ETV Bharat / offbeat

"క్రిస్పీ సగ్గుబియ్యం వడలు" - ఈ పద్ధతిలో పొటాటో ఉడకబెట్టకుండా సింపుల్​గా ట్రై చేయండి! - SABUDANA VADA

రుచికరమైన సగ్గుబియ్యం వడలు - ఇలా చేస్తే ఒక్కటి కూడా విడిచిపెట్టరు!

Sabudana Vada Recipe In Telugu
Sabudana Vada Recipe In Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 12, 2025 at 3:35 PM IST

2 Min Read

Sabudana Vada Recipe In Telugu : ఎక్కువ మంది సగ్గుబియ్యంతో రుచికరమైన పాయసం, వడలు చేస్తుంటారు. ఈ వడలు చేయడం కోసం కొందరు పొటాటో ఉడకబెడుతుంటారు. అయితే, ఇక్కడ చెప్పిన విధంగా చేస్తే బంగాళదుంపలు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఈ సగ్గుబియ్యం వడలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ వడలను బ్రేక్​ఫాస్ట్​లోకి, ఈవెనింగ్​ స్నాక్స్​లోకి కూడా ప్రిపేర్​ చేసుకోవచ్చు. మరి ఈజీగా సగ్గుబియ్యం వడలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Sabudana
Sabudana (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • సగ్గుబియ్యం - కప్పు
  • నీళ్లు - కప్పు
  • బంగాళదుంప - 1
  • పల్లీలు - అరకప్పు
  • చిన్న అల్లం ముక్క
  • పచ్చిమిర్చి - మూడు
  • కొత్తిమీర - ఒక కట్ట
  • నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా
  • రుచికి సరిపడా ఉప్పు, కారం
  • అరటీస్పూన్ జీలకర్ర
  • ఉల్లిపాయ ముక్కలు - పావు కప్పు
  • 4 టేబుల్​స్పూన్లు బియ్యం పిండి
Coriander
Coriander (Getty Images)

నోరూరించే "చింత చిగురు ఎండు నెత్తళ్ల కర్రీ" - ఇలా చేస్తే ముద్దకూడా మిగల్చరు!

తయారీ విధానం:

  • మార్నింగ్​ బ్రేక్​ఫాస్ట్​లోకి సగ్గుబియ్యం వడలు ప్రిపేర్​ చేయడం కోసం ఒక బౌల్లోకి కప్పు సగ్గుబియ్యం తీసుకోండి.
  • వీటిని ఒకసారి కడిగి కప్పు నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోండి. ఇలా కప్పు సగ్గుబియ్యం కోసం కప్పు నీళ్లు ఉపయోగించడం వల్ల పొడిపొడిగా ఉంటాయి.
  • అలాగే బంగాళదుంప పైన చెక్కు తీసేసి తురుముకోవాలి. ఈ పొటాటో తురుము గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు స్టవ్​పై కడాయి పెట్టి అరకప్పు పల్లీలు వేయండి. మంట మీడియం ఫ్లేమ్​లో అడ్జస్ట్​ పెట్టి పల్లీలు దోరగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి.
  • ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి చిన్న అల్లం ముక్క, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆపై ఇందులోకి వేయించుకున్న పల్లీలు వేసి కాస్త బరకగా గ్రైండ్​ చేసుకోండి.
Sabudana Vada
Sabudana Vada (ETV Bharat)
  • ఆ విధంగా గ్రైండ్​ చేసుకున్న పల్లీ పొడిని నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో వేసుకోండి. ఇందులోనే పొటాటో తురుము, రుచికి సరిపడా ఉప్పు, కారం, అరటీస్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, 4 టేబుల్​స్పూన్లు బియ్యం పిండి వేసి బాగా కలుపుకోండి.
  • ఈ సగ్గుబియ్యం వడల కోసం పిండి కాస్త గట్టిగానే ఉండాలి.
  • ఇప్పుడు వడలు డీప్​ ఫ్రై చేయడం కోసం కడాయి పెట్టి సరిపడా ఆయిల్​ పోసి వేడి చేయండి.
  • ఆయిల్ హీటైన తర్వాత స్టవ్​ మీడయం ఫ్లేమ్​లో అడ్జస్ట్​ చేయండి. ఇప్పుడు కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకొని వడలు రెడీ చేసుకొని ఆయిల్లో వేయండి.
  • కాసేపటి తర్వాత నిదానంగా గరిటెతో తిప్పుతూ వడలు ఫ్రై చేసుకోండి.
  • సగ్గుబియ్యం వడలు క్రిస్పీగా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. మిగిలిన పిండితో ఇలానే వడలు చేసుకుంటే సరి!

అంతే ఇలా సింపుల్​గా ప్రిపేర్​ చేసుకుంటే ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం వడలు మీ ముందుంటాయి. సాయంత్రం టైమ్​లో సగ్గుబియ్యం వడలు బెస్ట్​ స్నాక్​. ఈ వడల తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి.

పెసరపప్పు, కొబ్బరితో "హెల్దీ బర్ఫీ" - ఇలా చేస్తే కమ్మగా, ఐస్​క్రీమ్​లా కరిగిపోతుంది!

ఘుమఘుమలాడే "మటన్ గ్రేవీ కర్రీ" - ఇలా చేస్తే ముక్క జ్యూసీగా, త్వరగా ఉడికిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.