Mamidi Tandra : పుల్లటి మామిడి అంటేనే నోట్లో నీళ్లు ఊరతాయి. ఇంకా అలాంటి పుల్లటి మామిడి కాయతో ఫ్రూట్ జెల్లీ మామిడి తాండ్ర చేసుకుని తింటుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి! మామిడి పండ్లతో తాండ్ర తయారీ తెలిసిందే. ఇది తియ్యగా ఉంటుంది. మామిడి పండ్ల గుజ్జు తీసి చక్కెర కలిపి తయారు చేస్తుంటారు. కానీ పుల్లటి మామిడి తాండ్రలో కాస్త చిల్లీ ఫ్లేక్స్ కూడా కలిపి తయారు చేస్తే ఎంతో విభిన్నమైన రుచి దొరుకుతుంది. నోటికి ఏమీ తినబుద్దికానపుడు ఇలా పచ్చి మామిడి కాయ, కారంతో చేసుకునే తాండ్ర తింటే చాలు ఎంతో రుచిగా ఉంటుంది.
గుంటూరు స్టైల్ "దొండకాయ కారం" - ఇలా చేస్తే ఎంతో స్పైసీగా ముద్ద కూడా మిగల్చరు!

కావల్సిన పదార్థాలు
- మామిడి కాయలు - 4
- పంచదార - 250 గ్రాములు
- ఉప్పు - 1 టీ స్పూన్
- మిరియాల పొడి 1 టీ స్పూన్
- గ్రీన్ ఫుడ్ కలర్ - చిటికెడు
- చిల్లీ ఫ్లేక్స్ - 1 స్పూన్
- నెయ్యి - 2 స్పూన్లు
మామిడి తాండ్ర తయారీ విధానం
- పుల్లటి మామిడి కాయలు తెచ్చుకుని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. మామిడి కాయ ముక్కలను ఒక కడాయిలో వేసుకుని పావు లీటర్ నీళ్లు పోసుకుని బాగా ఉడికించుకోవాలి. ముక్కలు మాడిపోకుండా గుజ్జు మాదిరిగా మెత్తగా ఉడికించాలి.
- ఇపుడు ఉడికించుకున్న మామిడి కాయ ముక్కలను బాగా మాష్ చేసుకోవాలి. పెద్ద జల్లెడ తీసుకుని గుజ్జు వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత చిన్న జల్లెడతో వడకట్టడం వల్ల ముక్కలు లేకుండా కేవలం గుజ్జు మాత్రమే దిగుతుంది.
- మామిడి కాయ గుజ్జులోకి పావు కిలో పంచదార కలిపి పది నిమిషాలు గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. ఇలా గరిటెతో తిప్పుతూ ఉడికించడం వల్ల అడుగు పట్టకుండా ఉంటుంది. ఇపుడు ఉడికించుకున్న జెల్లీలోకి ఉప్పు, మిరియాల పొడి వేసుకుని కలుపుకోవాలి.
- పచ్చి మామిడి తాండ్రలో మిరియాల పొడి వేయడం వల్ల కారం కారంగా ఉంటుంది. ఇదే సమయంలో తాండ్ర ఉడుకుతున్నపుడు చిటికెడు గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటుంది.
- చివర్లో చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని దించుకుంటే సరిపోతుంది. చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్న తర్వాత ఎక్కువ సేపు ఉడికించకుండా కలుపుకొంటే సరిపోతుంది.
- ఇపుడు జెల్లీ కోసం ప్లేట్లో నెయ్యి రాసుకుని మామిడికాయ గుజ్జును వేసుకోవాలి. పల్చగా కావాలనుకుంటే తక్కువ గుజ్జు వేసుకోవాలి.
- మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంగా వేసుకుంటే తాండ్ర రుచి బాగుంటుంది.
- రెండు రోజుల పాటు ఎండలో ఆరబెట్టుకున్న తర్వాత ఏమైనా చెమ్మగా అనిపిస్తే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుంది.
- ఆ తర్వాత ప్లేట్ నుంచి తీసుకుని నచ్చిన షేప్‌లో కట్ చేసుకుని రోల్ చేసి పెట్టుకోవాలి.
- ఈ మామిడి తాండ్ర గాలి చొరబడని బాక్స్‌లో నిల్వ చేసుకుంటే దాదాపు ఆరు నెలల పాటు నిల్వ ఉంటుంది.
"వంకాయ మలాయి కుర్మా" ఇలా చేయండి! - బగారా రైస్, చపాతీ, పుల్కా ఏదైనా సరే మిగల్చరు!
సింపుల్ రెసిపీ "సేమియా కస్టర్డ్" - ఈ స్టెప్స్ ఫాలో అయితే పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు!