Pulla Ppma Pulihora Upma : పండుగ వచ్చిందంటే చాలు! తెలుగు ఇళ్లలో పులిహోర కచ్చితంగా ఉంటుంది. దేవుళ్లకు పాయసంతో పాటు పులిహోర కూడా కలిపి పెట్టడం మన సాంప్రదాయం అయితే, ఎప్పుడూ పులిహోర మాత్రమే కాకుండా అదే స్టైల్లో కొత్తగా చేసి పెట్టి చూడండి ఎంతో బాగుంటుంది. పులిహోర సరిగా కలపడం రాకపోయినా సరే! ఇలా ఉప్మా స్టైల్లో పులిహోర చేస్తే కొత్త రుచిని ఆస్వాదించవచ్చు. దీనిని పుల్ల ఉప్మా లేదా పులి ఉప్మా అని కూడా అంటారు. ఇంకెందుకు ఆలస్యం పుల్ల ఉప్మా చేసేయండిలా!
పాలు, పంచదార లేకుండా స్వీట్ - ఇంట్లో ఉండే వాటితో ఇలా చేస్తే నోట్లో వెన్నలా కరిగిపోతుంది!
కావల్సిన పదార్థాలు
- బియ్యం రవ్వ - 1 కప్పు
- నూనె - 3 టేబుల్ స్పూన్లు
- వేరుశనగలు -3 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - 1 టీ స్పూన్
- మినప్పపు - టేబుల్ స్పూన్
- ఎండు మిర్చి - 2
- టీ స్పూన్ - జీలకర్ర
- అర టీ స్పూన్ - మిరియాల పొడి
- చింతపండు - నిమ్మకాయ సైజు
- నీళ్లు - 3 కప్పులు
- పసుపు - అర టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- కరివేపాకు - 1 రెమ్మ
తయారీ విధానం
- ముందుగా ఒక కడాయి పెట్టుకుని బియ్యం రవ్వను లో ఫ్లేమ్‌లో కలుపుతూ వేయించాలి. ఇలా వేయించడం వల్ల తడిదనం పోతుంది. రవ్వ పొడి పొడిగా అయ్యే వరకు వేయించుకుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఇపుడు అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పు వేసుకుని అవి సగం వేగగానే 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడించాలి. ఇపుడు టేబుల్ స్పూన్ మినప్పపు, టేబుల్ స్పూన్ పచ్చి శనగ పప్పు వేసుకుని ఎర్రగా వేయించాలి. ఆ తర్వాత ఎండు మిర్చి, జీలకర్ర, మిరియాల పొడి వేసుకుని వేపుకోవాలి.
- ఇపుడు నిమ్మకాయ సైజు చింతపండును నానబెట్టుకుని గుజ్జు తీసుకుని 3 కప్పుల నీళ్లు పోసుకుని రసం తీసుకోవాలి. 1 కప్పు బియ్యం రవ్వకు 3 కప్పుల చింతపండు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసి కలిపిన తర్వాత అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అన్నీ కలిపిన తర్వాత మంట హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా మరిగించాలి.
- పులుసు ఎసరు బాగా మరుగుతున్నపుడు 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇలా ఎసరు మరుగుతున్నపుడే వేసుకోవడం వల్ల మంచి అరోమా వస్తుంది. మీరు వద్దనుకుంటే తాలింపులోనూ వేసుకోవచ్చు. ఇపుడు మరుగుతున్న ఎసట్లో బియ్యం రవ్వ పోసుకుని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉడికించడం వల్ల రవ్వ బాగా ఉడుకుతుంది. ఈ రవ్వ పులిహోర మాదిరిగా ఉప్మా రుచిలో ఎంతో బాగుంటుంది.
బర్డ్ ఫ్లూ భయంతో "చికెన్ కర్రీ" మిస్ అవుతున్నారా? " - ఇలా చేస్తే రుచి అచ్చం కోడికూరలానే ఉంటుంది!
నోరూరించే "వంకాయ పచ్చి కారం" - వేడివేడి అన్నం ముందుంటే ఇక ఆగలేరు!