ETV Bharat / offbeat

శరీరానికి చలువ చేసే "పెసరపప్పు చారు" -సింపుల్​గా ఇలా చేసేయండి- టేస్ట్​ అద్దిరిపోతుంది! - PESARA PAPPU CHARU

కమ్మటి పెసరపప్పు చారు -ఈ రెసిపీతో పిల్లలు కడుపునిండా అన్నం తింటారు!

Pesara Pappu Charu Recipe in Telugu
Pesara Pappu Charu Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 26, 2025 at 11:56 AM IST

2 Min Read

Pesara Pappu Charu Recipe in Telugu : ఈ వేసవి కాలంలో చాలా మంది అన్నంలోకి పప్పుచారు, సాంబార్​, రసం వంటివి లేకపోతే ఎక్కువగా తినలేరు. పప్పుచారు ఉంటే రెండు ముద్దలు ఎక్కువే తింటారు. సాధారణంగా ఎక్కువమంది కందిపప్పుతో పప్పుచారు చేస్తుంటారు. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి పెసరపప్పుతో పప్పుచారు చేయండి. ఈ పప్పుచారు రుచి చాలా బాగుంటుంది. ఈ పప్పుచారుతో అన్నం పిల్లలు ఇష్టంగా తింటారు. మరి ఈజీగా పెసరపప్పు చారు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • పెసరపప్పు - ఒక కప్పు
  • పసుపు - పావు టీస్పూన్
  • వాటర్ - తగినన్ని
  • పచ్చిమిర్చి - 3
  • టమోటాలు - 3
  • చింతపండు - ఉసిరికాయ సైజు
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • కారం - టీస్పూన్​

"రోజూ ఇదొక్క ముక్క తింటే చాలు - గ్యాస్ సమస్య రాదు, పైత్యం తగ్గిపోతుంది!"

తాలింపు కోసం

  • నూనె - 2 టీ స్పూన్లు
  • జీలకర్ర - అరటీస్పూన్
  • ఆవాలు - అరటీస్పూన్
  • ఎండుమిర్చి - 3
  • ఇంగువ - పావు టీస్పూన్
  • కరివేపాకు - 2
  • వెల్లుల్లి రెబ్బలు - 5
  • ఉల్లిపాయ - 1

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన టమోటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలుగా కట్​ చేసుకోవాలి.
  • అలాగే చింతపండు 10 నిమిషాలు నీటిలో నానబెట్టిన తర్వాత చిక్కటి చింతపండు రసం రెడీ చేసి గిన్నెలో పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక బౌల్​లో పెసరపప్పును తీసుకొని రెండుసార్లు శుభ్రంగా కడగండి.
  • తర్వాత స్టవ్​పై కుక్కర్​ పెట్టి పెసరపప్పు వేయండి. ఇందులో పెసరపప్పు మునిగేంత వరకు నీళ్లు పోయండి. అలాగే టమోటా, పచ్చిమిర్చి ముక్కలు వేసి కుక్కర్​పై మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్​లో ఉడికించుకోవాలి.
  • ఆపై కుక్కర్లో ఆవిరి​ మొత్తం పోయిన తర్వాత పప్పుగుత్తితో పెసరపప్పు బాగా మెదుపుకోవాలి. ఇందులోనే మూడు కప్పుల నీళ్లు, పసుపు, టీస్పూన్​ కారం, రుచికి సరిపడా ఉప్పు, కరివేపాకు, చిక్కటి చింతపండు రసం యాడ్​ చేయాలి.
  • ఇప్పుడు కుక్కర్​ని స్టవ్​పై పెట్టి మీడియం ఫ్లేమ్​లో 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి కుక్కర్​ పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు తాలింపు కోసం స్టవ్​పై గిన్నె పెట్టండి. ఇందులో 2 టేబుల్​స్పూన్లు నూనె వేసి వేడి చేయండి. ఆపై ఆవాలు, జీలకర్ర, పావు టీస్పూన్​ ఇంగువ వేసి ఫ్రై చేయండి. తర్వాత ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా చేసిన వెల్లుల్లి, కరివేపాకు వేసి వేయించండి.
  • ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఆనియన్స్​ గోల్డెన్​ కలర్లో వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పప్పుచారు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి.
  • ఓ రెండు నిమిషాలు పప్పుచారు మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్​ చేయాలి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు చారు రెడీ!

వేడివేడి అన్నంతో ఈ పప్పుచారు చాలా రుచిగా ఉంటుంది. పెసరపప్పు చారు తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ఇలా ఇంట్లో ప్రయత్నించండి!

పెసర పునుగుల్లో ఇదొక్కటి కలిపి చేయండి! - "ఈ సీక్రెట్" చాలామందికి తెలియదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.