ETV Bharat / offbeat

కమ్మటి "పచ్చిమిర్చి మామిడికాయ రోటి పచ్చడి" - వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది!

సమ్మర్ స్పెషల్ పచ్చడి - పుల్లగా, కారంగా నోటికి కొత్త రుచి ఇస్తుంది

mango_pickle_recipe_in_telugu
mango_pickle_recipe_in_telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 6, 2025 at 2:48 PM IST

2 Min Read
Choose ETV Bharat

Mango Pickle : పచ్చి మామిడితో ఎన్నో రకాల వంటకాలు చేసుకోవచ్చు. కాస్త పచ్చి మిర్చి కారం వేసుకుని పుల్లగా, కారంగా తింటుంటే నోటికి కమ్మగా ఉంటుంది. మిక్సీలో రుబ్బుకోవడం, నూనెలో వేయించడం కంటే ఇలా రోటి పచ్చడి పెట్టుకుని చూడండి కొత్త రుచిని ఆస్వాదిస్తారు. ఈ చట్నీ ఉదయం టిఫిన్లలోకి, వేడి వేడి అన్నంలోకి తింటుంటే కాస్త ఎక్కువే లాగించేస్తారు.

పక్కా కొలతలతో కిలో "మామిడికాయ ఆవ పచ్చడి" - ఎన్ని రోజులైనా ముక్క ఫ్రెష్, బూజు పట్టదు!

mango_pickle_recipe_in_telugu
mango_pickle_recipe_in_telugu (ETV Bharat)

కావాల్సిన పదార్థాలు

  • నూనె - 4 టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిర్చి - 100 గ్రాములు
  • వెల్లుల్లి - 25
  • ఉప్పు - రుచికి సరిపడా
  • మామిడికాయ ముక్కలు - 100 గ్రాములు
  • ఉల్లిగడ్డ - 1
  • వేలు శనగలు - 2 టేబుల్ స్పూన్లు
mango_pickle_recipe_in_telugu
mango_pickle_recipe_in_telugu (ETV Bharat)

పోపు కోసం

  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • ఆవాలు - 1 స్పూన్
  • ఎండు మిర్చి - 1
  • శనగ పప్పు - 1 టేబుల్ స్పూన్
  • మినప గుండ్లు - 1 స్పూన్
  • జీలకర్ర - 1 స్పూన్
  • హింగ్ - చిటికెడు
  • కరివేపాకు - 1 రెమ్మ
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
mango_pickle_recipe_in_telugu
mango_pickle_recipe_in_telugu (ETV Bharat)

తయారీ విధానం :

  • ముందుగా పొయ్యిపై ప్యాన్ పెట్టుకుని నూనె పోసుకుని వేడి చేసుకోవాలి. అందులోనే ఘాటు కాస్త తక్కువగా ఉన్న పచ్చిమిరపకాయలు వేసుకుని వేపాలి. మిర్చిపైన మగ్గిన మచ్చలు వచ్చే వరక వేయించాలి. కారం తక్కువగా ఉంటేనే మంచిది. రోట్లో 20 నుంచి 25 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. రోలు లేని వాళ్లు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. కానీ, రోట్లో దంచుకున్న పచ్చళ్లు రుచిగా ఉంటాయని గుర్తుంచుకోండి.
  • ఇపుడు చెక్కు తీసుకున్న పుల్లటి పచ్చి మామిడి కాయ ముక్కలు వేసి మరోసారి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. చివరగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని దంచుకోవాలి. ఈ సమయంలో వేయించిన వేరుశనగ గుండ్లు కూడా వేసుకుని దంచుకుంటే రుచి అద్దిరిపోతుంది.
mango_pickle_recipe_in_telugu
mango_pickle_recipe_in_telugu (ETV Bharat)
  • ఇపుడు కడాయిలో నూనె పోసుకుని ఆవాలు చిటపటలాడించి ఎండుమిర్చి, పచ్చిశనగ పప్పు మినప్పప్పు వేసుకోవాలి. వాటిని సన్నటి మంటపై ఎర్రగా వేయించి కాస్త ఇంగువ, కరివేపాకు వేసుకుని మగ్గించి ముందుగా రెడీ చేసుకున్న పచ్చడి వేసుకుని కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు కలుపుతూ మగ్గించుకుని కొద్దిగా బెల్లం, కొత్తమీర తరుగు వేసుకుంటే చాలు! ఘుమఘుమలాడే పచ్చడి రెడీ అయినట్లే. ఇది మూడు రోజుల పాటు నిల్వ ఉంటుంది.

నోరూరించే "పచ్చిమామిడి కొబ్బరి చట్నీ" - ఇడ్లీ, దోసెల్లోకి రుచి బాగుంటుంది

"పచ్చిమామిడి రోటి పచ్చడి" - ఆవకాయ పచ్చడి కంటే రుచి అద్భుతంగా ఉంటుంది!