ETV Bharat / offbeat

బూజు పట్టకుండా "నిమ్మకాయ పచ్చడి" - పక్కా కొలతలతో ఇలా పెట్టండి! - ఏడాది దాటినా తాజాగానే! - PERFECT LEMON PICKLE AT HOME

- నోరూరించే "నిమ్మకాయ నిల్వ పచ్చడి" - నిత్యం ఫ్రెష్​గా ఆస్వాదిస్తారు!

LEMON PICKLE
Nimmakaya Nilva Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 18, 2025 at 12:55 PM IST

3 Min Read

Nimmakaya Nilva Pachadi Making Process : వేసవి కాలం వచ్చిందంటే చాలు మెజార్టీ పీపుల్ నిల్వ పచ్చళ్లు ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అవుతుంటారు. అందులో మామిడి తర్వాత ఎక్కువ మంది నిమ్మకాయ నిల్వ పచ్చడి పెడుతుంటారు. కానీ, చాలా మందికి ఈ పచ్చడిని సరైన పద్ధతిలో పెట్టడం తెలియదు. దాంతో పెట్టిన కొన్ని రోజులకే బూజుపట్టడం, రంగు మారడం జరుగుతుంటుంది. అలాకాకుండా ఓసారి ఈ పక్కా కొలతలతో "నిమ్మకాయ నిల్వ పచ్చడిని" ప్రిపేర్ చేసుకోండి. పర్ఫెక్ట్​గా కుదరడమే కాకుండా సంవత్సరం పైనే తాజాగా నిల్వ ఉంటుంది! మరి, ఆ పక్కా కొలతలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • నిమ్మకాయలు - 1 కేజీ
  • దొడ్డు ఉప్పు - 200 గ్రాములు
  • పసుపు - అరటీస్పూన్
  • కారం - 200 గ్రాములు

పోపు కోసం :

  • నూనె - 100 గ్రాములు
  • ఆవాలు - 1 టీస్పూన్
  • మినపప్పు - 1 టేబుల్​స్పూన్
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • శనగపప్పు - 1 టేబుల్​స్పూన్
  • ఎండుమిర్చి - 4

పక్కా కొలతలతో "ఉల్లిపాయ నిల్వ పచ్చడి" - ఇలా పెడితే టేస్ట్​ అదుర్స్​ - ఆరు నెలలు నిల్వ!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా తాజా నిమ్మకాయలను తీసుకోవాలి. దెబ్బతిన్నవి అస్సలే తీసుకోవద్దు. వాటిని శుభ్రంగా కడగాలి.
  • ఆ తర్వాత తడి లేకుండా ఫ్యాన్ కింద ఒక క్లాత్​పై నిమ్మకాయలను ఆరబెట్టుకోవాలి.
  • అలాగే, పచ్చడిలోకి తీసుకునే ఉప్పుని గంటసేపు ఎండకు ఉంచాలి. ఇలా ఉంచడం ద్వారా అందులో ఏమైనా చెమ్మ ఉంటే ఆరిపోయి డ్రైగా అవుతుంది.
  • ఇప్పుడు కేజీ నిమ్మకాయలకు(25 కాయలు) 200 గ్రాముల చొప్పున ఉప్పు, కారం చక్కగా సరిపోతాయి.
  • ఆరబెట్టుకున్న నిమ్మకాయలలో 6 కాయలను పక్కకు తీసుకొని మిగతా వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్క నిమ్మకాయను 8 భాగాలుగా కట్ చేసుకోవాలి.
  • ఇలా అన్నింటినీ కట్ చేసుకొని ఒక బౌల్​లో వేసుకొని పక్కనుంచాలి. ఒకవేళ మీకు గింజలు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు.
  • ఇప్పుడు పక్కకు తీసుకున్న 6 నిమ్మకాయలను కట్ చేసి ఒక చిన్న గిన్నెలో రసాన్ని పిండుకోవాలి.
  • అనంతరం మిక్సీ జార్ తీసుకొని అందులో గంటపాటు ఆరబెట్టిన ఉప్పును తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కనుంచాలి.
  • ఆ తర్వాత మీరు ఊరగాయ పెట్టుకోవాలనుకుంటున్న డబ్బా లేదా గాజు సీసా(జాడి) తీసుకొని అందులో ముందుగా కట్ చేసుకున్న నిమ్మకాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలి.
  • ఆపై అందులో ముందుగా తీసి పెట్టుకున్న నిమ్మరసం పోసుకోవాలి. అలాగే, గ్రైండ్ చేసుకున్న ఉప్పు, పసుపు వేసుకొని అవి ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి.
  • అనంతరం మూతపెట్టి మూడు నాలుగు రోజులను నిమ్మ ముక్కలను ఊరనివ్వాలి.

కమ్మటి "గోంగూర పండుమిర్చి నిల్వ పచ్చడి" - ఈ లెక్కన పెడితే నిజంగా అమృతమే - ఏడాది నిల్వ!

  • ఆవిధంగా ఊరబెట్టుకున్నాక మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో కారం వేసుకొని ముక్కలకు పట్టేలా మరోసారి బాగా మిక్స్ చేసుకొని పక్కనుంచాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, మినపప్పు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని ఆవాలు చిటపటమనే వరకు వేయించుకోవాలి.
  • ఆవాలు వేగాక అందులో ఎండుమిర్చిని ముక్కలుగా తుంపి వేసుకొని కలిపి స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత తాలింపుని పూర్తిగా చల్లారనివ్వాలి.
  • పోపు పూర్తిగా చల్లారాక దాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసి మొత్తం కలిసేలా కలుపుకొని స్టోర్ చేసుకుంటే చాలు. అంతే, నోరూరించే కమ్మని "నిమ్మకాయ నిల్వ పచ్చడి" రెడీ!
  • మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ సమ్మర్​లో మీరూ ఈ కొలతలతో నిమ్మకాయ నిల్వ పచ్చడిని పెట్టుకోండి.
  • పర్ఫెక్ట్​గా కుదరడమే కాకుండా ఏడాదిపైనే తాజాగా నిల్వ ఉంటుంది!

మునక్కాయలతో చారు, కూరలు రొటీన్​ - ఇలా "నిల్వ పచ్చడి" చేసుకోండి! - టేస్ట్ అద్భుతం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.