ETV Bharat / offbeat

"ప్యూర్ వెజ్ ఆమ్లెట్" - రుచి చూస్తే ఎగ్​ ఆమ్లెట్ మర్చిపోతారు! అంత బాగుంటుంది! - PUREVEG BREAD OMELETTE

రుచికరమైన ప్యూర్ వెజ్ ఆమ్లెట్ -సింపుల్​గా ఇలా ప్రిపేర్​ చేసుకోండి!

PureVeg Bread Omelette in Telugu
PureVeg Bread Omelette in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 8, 2025 at 12:16 PM IST

2 Min Read

PureVeg Bread Omelette in Telugu : గుడ్డు లేకుండా ఆమ్లెట్. వినడానికి కాస్త వింతగా అనిపించినా ఇక్కడ చెప్పిన విధంగా చేస్తే నిజంగానే సాధ్యమవుతుంది. గుడ్డు తినని వారికి, అలాగే శాకాహారులకు ఈ రెసిపీ బెస్ట్​ ఆప్షన్​. ఈ ఆమ్లెట్​ బ్రేక్​ఫాస్ట్​లో లేదా ఈవెనింగ్​ టైమ్​లో స్నాక్స్​గా తీసుకోవచ్చు. మరి సింపుల్​గా ఈ ప్యూర్​ వెజ్​ బ్రెడ్​ ఆమ్లెట్​ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Tomato
Tomato (Getty Images)

కావాల్సిన పదార్థాలు :

  • బియ్యపిండి - అర కప్పు
  • శనగపిండి - ఒకటిన్నర కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - పావు టీస్పూన్
  • మిరియాల పొడి - పావు టీస్పూన్
  • చాట్ మసాలా - అర టీస్పూన్
  • టమోటా తరుగు - 3 టేబుల్​స్పూన్లు
  • ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్​స్పూన్లు
  • పచ్చిమిర్చి తరుగు - 1 టేబుల్​స్పూన్
  • కొత్తిమీర తరుగు - 3 టేబుల్​స్పూన్లు
  • బేకింగ్ పౌడర్ - 1 టేబుల్​స్పూన్
  • నెయ్యి/నూనె - తగినంత
  • బ్రెడ్ స్లైసెస్ - 4 లేదా 5
Gram Flour
Gram Flour (Getty Images)

"ఇన్​స్టెంట్ వెజ్ పొంగనాలు" - పిండి నానబెట్టే పనిలేకుండా అప్పటికప్పుడు చేసుకోవచ్చు!

తయారీ విధానం :

  • ముందుగా ఒక మిక్సింగ్​ బౌల్​లో శనగపిండి, బియ్యపిండి, చాట్ మసాలా తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, పసుపు, బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి.
Bread
Bread (Getty Images)
  • తర్వాత ఆ మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసుకుంటూ 3-4 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి.
  • ఆవిధంగా మిక్స్ చేసుకున్నాక అందులో గింజలు తొలగించి తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసుకొని మరోసారి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
  • తర్వాత ఆ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్​పై పాన్ పెట్టుకొని నెయ్యి లేదా నూనె వేసుకోవాలి. అది కరిగాక దానిపై ఒక శాండ్​విచ్ బ్రెడ్ స్లైస్ ఉంచి దోరగా కాల్చుకోవాలి. తర్వాత రెండోవైపు కూడా బ్రెడ్​పై కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసుకొని క్రిస్పీగా కాల్చుకోవాలి. ఇదే మాదిరిగా మిగతా బ్రెడ్ స్లైస్​లను కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మరోసారి స్టవ్​పై పాన్ పెట్టుకొని ఒక టీస్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆపై ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొద్దిగా పోసుకుని పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ మరీ పల్చగా స్ప్రెడ్ చేయకుండా కాస్త మందంగానే ఉండేలా చూసుకోవాలి.
  • అనంతరం అంచుల వెంట అక్కడక్కడ కొద్దిగా నెయ్యి వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి నిదానంగా రోస్ట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు పిండి మధ్యలో కాస్త తడిగా ఉన్నప్పుడు ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న ఒక బ్రెడ్ స్లైస్​ను​ ఉంచి అంచులను నాలుగు పక్కల లోపలికి ఫోల్డ్​ చేసుకోవాలి. ఆపై రెండువైపులా కాస్త నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి.
  • ఇదే విధంగా మిగతా పిండి, బ్రెడ్ స్లైస్​లతో ఆమ్లెట్స్​ ప్రిపేర్​ చేసుకుంటే సరి!
  • అంతే ఇలా ఈజీగా రెడీ చేసుకుంటే ప్యూర్ వెజ్​ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ.

పొడవు వంకాయలతో "నోరూరించే ఉల్లికారం" - అన్నం తింటుంటే మైమరచిపోతారంతే!

ఘుమఘుమలాడే "మామిడి అల్లం చారు" - ఇలా చేసుకుంటే రుచి, వాసన తగ్గేదేలే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.