రాగి పిండితో ఇడ్లీ, దోసెలే కాదు - "కమ్మటి గుంత పొంగనాలు" కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చు!
టేస్టీ రాగి గుంత పొంగనాలు - ఇలా చేయండి పల్లీ, టమోటా చట్నీతో రుచి అద్భుతం!

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 6, 2025 at 2:59 PM IST
Ragi Pindi Ponganalu in Telugu : రాగి పిండితో హెల్దీగా ఇడ్లీలు, దోసెలు, రాగి జావ చేస్తుంటారు. అయితే, మీరు ఎప్పుడైనా రాగి పిండితో కమ్మటి గుంత పొంగనాలు ప్రిపేర్ చేశారా? ఇక్కడ చెప్పిన విధంగా ప్రిపేర్ చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి. ఇలా రాగి గుంత పొంగనాలు టిఫిన్‌లోకి చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. పైగా వీటిని చేయడానికి ఎక్కువ కష్టపడాల్సిన పనిలేదు. మరి ఈజీగా రాగి పిండి గుంత పొంగనాలు చేయడానికి కావాల్సిన పదార్థాలు? తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు
- పచ్చిమిర్చి - 2
- అరకప్పు - బొంబాయి రవ్వ
- అరకప్పు - రాగి పిండి
- పావు కప్పు - పెరుగు
- క్యారెట్ - 1
- ఉల్లిపాయ - 1
- టమోటా - 1
- కరివేపాకు - 1
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- టేబుల్‌స్పూన్ - అల్లం ముక్కలు
- రుచికి సరిపడా - ఉప్పు

"ఉసిరికాయ పచ్చిమిర్చి నిల్వ పచ్చడి" - ఎవ్వరైనా సరే ఈజీగా పెట్టుకోవచ్చు!
తయారీ విధానం
- ముందుగా స్టవ్‌పై పాన్ పెట్టి అరకప్పు బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్‌లో రెండు నిమిషాలు ఫ్రై చేయండి.
- రవ్వ మిశ్రమం చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులో అరకప్పు రాగి పిండి, పావు కప్పు పెరుగు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, ఉల్లిపాయ, టమోటా ముక్కలు, కొత్తిమీర తరుగు, కరివేపాకు, అరటీస్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, టేబుల్‌స్పూన్ అల్లం ముక్కలు వేసి బాగా కలపండి.
- ఆపై సరిపడా నీళ్లు కొద్దికొద్దిగా పోసుకుంటూ ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి.
- ఆ విధంగా కలుపుకున్న తర్వాత పిండిని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ వెలిగించి గుంత పొంగనాల పెనం పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి. అనంతరం అన్ని గుంతలలో కొద్దికొద్దిగా పిండి వేసి లో ఫ్లేమ్‌లో మూత పెట్టి 5 నిమిషాలు కాల్చుకోవాలి.

- ఒకవైపు రాగి గుంత పొంగనాలు చక్కగా కాలిన తర్వాత తిరగేసి మరోవైపు కాలనిచ్చి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఇలా సులభంగా పిండి మొత్తాన్ని గుంత పొంగనాలుగా వేసుకోవాలి.
- వేడివేడిగా ఈ రాగి పొంగనాలను టమోటా, పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది.
- ఈ ఇన్స్టంట్ రాగి పొంగనాల తయారీ విధానం నచ్చితే మీరు ఓ సారి ఇంట్లో తప్పక ప్రయత్నించండి!
గోధుమరవ్వతో "కమ్మటి అప్పాలు" - స్వీట్ తినాలనిపిస్తే అప్పటికపుడు చేసుకోవచ్చు!
ఎండలకు ఏమీ రుచించట్లేదా? - ఇలా "చెన్నై స్టైల్ సాంబార్" చేసుకోండి

