ETV Bharat / offbeat

రవ్వ, బంగాళాదుంపతో "అద్దిరిపోయే బన్ దోసెలు" - ఇలా చేయండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు! - INSTANT BUN DOSA

అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే కమ్మటి బన్​ దోసెలు - ఇలా చేయండి, ఏ చట్నీ లేకపోయినా ఎంతో బాగుంటాయి!

Instant Bun Dosa in Telugu
Instant Bun Dosa in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 26, 2025 at 7:19 PM IST

2 Min Read

Instant Bun Dosa in Telugu : ఇంట్లో టిఫిన్ ప్రిపేర్ చేయాలంటే ఫ్రిడ్జ్​లో ఇడ్లీ లేదా దోసె పిండి తప్పకుండా ఉండాల్సిందే! అప్పుడే ఇంట్లో వాళ్లకోసం వేడివేడిగా బ్రేక్​ఫాస్ట్​ ప్రిపేర్​ చేయచ్చు. ఫ్రిడ్జ్​లో ఏ పిండి లేకపోతే చాలా మంది రవ్వతో ఉప్మా చేసేస్తుంటారు. ఎప్పుడూ ఉప్మానే కాకుండా ఓసారి ఇలా బన్ దోసెలు ప్రిపేర్ చేయండి. ఈ దోసెలు చేయడం కోసం పొటాటో, క్యారెట్​ తురుము వంటి పదార్థాలు ఉంటే సరిపోతాయి. మరి ఈజీగా బన్ దోసెలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Rava
Rava (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • బొంబాయి రవ్వ - కప్పు
  • బంగాళాదుంప - 1
  • సన్నటి ఉల్లిపాయ తరుగు - అరకప్పు
  • క్యారెట్​ తరుగు - పావు కప్పు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • ఉప్పు రుచికి సరిపడా
  • కరివేపాకు - 2
  • పచ్చిమిర్చి - 3
  • బేకింగ్​ పౌడర్​ లేదా ఈనో - అరటీస్పూన్​

చల్లచల్లని "బాదాం షేక్" - వ్యాపారులు అమ్మే బాదం పాల రెసిపీ సీక్రెట్ ఇదే!

Instant Bun Dosa
Instant Bun Dosa (ETV Bharat)

తయారీ విధానం

  • ఇందుకోసం ముందుగా పొటాటో పైన చెక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
  • అలాగే రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి.
  • ఒక మిక్సీ గిన్నెలోకి కప్పు బొంబాయి రవ్వ వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఆపై ఇందులో కట్ చేసి పొటాటో ముక్కలు, టీ గ్లాసు వాటర్​ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు పొటాటోకి బదులుగా పెరుగు కూడా ఉపయోగించవచ్చు.
  • ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్​ బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, క్యారెట్​ తురుము వేసి బాగా కలపండి.
  • అనంతరం అరటీస్పూన్​ బేకింగ్​ పౌడర్​ లేదా ఈనో, కొన్ని వాటర్​ పోసి మిక్స్​ చేయండి.
  • ఈ బన్​ దోసెలు పిండి కలిపిన తర్వాత అప్పటికప్పుడు చేసుకోవచ్చు.
  • ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 టేబుల్​స్పూన్లు ఆయిల్ వేయండి.
Bun Dosa
Bun Dosa (ETV Bharat)
  • నూనె వేడైన తర్వాత మూడు గరిటెలు పిండి వేసి స్ప్రెడ్​ చేయండి. పాన్​పై మూత పెట్టి మీడియం ఫ్లేమ్​లో రెండు నిమిషాలు ఉడికించుకోండి. ఆపై బన్ దోసె మరోవైపు తిప్పి దోరగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి.
  • మిగిలిన పిండితో ఇలా బన్​ దోసెలు ప్రిపేర్​ చేసుకోండి.
  • అంతే ఇలా సింపుల్​గా ప్రిపేర్​ చేసుకుంటే కమ్మటి బన్​ దోసెలు మీ ముందుంటాయి.
  • ఈ దోసెలు ఏ చట్నీ లేకపోయినా ఎంతో రుచిగా ఉంటాయి. ఈ బ్రేక్​ఫాస్ట్​ రెసిపీ నచ్చితే ఓసారి తప్పక ట్రై చేయండి.

రోజూ ఈ చట్నీల గొడవెందుకు? - ఒక్కసారి ఇలా "పెరుగు పులస" చేసి పెట్టుకుంటే సరిపోదూ!

హైదరాబాద్​ స్పెషల్​ "గ్రీన్ చికెన్ ఫ్రై" - పుదీనా, లైట్​ మసాలా ఫ్లేవర్స్​తో టేస్ట్ అద్భుతంగా ఉంటుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.