Pulihora Recipe in Telugu : పులిహోర కలపడం కూడా ఒక కళ. అన్ని పదార్థాలు వేసినా మాకు పులిహోర టేస్ట్ రావడం లేదంటు చాలా మంది వాపోతుంటారు. కానీ, ఏ పదార్థాన్ని ఎలా కలపాలో ఓ లెక్కుంది. కొంతమంది పులిహోర కలిపితే అక్కడక్కడా అన్నం తెల్లగా ఉంటుంది. కానీ, ఇలా పక్కా కొలతలతో, ఇదే పద్ధతిలో పులిహోర కలిపి చూడండి. మీరు ఎప్పడూ చూడని టేస్ట్ వస్తుంది. అంతే కాదు ఈ కొలతలతో మీరు ఎన్ని కిలోలైనా ఈజీగా చేసుకోవచ్చు. ఉప్పు, పులుపు అన్నీ సరిపోయేలా ఇలా పులిహోర చేసేయండి.
ఇలా చేస్తే జొన్న రొట్టె కూడా ఉ"ప్పొంగుతుంది" - రొట్టె చేయడం రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు!

కావాల్సిన పదార్థాలు :
- బియ్యం - కప్పు
- అర టీ స్పూన్ - ఉప్పు
- పావు టీ స్పూన్ - పసుపు
- 2 టీ స్పూన్లు - నూనె
- చింతపండు - 50 గ్రాములు

పొడి కోసం :
- అర టీ స్పూన్ - మెంతులు
- 1 టీ స్పూన్ - మిరియాలు
- అర టీ స్పూన్ - జీలకర్ర
- 1.5 టీ స్పూన్ - ధనియాలు
- 1.5 టీ స్పూన్ - నువ్వులు
చింత పండు గుజ్జులోకి :
- పచ్చి మిర్చి - 8
- అర టీ స్పూన్ - పసుపు
- 2.5 టీ స్పూన్ల - ఉప్పు
- కరివేపాకు - 1 రెమ్మ
- టేబుల్ స్పూన్ - నూనె
పోపు కోసం :
- 4 టేబుల్ స్పూన్ల - నూనె
- 3 టేబుల్ స్పూన్లు - పల్లీలు
- 1 టేబుల్ స్పూన్ - పచ్చిశనగ పప్పు
- 1 టేబుల్ స్పూన్ - మినప్పప్పు
- 1 టేబుల్ స్పూన్ - ఆవాలు
- మిరియాలు - 1 స్పూన్
- ఎండు మిర్చి 8
- ఇంగువ - అర టీ స్పూన్
- కరివేపాకు- 1 రెమ్మ

తయారీ విధానం :
- పులిహోర కోసం ముందుగా అన్నం పొడి పొడిగా ఉడికించుకోవాలి. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని కప్పు బియ్యం రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి 3 కప్పుల నీళ్లు, ఉప్పు, పసుపు, నూనె వేసుకుని మూత పెట్టేయాలి. హై ఫ్లేమ్‌లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి ప్రెజర్ పోయాక మూత తీసి అన్నం వెడల్పాటి గిన్నె లేదా పరిశుభ్రమైన క్లాత్ పై వేసుకుని చల్లార్చుకోవాలి.

- ఇపుడు 50 గ్రాముల చింతపండు బాగా కడిగి మునిగే వరకు నీళ్లు పోసి గిన్నెలో పొయ్యి మీద పెట్టుకుని నీళ్లు మరుగుతున్నపుడు స్టవ్ ఆర్పేసి పక్కకు పెట్టుకోవాలి.

- పొడి కోసం ప్యాన్ లోకి మెంతులు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు ఒకదాని తర్వాత మరొకటి వేసుకుని సన్నటి మంటపై దోరగా వేయించాలి. చివరగా నువ్వులు వేసుకుని చిటపటలాడే వరకు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇపుడు ఉడికించిన చింతపండునే మ్యాష్ చేస్తూ చిక్కని గుజ్జు తీసుకోవాలి. మీకు ఇబ్బందిగా ఉంటే చింతపండు నీళ్లు లేకుండా మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత మిగిలిన నీళ్లు పోసి ఫిల్టర్ చేసి తీసుకోవాలి. అలా చేయడం వల్ల గుజ్జు చిక్కగా వస్తుంది. ఇపుడు చింతపండు గుజ్జులో చీల్చుకున్న పచ్చి మిర్చి వేసుకోవాలి. పసుపు, ఉప్పు, కరివేపాకు, టేబుల్ స్పూన్ నూనె వేసుకుని కలిపి పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. నాలుగైదు నిమిషాల తర్వాత నురగ రాగానే పొయ్యి మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి.

- ఇపుడు కడాయిలోకి పల్లీ నూనె లేదా నువ్వుల నూనెలో పల్లీలు దోరగా వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టి పచ్చిశనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, మిరియాలు, ఎండు మిర్చి వేసి వేయించుకోవాలి. చివరగా ఇంగువ వేసి కరివేపాకు క్రిస్పీగా వేయించాలి.

- ఇపుడు అన్నం, పులిహోర పొడి, చింతపండు గుజ్జు, పోపు అన్నీ రెడీ అయిపోయాక ఒక్కొక్కటి వేస్తూ కలుపుకోవాలి. ముందుగా ఇపుడు చల్లార్చుకున్న అన్నంలోకి గ్రైండ్ చేసిన పొడి వేసి కలపాలి. గరిటెతో కాకుండా చేతితో కలిపితే బాగుంటుంది. ఇపుడు చింతపండు గుజ్జు బాగా కలిపి చివరగా పోపు దినుసులు కలుపుకుంటే పులిహోర రెడీ అయినట్లే!

"బలమైన పోషకాహారం" - మీ పిల్లలకు వారంలో ఒకసారైనా ఇలా పెట్టండి బలంగా ఉంటారు!
పల్లీలు, పుట్నాలపప్పు లేకుండానే "చిక్కటి చట్నీ" - ఇలా చేస్తే ఇడ్లీ, దోసెల్లోకి సూపర్!