!

"క్రిస్పీ సగ్గుబియ్యం వడలు" - ఈ పద్ధతిలో పొటాటో ఉడకబెట్టకుండా సింపుల్​గా ట్రై చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.