ETV Bharat / offbeat

రుచికరమైన "పెసరపప్పు, సేమియా కేసరి" - స్వీట్​గా చేసుకోవచ్చు, ప్రసాదంలో పెట్టొచ్చు! - PESARAPAPPU SEMIYA KESARI

మీకు కేసరి అంటే ఇష్టమా? - అయితే ఈ పెసరపప్పు సేమియా కేసరి తప్పక ట్రై చేయండి!

Pesarapappu Semiya Kesari in Telugu
Pesarapappu Semiya Kesari in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 18, 2025 at 3:29 PM IST

2 Min Read

Pesarapappu Semiya Kesari in Telugu : సాధారణంగా ఇంట్లో పూజలు, వ్రతాలు చేస్తున్న సమయంలో బొంబాయి రవ్వ, సేమియాతో కేసరి చేస్తుంటారు. అలాగే పుట్టిన రోజు వేడుకలు, పెళ్లి రోజు సందర్భంగా, ఎప్పుడైనా స్వీట్​ తినాలపిస్తే సేమియా పాయసం చేసుకొని తింటారు. అయితే, ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి పెసరపప్పు సేమియాతో ఇలా కేసరి ట్రై చేయండి. పెసరపప్పు, డ్రైఫ్రూట్స్​తో చేసిన ఈ కేసరి ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఏదైనా స్వీట్​ చేయమని అడిగితే నిమిషాల్లోనే ప్రిపేర్​ చేసి పెట్టొచ్చు. మరి ఈ సేమియా కేసరి తయారీ విధానం మీ కోసం.

Pesarapappu
Pesarapappu (Getty Images)

పెసరపప్పు సేమియా కేసరికి కావాల్సిన పదార్థాలు

  • నెయ్యి - సరిపడా
  • సేమియా - కప్పు
  • పెసరపప్పు - అరకప్పు
  • పచ్చి కొబ్బరి ముక్కలు - పావు కప్పు
  • జీడిపప్పు - 10
  • కిస్​మిస్ - 15
  • అరటీస్పూన్​ - యాలకుల పొడి
  • చక్కెర - రుచికి సరిపడా
Ghee
Ghee (Getty Images)

శ్రీవారి కళ్యాణోత్సవం, సేవల్లో పాల్గొంటారా? - తేదీలను ప్రకటించిన టీటీడీ!

తయారీ విధానం

  • ముందుగా పెసరపప్పు శుభ్రంగా రెండుమూడు సార్లు కడిగి గ్లాసున్నర వాటర్​ పోసి అరగంటపాటు నానబెట్టుకోవాలి. ఆపై గిన్నె స్టవ్​పై పెట్టి పెసరపప్పు మెత్తగా ఉడికించుకోండి.
  • పెసరపప్పు మెత్తగా ఉడికిన తర్వాత గిన్నె తీసి పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు స్టవ్​ పై కడాయి పెట్టి టేబుల్​స్పూన్​ నెయ్యి వేసి కరిగించండి.
  • వేడివేడి నెయ్యిలో పావు కప్పు పచ్చికొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి.
  • తర్వాత స్టవ్ లో ఫ్లేమ్​లో అడ్జస్ట్​ చేసి జీడిపప్పు, కిస్​మిస్ వేసి వేయించుకోండి. ​
  • జీడిపప్పు దోరగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు అదే కడాయిలో టేబుల్​స్పూన్​ నెయ్యి వేసి కరిగించండి.
Pesarapappu Semiya Kesari
Pesarapappu Semiya Kesari (ETV Bharat)
  • వేడివేడి నెయ్యిలో సేమియా వేసి దోరగా ఫ్రై చేయండి.
  • సేమియా మంచి రంగు వచ్చిన తర్వాత ఒక గ్లాసు వేడి నీళ్లు పోసి సేమియా ఉడికించుకోండి.
  • సేమియా సగం వరకు ఉడికిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పెసరపప్పు వేసి కలుపుతూ ఫ్రై చేసుకోండి.
  • కేసరి కాస్త దగ్గరగా అయ్యాక అరటీస్పూన్​ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోండి.
  • ఆపై కేసరీలో రుచికి సరిపడా చక్కెర వేసి బాగా కలుపుకోండి.
  • పంచదార కరిగి కేసరి కాస్త దగ్గరయ్యే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి.
  • తర్వాత టేబుల్​స్పూన్​ నెయ్యి వేసి కలపండి. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్​ వేసి బాగా కలిపి స్టవ్​ ఆఫ్​ చేయండి.
  • అంతే ఇలా సింపుల్​గా ప్రిపేర్​ చేసుకుంటే పెసరపప్పు సేమియా కేసరి రెడీ!

ఈ పెసరపప్పు సేమియా కేసరి చల్లారిన తర్వాత కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. పెసరపప్పు సేమియా కేసరి తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.

రుచికరమైన "బ్రోకలీ మసాల కర్రీ"- 'హెల్త్ బెనిఫిట్స్' తెలిస్తే అస్సలు వదలరు!

లంచ్ బాక్సుల్లోకి సూపర్ రెసిపీ - అన్నీ కలిపేసి కుక్కర్​లో చేసుకోవడమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.