ETV Bharat / offbeat

లంచ్ బాక్సుల్లోకి సూపర్ రెసిపీ - అన్నీ కలిపేసి కుక్కర్​లో చేసుకోవడమే! - EASY RECIPE

ఈ వేసవిలో ఇలాంటి రెసిపీ ట్రై చేయండి - లంచ్ బాక్సుల్లోకి చాలా బాగుంటుంది

lunch_box_recipe
lunch_box_recipe (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 18, 2025 at 12:01 PM IST

3 Min Read

Lunch box recipe : ఎండాకాలం ఆఫీస్ లంచ్ బాక్సుల్లోకి ఏం వండి పెట్టాలా? అని ఆలోచిస్తున్నారా? ఎప్పుడూ తెల్లన్నం, కర్రీ, చారు కాకుండా ఇలా ఓ సారి ట్రై చేయండి సింపుల్ గా ఉంటుంది. 15నిమిషాల్లో కుక్కర్​లోనే తయారు చేసుకోవచ్చు. ఇది పులగం మాదిరిగా ఉన్నా ఏదైనా కర్రీ, చట్నీ కలుపుకొని తింటే చాలు. ఎంతో రుచిగా ఉంటుంది.

చేప ఏదైనా సరే ఇలా ఇగురు పెట్టి చూడండి! - చిక్కని గ్రేవీ కమ్మగా, కారంగా నోరూరిస్తుంది

lunch_box_recipe
lunch_box_recipe (ETV Bharat)

కావాల్సిన పదార్థాలు

  • బియ్యం - 1 గ్లాసు
  • పచ్చి పెసలు - అరగ్లాసు
  • నూనె - 3 టేబుల్ స్పూన్లు
  • ఆవాలు - 1 టీ స్పూన్
  • జిలకర - అర టీ స్పూన్
  • పచ్చి శనగపప్పు - 1 టీ స్పూన్
  • మినప్పపుప్పు - 1 టీ స్పూన్
  • వెల్లుల్లి రెమ్మలు - 5 లేదా 6
  • కరివేపాకు - 1 రెమ్మ
  • పచ్చిమిర్చి - 3
  • ఉల్లిపాయలు - 2 మీడియం సైజు
  • టమోటా - 2
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కారం - ఒకటిన్నర టీ స్పూన్
  • పసుపు - అర టీ స్పూన్
  • జీలకర్ర పొడి - అర టీ స్పూన్
  • ధనియాల పొడి - 2 టీ స్పూన్లు
  • కొత్తి మీర తరుగు- కొద్దిగా
  • నెయ్యి - 1 టేబుల్ స్పూన్
lunch_box_recipe
lunch_box_recipe (ETV Bharat)

తయారీ విధానం

  • ముందుగా ఇంట్లో వాడుకునే బియ్యం లేదా బాస్మతి బియ్యం తీసుకుని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చి పెసలు లేదా పెసర పప్పు ఏదైనా తీసుకోవచ్చు. పెసర్లు అయితే పొట్టు ఉండడం వల్ల రుచి బాగుంటుంది. ఈ రెండింటిని రెండు సార్లు నీళ్లు పోసుకుని శుభ్రం చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత బియ్యం, పెసర్లు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా పది లేదా 15 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది.
  • ఇపుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్​లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల్ నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, మినప్పపుప్పు వేయించుకోవాలి. ఆ తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా కరివేపాకు, పచ్చి మిర్చి చీలికలు కూడా వేసుకుని మగ్గించాలి.
  • రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలను సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడే వరకు అంటే, మీడియం ఫ్లేమ్​లో 3 నిమిషాలు ఉడికిస్తే చాలు. ఆ తర్వాత మరో రెండు చిన్న టమోటా ముక్కలు కూడా వేసుకుని ఉడికించుకోవాలి. ఇందులో ఉప్పు వేసుకోవడం వల్ల టమోటా ముక్కలు తొందరగా ఉడికిపోతాయి.
  • 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్​లో వేయించుకున్న తర్వాత కారం, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. అవసరమైతే గరం మసాలా కూడా వాడుకోవచ్చు. ఇపుడు అన్నింటిని బాగా కలుపుకుని ముందుగా నానబెట్టుకున్న బియ్యం, పెసర్లను వేసుకుని లో ఫ్లేమ్​లో కాస్త వేయించాలి.
  • ఈ సమయంలో మరీ ఎక్కువగా కలిపితే బియ్యం విరిగిపోయే చాన్స్ ఉంది. మరీ కలపకుండా లైట్​గా మగ్గిస్తే చాలు. ఇప్పుడు బియ్యం తీసుకున్న గ్లాసుతో మూడు గ్లాసుల నీళ్లు పోసుకుని కలుపుని ఉప్పు రుచి చూసుకోవాలి. అవసరమైతే ఈ పాయింట్​లోనే కలుపుకోవాలి. ఆ తర్వాత కొత్తి మీర తరుగు, నెయ్యి వేసుకుని బాగా కలుపుకుని కుక్కర్​ మూత పెట్టి మీడియం ఫ్లేమ్​లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
  • ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్​ మూత తీసి ఒక చెంచా నెయ్యి వేసుకుంటే చాలు.

"కమ్మగా, కారంగా ఉంటా - నా పేరు చెప్పుకోండి!" - పాతకాలం నాటి ఈ రెసిపీ మీకు తెలుసా?

"జొన్న చపాతీలు" రోజూ చేసుకోవచ్చు - ఇలా ట్రై చేయండి - పెనంపై పొంగుతాయి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.