ETV Bharat / offbeat

"స్వీట్​షాప్ స్టైల్ పాలకోవా" - ఇంట్లో ఈజీగా చేసుకోండి - నోట్లో వెన్నలా కరిగిపోతుంది! - PALKOVA RECIPE

అందరూ ఇష్టంగా తినే పాలకోవా - ఈ కొలతలు, టిప్స్​తో ట్రై చేయండి, ఎంతో రుచిగా వస్తుంది!

Palkova Recipe in Telugu
Palkova Recipe in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : April 19, 2025 at 1:14 PM IST

2 Min Read

Palkova Recipe in Telugu : స్వీట్​షాప్​కి వెళ్లినప్పుడు అక్కడ ఎన్ని రకాల స్వీట్లున్నా పాలకోవాను చూస్తే మాత్రం కళ్లు తిప్పుకోకుండా ఉండలేరు చాలామంది. నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగే పాలకోవా రుచి అమృతంలా ఉంటుంది. అయితే, పాలు పంచదార ఉంటే చాలు ఇంట్లోనే ఈ స్వీట్​ని ప్రిపేర్​ చేసుకోవచ్చు. ఇలా పాలకోవా చేస్తే టేస్ట్ అచ్చం స్వీట్​షాప్​లానే ఉంటుంది. మరి ఈజీగా పాలకోవా ఇంట్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Milk
Milk (Getty Images)

కావాల్సిన పదార్థాలు

  • చిక్కని పాలు - లీటర్​
  • యాలకుల పొడి-అరటీస్పూన్​
  • చక్కెర - 100 గ్రాములు

పాలకోవా తయారీ విధానం

Sugar
Sugar (Getty Images)
  • ఇందుకోసం ముందుగా స్టవ్​పై మందపాటి కడాయి పెట్టుకోండి. ఇందులో చిక్కటి పాలు పోసి మరిగించండి. పాలకోవా మరింత రుచిగా ఉండటానికి మీరు ఫుల్​ క్రీమ్​ మిల్క్​ యూజ్​ చేయొచ్చు.
  • స్టవ్​ మీడియం ఫ్లేమ్​లో అడ్జస్ట్​ చేసి పాలు చిక్కగా మారేంత వరకు, మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూనే ఉండాలి.
  • పాలపైన వచ్చే మిగడ కడాయికి అతుక్కోకుండా గరిటెతో పాలలోకి కలుపుతూ బాగా మరిగించాలి. ఇలా పాలను గరిటెతో కలపడం వల్ల పాలు అడుగుపట్టకుండా ఉంటాయి. పాలు దగ్గర పడి కోవాగా మారేంత వరకు ఇలానే కలుపుతూనే మరిగించుకోవాలి.
  • పాలు దగ్గర పడిన అనంతరం ఇందులో పంచదార వేసి బాగా కలపండి.
  • షుగర్​ వేసిన తర్వాత కోవా పల్చగా మారుతుంది. మళ్లీ అలాగే పాలను గరిటెతో కలుపుతూ దగ్గరయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఆపై ఇందులోకి యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
Palkova Recipe
Palkova Recipe (ETV Bharat)
  • ఈ సమయంలో పాలకోవాని కొద్దిగా చేతిలోకి తీసుకుని ముద్ద కట్టేలా ట్రై చేయండి. మిశ్రమం ముద్దగా మారితే కోవా పర్ఫెక్ట్​గా రెడీ అయిందని గుర్తుంచుకోండి. ఆ విధంగా కోవా తయారయ్యాక స్టవ్​ ఆఫ్ చేయాలి.
  • పాలకోవా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక గిన్నెతో ప్రెస్​ చేస్తూ 5 నిమిషాలు పూర్తిగా కలపండి.
  • కోవా చల్లారిన అనంతరం చేతితో మరో 5 నిమిషాల ప్రెస్​ చేసుకోండి. ఇలా కోవాని ప్రెస్​ చేసుకోవడం వల్ల పాలకోవా చాలా మృదువు​గా వస్తుంది.
  • తర్వాత కోవాని మీకు నచ్చిన ఆకారంలో చేసుకుంటే ఎంతో తీయని పాలకోవా మీ ముందుంటుంది.
  • పాలకోవా తయారీ విధానం నచ్చితే మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి.

ఈ టిప్స్​తో "స్వీట్​షాప్​ స్టైల్ కలాకండ్" చేసేయండి - ఫస్ట్​ టైమైనా పర్ఫెక్ట్​గా వచ్చేస్తుంది!

"కమ్మటి దొండకాయ పచ్చికారం" - ఇలా చేస్తే ఎప్పటికీ వదలరు - అంత బాగుంటుంది!

"కొర్రమీను చేపల పచ్చడి" - ఈ మసాలతో పెడితే రుచి అద్దిరిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.