ETV Bharat / offbeat

రోజూ ఈ చట్నీల గొడవెందుకు? - ఒక్కసారి ఇలా "పెరుగు పులస" చేసి పెట్టుకుంటే సరిపోదూ! - PERUGU PULASA PACHADI

నోరూరించే "పెరుగు పులస పచ్చడి"- వేడివేడి అన్నంతో పాటు ఏ టిఫిన్​లోకైనా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది!`

Perugu Pulasa Pachadi in Telugu
Perugu Pulasa Pachadi in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 26, 2025 at 5:05 PM IST

2 Min Read

Perugu Pulasa Pachadi in Telugu : సాధారణంగా ఇంట్లో ఇడ్లీ, దోసె, మైసూర్​ బోండా ఇలా ఏ టిఫిన్ చేసినా పల్లీ చట్నీ, టమోటా పచ్చడి తప్పకుండా ఉండాల్సిందే. అయితే, టిఫిన్​ చేసిన ప్రతిసారీ ఇలా చట్నీ ప్రిపేర్​ చేయాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అలా కాకుండా ఓసారి ఈ పద్ధతిలో పెరుగు పులస చట్నీ రెడీ చేసుకొని పెట్టుకోండి. ఈ చట్నీ ఒక్కటి ఉంటే చాలు తృప్తిగా టిఫిన్​ చేయచ్చు. మరి ఈజీగా పెరుగు పులస పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. పరిశుభ్రత పాటిస్తే వారం రోజులు నిల్వ ఉంటుంది.

నోరూరించే "పచ్చిమామిడి కొబ్బరి చట్నీ" - ఇడ్లీ, దోసెల్లోకి రుచి బాగుంటుంది

Perugu
Perugu (Getty Images)

పెరుగు పులస పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు

  • పెరుగు - 300 గ్రాములు
  • ఎండుమిర్చి - 25
  • ధనియాలు - టేబుల్​స్పూన్
  • జీలకర్ర - టీస్పూన్​
  • పొట్టు తీసిన వెల్లుల్లి - 10
  • ఉప్పు - రుచికి సరిపడా

తాలింపు కోసం

  • ఆయిల్ - 2 టేబుల్​స్పూన్లు
  • పచ్చిశనగపప్పు - టేబుల్​స్పూన్
  • మినప్పప్పు - టేబుల్​స్పూన్
  • ఆవాలు - అరటీస్పూన్
  • జీలకర్ర - అరటీస్పూన్
  • ఎండుమిర్చి - 4
  • ఇంగువ - చిటికెడు
  • కరివేపాకు - 2
  • అల్లం తరుగు - టేబుల్​స్పూన్​
Perugu Pulasa Pachadi
Perugu Pulasa Pachadi (ETV Bharat)

పెరుగు పులస పచ్చడి తయారీ విధానం

  • ముందుగా ఎండుమిర్చి తొడిమలు తీసేసి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఆపై గింజలు తీసేసి ఎండుమిర్చి ముక్కలు ఒక ప్లేట్​లో పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి కోసం ఎండుమిర్చి గింజలు ఉండకూడదు.
  • ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు తీసుకోండి. ఇందులో టీగ్లాసు వాటర్​ పోసి బీటర్​ సహాయంతో ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పెరుగు క్రీమ్​ మాదిరిగా ఉండాలి.
  • ఇప్పుడు ఇందులో గింజలు తీసేసిన ఎండుమిర్చి ముక్కలు వేయండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై బౌల్​పై మూత పెట్టి కనీసం గంటపాటు పెరుగులో మిరపకాయలు నానబెట్టుకోవాలి.
Perugu Pulasa Pachadi
Perugu Pulasa Pachadi (ETV Bharat)
  • అనంతరం ఒక మిక్సీ గిన్నెలోకి నానబెట్టిన ఎండుమిర్చి పెరుగు మిశ్రమం వేసుకోండి. ఇందులోనే టేబుల్​స్పూన్ ధనియాలు, టీస్పూన్​ జీలకర్ర, పొట్టు తీసిన వెల్లుల్లి వేసి మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • పచ్చడి తాలింపు కోసం స్టవ్​పై కడాయి పెట్టండి. ఇందులో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి ఫ్రై చేయండి. ఆపై అల్లం తరుగు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్​ చేసుకున్న ఎండుమిర్చి పచ్చడి వేసి బాగా కలపండి.
  • ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి 5 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
  • అంతే ఇలా సింపుల్​గా ప్రిపేర్​ చేసుకుంటే నోరూరించే పెరుగు పులస పచ్చడి మీ ముందుంటుంది. ఈ చట్నీ వేడివేడి అన్నంతోపాటు, ఇడ్లీ, దోసె వంటి టిఫిన్స్​లోకి రుచి అద్భుతంగా ఉంటుంది.
  • పెరుగు పులస పచ్చడి తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి.

ఆంధ్రా స్టైల్ "గుత్తి వంకాయ పులుసు" - ఇలా పెట్టారంటే ఇల్లంతా ఘుమఘుమలే!

శరీరాన్ని చల్లబరిచే "జిగర్తాండ" - ఈ మధురై రెసిపీ గొంతు దిగుతుంటే అమృతమే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.