How to Make Aloo Vankaya Curry in Telugu : శుభకార్యాలు, వివాహ విందులో తప్పనిసరిగా కనిపించే కూరల్లో ఒకటి 'ఆలూ వంకాయ'. ఇది చాలా మంది ఫేవరెట్ కర్రీ కూడా. ఈ క్రమంలోనే చాలా మంది దీన్ని ఇళ్లల్లో ప్రిపేర్ చేసుకుంటుంటారు. కానీ, కొన్నిసార్లు సరైన టేస్ట్ రావట్లేదని ఫీల్ అవుతుంటారు. అలాంటి వారు ఒక్కసారి ఈ స్టైల్లో "ఆలూ వంకాయ కర్రీ" చేసుకొని చూడండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసుకున్నారంటే సాఫ్ట్‌గా, టేస్టీగా వస్తుంది. ఈవిధంగా ఆలూ కర్రీని చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పైగా దీని కోసం ఎక్కువ శ్రమించాల్సిన పనిలేదు. కుక్కర్లో నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి, ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారీ విధానంపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- పెద్ద సైజ్ బంగాళదుంప - ఒకటి
- వంకాయలు - పావుకిలో
- పచ్చిమిర్చి - ఐదారు
- ఉల్లిపాయ - ఒకటి
- మీడియం సైజ్ టమాటా - ఒకటి
- నూనె - రెండు టేబుల్‌స్పూన్లు
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- కారం - తగినంత
- ఉప్పు - రుచికి సరిపడా
- గరంమసాలా - అరటీస్పూన్
- కసూరి మేతి - ఒకటీస్పూన్
తెలుగు వారి ఆల్ టైమ్ ఫేవరెట్ "అల్లం చట్నీ" - ఇలా చేసుకున్నారంటే టిఫెన్ సెంటర్ టేస్ట్ పక్కా!

తయారీ విధానం :
- ఈ రెసిపీ కోసం ముందుగా పెద్ద సైజ్‌లో ఉన్న బంగాళదుంపను పొట్టు తీసుకొని, క్యూబ్స్ మాదిరిగా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్లు ఉన్న గిన్నెలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అలాగే, తాజా గుండ్రటి తెల్లని వంకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి తొడిమెతో సహా నిలువుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆపై కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నింటిని ఉప్పు నీళ్లు తీసుకున్న మరో గిన్నెలో వేసుకొని పక్కనుంచాలి.
- అదేవిధంగా, ఉల్లిపాయ, టమాటాను సన్నగా తరుక్కోవాలి. పచ్చిమిర్చిలను చీలికలుగా తరుక్కొని రెడీగా ఉంచుకోవాలి.

- ఇప్పుడు కర్రీ తయారీ కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె లైట్‌గా వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి. ఆపై కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు వేసుకొని లైట్‌గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఆనియన్స్ వేగాక పచ్చిమిర్చి చీలికలు, కచ్చాపచ్చాగా దంచుకున్న తాజా అల్లంవెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి.
- ఆపై కరివేపాకు, పసుపు వేసి కాసేపు వేయించాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూ ముక్కలు, వంకాయ ముక్కలు, టమటా ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్‌లో రెండు నిమిషాల పాటు కలుపుతూ బాగా ఫ్రై చేయాలి.
- ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు, కారం, గరంమసాలా, కసూరి మేతిని చేతితో నలిపి వేసుకొని లో ఫ్లేమ్‌లో మరో ఒకట్రెండు నిమిషాలు కలుపుతూ వేయించుకోవాలి. ఆపై కొత్తిమీర తరుగు వేసుకొని కలపాలి.
- అనంతరం కర్రీ కుక్ అవ్వడానికి రెండుమూడు టీస్పూన్ల వాటర్ వేసుకొని కలిపి, మూతపెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆవిధంగా ఉడికించుకున్నాక కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఆపై కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి దింపేసుకుంటే చాలు. అంతే, కమ్మటి వాసనతో నోరూరించే "ఆలూ వంకాయ కర్రీ" రెడీ అయిపోతుంది!

టిప్స్ :
- ఇక్కడ కర్రీని కుక్కర్లో చేయడం ద్వారా రెసిపీ సాఫ్ట్‌గా, టేస్టీగానూ వస్తుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే మామూలు గిన్నెలో కూడా దీన్ని రెడీ చేసుకోవచ్చు.
- ఆలూ, వంకాయ ముక్కలను ఉడికించే క్రమంలో ఎక్కువ నీరు పోయకుండా రెండుమూడు టీస్పూన్ల నీళ్లు పోసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది.
ఈ పద్ధతిలో "చింతచిగురు పప్పు" చేసుకోండి - కమ్మగా, భలే రుచికరంగా వస్తుంది!
పచ్చికారంతో ఘుమఘుమలాడే "ఎగ్ ఫ్రైడ్ రైస్" - పిల్లల లంచ్ బాక్స్‌లకు పర్ఫెక్ట్!