Sponge Dosa Recipe in Telugu : పిల్లలు పెద్దలు ఇలా అందరికీ మెత్తగా ఉండే దోసెలు చాలా ఇష్టం. చాలా మందికి సెట్ దోసె మాదిరిగా ఉండే వీటిని ఎలా చేస్తారో తెలియదు. అలాంటి వారు ఒక్కసారి ఇక్కడ చెప్పిన విధంగా దోసెలు ప్రిపేర్ చేసుకోండి. ఈ స్పాంజ్ దోసెల తయారీ కోసం చుక్క నూనె, పెరుగు, వంటసోడా, ఈనో వంటివి అవసరం లేదు. మరి ఈజీగా స్పాంజ్ దోసెలు ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

స్పాంజ్ దోసె తయారీకి కావాల్సిన పదార్థాలు :
- బియ్యం - ఒకటిన్నర కప్పు
- ఒక టేబుల్‌స్పూన్ - మెంతులు
- మరమరాలు - 3 కప్పులు
- ఉప్పు - రుచికి సరిపడా

తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా బియ్యం, మెంతులను ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా కడగాలి. అనంతరం నీళ్లు పోసి 5 గంటలపాటు నానబెట్టుకోవాలి.
- ఆపై ఒక మిక్సీ గిన్నెలో నానబెట్టిన బియ్యం వేసుకుని కొద్దికొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పిండిని గిన్నెలోకి తీసుకోవాలి.
- ఆపై మరో బౌల్లో మరమరాలను నీటిలో వేసుకుని కొద్దిసేపు నానబెట్టుకోండి. తర్వాత మరమరాలను చేతితో గట్టిగా పిండేసి ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. స్పాంజ్ దోసెలు పెరుగు, నూనె ఉపయోగించకున్నా మెత్తగా రావడానికి కారణం మరమరాలు.
- ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
- మరమరాల పేస్ట్‌ని ముందుగా గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండిలో వేసుకుని చేతితో బాగా కలపండి. ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి 8 గంటల పాటు పులియబెట్టాలి.
- దోసెలు వేసుకునే ముందు పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ స్పాంజ్ దోసెల కోసం పిండి కాస్త పల్చగానే ఉండాలి.
- ఇప్పుడ స్టవ్‌పై దోసె పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలి. అది కొద్దిగా వేడయ్యాక గరిటెతో పిండిని తీసుకొని మందపాటి దోసెలా వేసుకోవాలి.

- సెట్ దోసె మాదిరిగా వేసుకున్నాక దానిపై మూతపెట్టి కాసేపు ఉడకనివ్వాలి. తర్వాత దోసెను గరిటెతో మరోవైపు తిప్పి దోరగా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలి.
- అంతే ఇలా మిగిలిన పిండితో స్పాంజ్ దోసెలు చేసుకుంటే సరిపోతుంది. ఎంతో మెత్తని దోసెలు మీ ముందుంటాయి.
- స్పాంజ్ దోసెలు కొబ్బరి చట్నీ/పల్లీల చట్నీ, టమోటా చట్నీతో కలిపి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటాయి.
- స్పాంజ్ దోసె తయారీ విధానం నచ్చితే దోసెలను ఇలా ఇంట్లో ట్రై చేయండి.
"టాటూ వేసుకుంటే రక్తదానం చేయకూడదా? - షుగర్ పేషెంట్లు రక్తం ఇవ్వొచ్చా?!"
"ఉడుపి స్టైల్ పాయసం" - టేస్ట్ సీక్రెట్ ఏమిటో తెలుసా? - మీరూ ఇలా ట్రై చేయండి!
వేసవి వేడిని తరిమేసే "పుదీనా జల్ జీరా డ్రింక్" - అతి తక్కువ ఖర్చుతో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు!