Rava Laddu Recipe in Telugu : పిల్లలు, పెద్దలు రవ్వ లడ్డూలు ఇష్టంగా తింటారు. కొందరు వీటిని ఇంట్లో ట్రై చేస్తే లడ్డూ ముద్ద కట్టకుండా పిండిలా అవుతుంది. అలాంటివారు ఈ ప్రాసెస్‌లో "రవ్వ లడ్డూలు" ట్రై చేయండి. ఇలా చేస్తే రవ్వ లడ్డూలు చక్కగా వస్తాయి. అలాగే సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ లడ్డూలు నెల రోజులపాటు గట్టి పడకుండా మెత్తగా ఉంటాయి! మరి సింపుల్‌గా రవ్వ లడ్డూలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :
- పంచదార - రుచికి సరిపడా
- జీడిపప్పు, బాదం, కిస్మిస్ - పావు కప్పు
- బొంబాయి రవ్వ - 2 కప్పులు (300 గ్రాములు)
- కాచి చల్లార్చిన పాలు - కప్పు
- యాలకులు- 5
- నెయ్యి - సరిపడా

"పాలక్ పుల్కా" ఇలా చేసి చూడండి - గంటల కొద్దీ మృదువుగా ఉంటుంది!
తయారీ విధానం :
- ముందుగా స్టవ్‌పై కడాయి పెట్టుకొని 2 టేబుల్‌స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అది కరిగి వేడెక్కాక జీడిపప్పు, బాదం, కిస్మిస్ను వేసుకొని లో ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అనంతరం వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్‌స్పూన్లు నెయ్యి వేసి వేడి చేయండి. ఆపై బొంబాయి రవ్వ వేసుకొని లో ఫ్లేమ్ మీద మధ్యమధ్యలో కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్లోకి మారి, మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేయాలి.

- రవ్వ చక్కగా వేగిన తర్వాత కాచి చల్లార్చిన పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి.
- ఆపై లో ఫ్లేమ్‌లో రవ్వని మరో 5 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. రవ్వను మీరు ఎంత బాగా వేయించుకుంటే రవ్వ లడ్డూ టేస్ట్ అంత బాగుంటుందని గుర్తుంచుకోండి.
- ఆ విధంగా రవ్వని వేయించుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులోనే వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలపండి.
- ఒక మిక్సీ గిన్నెలో అరకప్పు చక్కెర, యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ చక్కెర పొడిని రవ్వ లడ్డూ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోండి. ఆపై నాలుగు టేబుల్‌స్పూన్లు వేడివేడి నెయ్యి వేసి బాగా కలపండి.
- ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేసి ప్లేట్లో పక్కన పెట్టుకోండి.
- అంతే ఇలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రవ్వ లడ్డూలు రెడీ! ఈ రవ్వ లడ్డూ తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.
"అరిసెలు" అప్పటికప్పుడు ఇలా చేసుకోండి - బియ్యం నానబెట్టడం, పాకం పట్టాల్సిన పనిలేదు!
"కమ్మటి చింతాకు కారంపొడి" - ఇలా చేస్తే నెల రోజులపాటు నిల్వ! వేడివేడి అన్నంలోకి అద్ధిరిపోతుంది!